Posts

Showing posts with the label $1 billion will be provided under the Extended Fund Facility

పాకిస్థాన్‌కు 1.2 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ రుణం మంజూరు

Image
రెండు వేర్వేరు ఆర్థిక సహాయ ఒప్పందాల కింద పాకిస్థాన్‌కు 1.2 బిలియన్ డాలర్లు విడుదల చేసేందుకు ఐఎంఎఫ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో సుమారు 1 బిలియన్ డాలర్లు ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద, మిగిలిన 210 మిలియన్ డాలర్లు రెసిలియెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ కింద అందనున్నాయి దాయాదికి. ఈ కొత్త నిధులు వచ్చే వారం ప్రారంభంలో పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంకుకు చేరుతాయని, దీనివల్ల దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 17 బిలియన్ డాలర్లకు పైగా పెరుగుతాయని అంచనా. మొత్తం 8.4 బిలియన్ డాలర్ల విలువైన రెండు ప్యాకేజీలకు గాను.. పాకిస్థాన్ ఇప్పటివరకు 4.5 బిలియన్ డాలర్లను రుణంగా పొందింది ఐఎంఎఫ్ నుంచి. 2024 సెప్టెంబర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. 37 నెలల కాలంలో మొత్తం 7 బిలియన్ డాలర్లను ఐఎంఎఫ్ అందించనుంది. జూలై-డిసెంబర్ 2025 కాలానికి సంబంధించి పాకిస్థాన్ ఆర్థిక పనితీరును సమీక్షించిన తర్వాతే ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ పన్ను వసూళ్లలో వెనుకబడి ఉండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. చిల్లర వర్తకుల నుంచి రావాల్సిన ఆదాయపు పన్ను ఐఎంఎఫ్ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయింది. ఈ లోటును...