Posts

Showing posts with the label CEO & MDగా సుట్సుము ఒటాని

అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన హోండా !

Image
ప్ర ముఖ వాహన తయారీ సంస్థ హోండా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన బైక్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో బైక్ల విక్రయాలు జరుగుతున్నాయి. వేలలో కాదు ఏకంగా లక్షల సంఖ్యలో ఈ బైకుల విక్రయాలు జరుగుతున్నాయి. కాగా డిసెంబర్ 2022లో విక్రయించిన 233,151 యూనిట్ల నుండి 286,101 యూనిట్లకు పెరిగాయి, దింతో ఈ సంవత్సరానికి 22.71 శాతం వృద్ధిని సాధించింది. కాగా, ఎగుమతులు 82.27 శాతం వృద్ధితో 31,022 యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం ఇదే నెలలో 17,020 యూనిట్లు విదేశాలకు రవాణా అయ్యాయి. అయితే ప్రముఖ జపనీస్ ద్విచక్ర వాహన బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అభివృద్ధిలో తాజాగా కూడా మరో గొప్ప విజయాన్ని సాధించింది. 2023 క్యాలెండర్ ఇయర్‌లో 43,84,559 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 2023 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్న గణాంకాల ప్రకారం డిసెంబర్ 2023లోనే 3,17,123 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో దేశీయంగా 2,86,101 యూనిట్ల అమ్మకాలు, 31,022 యూనిట్ల ఎగుమతులు ఉన్నాయి. డిసెంబరు 2022తో పోలి...