Posts

Showing posts with the label 21న మోటోరోలా ఎడ్జ్ 40 నీయో ఆవిష్కరణ

21న మోటోరోలా ఎడ్జ్ 40 నీయో ఆవిష్కరణ

Image
లె నోవోకు చెందిన మోటోరోలా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లలో అందించే బ్రాండ్లలో కూడా ఒకటి. ఇప్పటికే అనువైన బడ్జెట్లో ఉత్తమమైన ఫోన్లను అందిస్తోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్లు పెద్ద సంఖ్యలోనే విడుదలవుతున్నాయి. మోటోరోలా ఎడ్జ్ 40 నీయో ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. వాస్తవానికి ఈ మోడల్ ను ఏప్రిల్ లోనే పరిచయం చేశారు. మోటోరోల్ ఎడ్జ్ 40, మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో మోడళ్లను ఇంతకు ముందే మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే వాటితో పాటు ప్రకటించిన ఈ మోటోరోలా ఎడ్జ్ 40 నియోను మాత్రం మన దేశంలో విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ను సెప్టెంబర్ 21న ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.  మోటోరోలా అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఎక్స్(ట్విట్టర్)లో మోటోరోలా ఇండియా ఈ ఫోన్ విడుదలకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 21న ఇండియన్ మార్కెట్లోకి ఫోన్ రానుందని పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ సూచన ప్రాయక చిత్రాన్ని కూడా విడుదల చేసింది. అది బ్లూ కలర్ లో రెండు కెమెరాలు కలిగి, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ను కలిగి ఉంటుంది.  మై స్మార్ట్ ప్రైస్ నివేదిక ప్రకారం, మోటోరోలా ...