Posts

Showing posts with the label developed by IIT Madras scientists

చక్కెర స్థాయి చూసుకోవడానికి కొత్త పరికరం కనిపెట్టిన మద్రాస్‌ ఐఐటీ శాస్త్రవేత్తలు

Image
ఐ సీఎంఆర్‌ నిర్వహించిన ఇండియా డయాబెటిస్‌ 2023 అధ్యయనంలో మధుమేహానికి దేశం ప్రపంచ రాజధానిగా మారుతోందని స్పష్టం చేసింది. ప్రతిరోజూ రక్తంలో చక్కెరల మోతాదులను తెలుసుకునేందుకు సూదితో గుచ్చి రక్తం వెలికితీయడం దాన్ని గ్లూకోజు మానిటర్లపై వేసి చూసుకోవడం ఇప్పటివరకూ ఉన్న పద్ధతి. రోజు గుచ్చుకోవడం వల్ల కొంత కాలం తరువాత వేలిచివర్లు మొద్దుబారి పోతూంటాయి. భుజం వెనుకభాగంలో చిన్న మానిటర్‌ను అతికించుకుని సీజీఎంలు అంటే కంటిన్యూయెస్‌ గ్లూకోజ్‌ మానిటర్ల ద్వారా రోజంతా లెక్కించవచ్చు కానీ వీటి ఖరీదు ఎక్కువ. ఒక్కో సీజీఎం సెన్సర్‌ కనీసం రూ. నాలుగు వేల వరకూ ఉంటుంది. పైగా ఈ సెన్సర్‌ను రెండు వారాల తరువాత మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సామాన్యులు వీటిని వాడటం కష్టం. ఈ నేపథ్యంలోనే మద్రాస్‌ ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక చౌకైన గ్లూకోజ్‌ మానిటర్‌ అభివృద్ధిపై పరిశోధనలు చేపట్టారు. ఎలక్ట్రానిక్‌ మెటీరియల్స్‌ అండ్‌ థిన్‌ ఫిల్మ్‌ ల్యాబ్‌కు చెందిన ప్రొఫెసర్‌ పరశురామన్‌ స్వామినాథన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో సీజీఎంలను సరికొత్తగా రూపొందించారు. పలు వినూత్న ఆవిష్కరణలతో, రీ యూజబుల్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, అతితక్కువ విద్యుత్తును ఉప...