Posts

Showing posts with the label assuming the office of Prime Minister at the age of just 35

నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ఎన్నిక

Image
నే పాల్ ప్రధానిగా బాలెంద్ర షాను ప్రధానిగా ఎన్నుకయ్యారు. గురువారం జరిగిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) సమావేశంలో ఆయన్ను పార్లమెంటరీ పార్టీ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈరోజే అధ్యక్ష భవనం శీతల్‌ నివాస్‌లో బాలెన్ నేపాల్ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నిక ద్వారా బాలేంద్ర షా పలు చారిత్రాత్మక రికార్డులను సృష్టించారు. కేవలం 35 ఏళ్ల వయసులోనే ప్రధాని పదవిని చేపట్టి నేపాల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధాన మంత్రిగా ఆయన నిలిచారు. అంతేకాకుండా నేపాల్‌లోని మధేశ్ ప్రాంతం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎన్నికైన తొలి వ్యక్తిగా కూడా బాలెన్ చరిత్రకెక్కారు. ఒకప్పుడు యువతను తన ర్యాప్ సంగీతంతో ఉర్రూతలూగించిన బాలెన్ షా.. నేడు దేశాధినేతగా ఎన్నిక కావడం వెనుక ఓ పెద్ద కథే ఉంది. ముఖ్యంగా జెన్-జీ తిరుగుబాటు వల్లే ఇదంతా సాధ్యం అయింది. తన పాటల ద్వారా దేశంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులపై ప్రజల్లో చైతన్యం నింపిన బాలెన్.. అనతి కాలంలోనే తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. గత ఎన్నికల్లో నాలుగు సార్లు ప్రధానిగా పని చేసిన అనుభవజ్ఞుడు కె.పి.శర్మ ఓలిని చిత్తుగా ఓడించి బాలెన్ తన సత్తా చాటారు.