Posts

Showing posts with the label dampened by global tensions

నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Image
దే శీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల్లో అస్థిరత, వడ్డీ రేట్లు మరింత పెరగొచ్చనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు ఐటీ, మెటల్‌, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. కార్పొరేట్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్‌తో పాటు ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు ప్రధానంగా నష్టపోవడంతో మార్కెట్లు చివరకు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 382.62 పాయింట్లు కోల్పోయి 76,132.81 వద్ద స్థిరపడింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 118.55 పాయింట్లు తగ్గి 23,779.15 వద్ద ముగిసింది. రెండూ సుమారు 0.5 శాతం నష్టపోయాయి.