Posts

Showing posts with the label 4జీ కంటే 5జీ విస్తరణ ఖర్చు తక్కువే !

4జీ కంటే 5జీ విస్తరణ ఖర్చు తక్కువే !

Image
దేశ టెలికాం పరిశ్రమలో 4Gలాగా 5G సేవల రోల్‌అవుట్ క్యాపిటల్ తక్కువగా వుండే అవకాశాలు కన్పిస్తున్నాయి.  రాబోయే మూడు సంవత్సరాల్లో దేశంలో 70 శాతం ఏరియాను 5జీ కవరేజీలోకి తెచ్చేందుకు భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ రూ. 45,400 కోట్లు మూల ధన వ్యయం చేయనుంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ దేశంలో 75 శాతం మేర 5జీ కవరేజీని విస్తరించడానికి రూ. 65,500 కోట్లు ఖర్చు చేయనుంది. అయితే ఈ మూలధన వ్యయం అనేది 4G నెట్ వర్క్ విస్తరణకు గతంలో ఈ రెండు టెలికామ్ కంపెనీలు వెచ్చించిన దాని కంటే తక్కువే. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి భారతి ఎయిర్‌టెల్ 85%, జియో 95% 5జీ కవరేజీని సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాయి. అప్పటివరకు అంటే.. వచ్చే నాలుగైదు ఏళ్లలో ఎయిర్‌టెల్ రూ. 66,600 కోట్లు, జియో రూ. 94,000 కోట్ల మూలధన వ్యయం చేయనున్నాయి. ఎయిర్‌టెల్ మూడేళ్లలో రూ.75,000 కోట్ల 5జీ క్యాపెక్స్‌కు మార్గదర్శకంగా నిలిచింది. ఈ రెండు కంపెనీలు 2023, 2024 ఆర్ధిక సంవత్సరాలలో 5జీ నెట్ వర్క్ విస్తరణకు ఎక్కువ ఖర్చు చేయనున్నాయి.2025 నుంచి వాటి మూలధన ఖర్చులు తగ్గిపోతాయి.ఈనేపథ్యంలో Jio ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల విలువైన 5G పెట్టుబడులను ప్రకటించింది....