Posts

Showing posts with the label BJP State President Samik Bhattacharya announced

మే 9న పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం

Image
ప శ్చిమ బెంగాల్ లో మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తెలిపారు. బరాక్‌పూర్‌లో జరిగిన చివరి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మే 4న తాను తిరిగి వస్తానని, బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరవుతానని ఆయన ప్రకటించారు. ఈ చారిత్రక విజయం తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగన్న 'భయమెరుగని, తల ఎత్తుకుని జీవించే సమాజాన్ని' బెంగాల్‌లో నిర్మిస్తామన్నారు.బెంగాల్‌లో అధికార మార్పిడికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలు వేగవంతమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ఎస్.బి.జోషి, సుజిత్ కుమార్ మిశ్రా ఈరోజు ఢిల్లీ నుంచి కోల్‌కతా చేరుకొని, ఎన్నికల ఫలితాల అధికారిక గెజిట్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) మనోజ్ కుమార్ అగర్వాల్‌కు అందజేయనున్నారు. అనంతరం మే 6న సీఈవో.. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి లాంఛనంగా వివరాలు అందిస్తారు. ఆ వెంటనే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని మమతా బెనర్జీని గవర్నర్ ఆ...