Posts

Showing posts with the label American Red Cross Declares National Blood Supply Crisis

నేషనల్ బ్లడ్ సప్లై క్రైసిస్ ను ప్రకటించిన అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ : రక్తదానం చేయడానికి ముందుకు వచ్చేవారికి వినూత్న ఆఫర్లు

Image
అ మెరికా దేశవ్యాప్తంగా రక్తం నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో 'అమెరికన్ రెడ్ క్రాస్' సంస్థ ఏకంగా నేషనల్ బ్లడ్ సప్లై క్రైసిస్ ప్రకటించింది. నిమిషం లేట్ అయినా ప్రాణాలు పోయే అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే 'O - పాజిటివ్' బ్లడ్ గ్రూప్ నిల్వలు దేశమంతటా కలిపినా కనీసం ఒక్క రోజుకు కూడా సరిపోవని తెలియడంతో హాస్పిటళ్లు, వైద్య వర్గాలు ఉలిక్కిపడ్డాయి. రెడ్ క్రాస్ సంస్థ తన సుదీర్ఘ చరిత్రలోనే ఇలా జాతీయ స్థాయి రక్త సంక్షోభాన్ని ప్రకటించడం ఇది కేవలం రెండోసారి మాత్రమే! గతంలో 2022లో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి అత్యవసర పరిస్థితి వచ్చింది. వేసవి తీవ్రత పెరగడం, అడవుల్లో కార్చిచ్చు మూలంగా ఎగసిపడిన పొగ వల్ల వాయు కాలుష్యం పెరగడం, వాతావరణ మార్పుల వల్ల జనం అనారోగ్యం బారిన పడటంతో రక్తదానం చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. జూన్ నెల నుంచే దాదాపు 25 శాతం దాకా రక్త సేకరణ పడిపోవడంతో ఈ రోజు పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా 'O - పాజిటివ్' బ్లడ్ గ్రూప్ దొరకక ఆసుపత్రులు అల్లాడిపోతున్నాయి. అత్యవసరంగా ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు, వారి బ్లడ...