16న మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్ ఫోన్ విడుదల
మో టోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్ ఫోన్ ను సోనీ LYTA లేటెస్ట్ కెమెరా, సూపర్ స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు మరిన్ని ఫీచర్స్ ఉన్నాయని కూడా మోటోరోలా లాంచ్ కంటే ముందే టీజింగ్ చేస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ తో కూడిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించింది. మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్ ఫోన్ లో 6.4 ఇంచ్ సూపర్ HD LTPO స్క్రీన్ తో లాంచ్ అవుతుందట. ఈ స్క్రీన్ 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 10 బిట్ కలర్ సపోర్ట్ స్క్రీన్ మరియు ఇది గొరిల్లా గ్లాస్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను మిలటరీ గ్రేడ్ MIL - STD 810H సర్టిఫికేషన్ తో వస్తుంది. ఇది షాక్, ప్రెజర్, డస్ట్, అధిక వేడిమి మరియు...