విశాఖపట్టణంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన డామినర్ స్పోర్ట్స్ బైక్ : ఇద్దరు దుర్మరణం!
వి శాఖపట్టణంలోని తాటిచెట్లపాలెం వద్ద మంగళవారం ఉదయం ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో వాహనదారులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో గాయాలు స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి 600 మీటర్ల దూరం వరకు డామినర్ స్పోర్ట్స్ ద్విచక్రవాహనం ముందుకు దూసుకెళ్లింది. వెంటనే స్థానికులు సాయం చేయడంతో ఒక యువకుడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ప్రమాదం అనంతరం రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. అందుకే బైక్ అదుపుతప్పిందని పేర్కొన్నారు. మృతుల డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం పంపించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.