Posts

Showing posts with the label and Neck

కూతురి పెళ్లి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించిన తండ్రి : కత్తితో కూతురి కడుపు, ఛాతీ, మెడపై తీవ్రంగా పొడిచిన కిరాతుకుడు

Image
క ర్ణాటకలోని బెంగళూరులో పెళ్లి, వివాహం, డబ్బు విషయంలో విభేదాలతో ఓ తండ్రి తన కూతురి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కర్కశంగా వ్యవహరించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో లక్ష్మీ దుర్గ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది.  ఆమె తండ్రి నాగేంద్ర క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల నాగేంద్ర తన కుమార్తె పెళ్లి కోసం ఒక సంబంధం ఖాయం చేశాడు. అయితే, కూతురి చదువు, కెరీర్ కోసం తాను భారీగా ఖర్చు చేశాననే నెపంతో వరుడి కుటుంబం నుండి రూ. 40 లక్షలు డిమాండ్ చేశాడు. అంతేకాకుండా లక్ష్మీ దుర్గ ప్రతి నెలా వచ్చే తన జీతం మొత్తాన్ని తనకే ఇవ్వాలని నాగేంద్ర ఒత్తిడి తెచ్చేవాడు. దీన్ని నాగేంద్ర భార్య, కుమార్తె లక్ష్మీ దుర్గ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీనికితోడు పెళ్లివారిని రూ. 40 లక్షలు ఎదురు కట్నం డిమాండ్‌ చేశాడు. దీన్ని లక్ష్మి తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆమె మీద పగబట్టి జూలై25 న కన్నకూతురిపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు. కుమార్తెను కలిసే నెపంతో కాలేజిలోని హెచ్...