డీఎంకే ప్రభుత్వంలో అవినీతి : విజయ్ వ్యాఖ్యలతో అసెంబ్లీలో తీవ్ర దుమారం : డీఎంకే సభ్యులను బలవంతంగా బయటకు తీసుకెళ్లిన మార్షల్స్
త మిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. గత డీఎంకే ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ విజయ్ ఆరోపణలు చేయడంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఆరోపణలపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంగళవారం సభలో గందరగోళం నెలకొంది. డీఎంకే హయాంలో లోన్ ఈఎంఐ తరహాలో లంచాలు తీసుకున్నారంటూ నిన్న సీఎం విజయ్ ఆరోపించారు. పార్టీ ఫండ్ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని చెబుతూ ఈడీ పత్రాలు, సర్కారియా కమిషన్ నివేదికను ప్రస్తావించారు. అంతేకాదు మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ తదితరుల పేర్లను కూడా విజయ్ ప్రస్తావించారు. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే డీఎంకే విప్ ఈవీ వేలు.. ఈ అంశాన్ని లేవనెత్తారు. సీఎం విజయ్ తన ప్రసంగంలో ప్రస్తావించిన ఈడీ పత్రాలు, సర్కారియా కమిషన్ నివేదికకు సంబంధించిన వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. అయితే విజయ్ ప్రస్తావించిన అంశాలు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న అధికారిక పత్రాల్లో ఉన్నవేనని స్పీకర్ జేసీడీ ప్రభ...