Posts

Showing posts with the label BRICS Business Forum in Delhi

ప్రధాని మోతో ఫొటో దిగేందుకు పోటీపడ్డ విదేశీ ప్రతినిధులు

Image
ఢి ల్లీలో జరుగుతున్న బ్రిక్స్  సదస్సులో బ్రిక్స్ బిజినెస్‌ ఫోరమ్‌లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు విదేశీ ప్రతినిధులు ప్రధాని మోడీతో ఫొటో దిగేందుకు తీవ్ర ఉత్సాహం చూపించారు. సదస్సు ప్రాంగణంలో మోడీ నడుచుకుంటూ వస్తుండగా ఆయన వద్దకు వచ్చి 'సర్‌, ప్లీజ్‌.. మేం మీతో ఒక ఫొటో దిగొచ్చా?' అని అభ్యర్థించారు. దీనికి ప్రధాని చిరునవ్వుతో 'ఎస్‌.. కచ్చితంగా' అంటూ ఎంతో ఆప్యాయంగా వారితో ఫొటో దిగారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన వీడియోను బీజేపీ అస్సాం శాఖ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకోగా, ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రధాని మోడీ ప్రతినిధులతో ఫొటో దిగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ పక్కకు జరిగి ఆయనకు దారి ఇవ్వడం విశేషంగా నిలిచింది.