October 2025

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ 'డిఫెన్స్ కోఆపరేషన్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్'పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం పదేళ్లపాటు అమలులో ఉండనుంది. దీని ద్వారా ఇరు దేశాల మధ్య సాంకేతిక, వ్యూహాత్మక, భద్రతా రంగాల్లో మరింత బలమైన సహకారం కొనసాగనుంది. కౌలాలంపూర్‌లో జరిగిన సమావేశంలో ఇరు దేశాల ప్రతినిధి బృందాలు పాల్గొని వివిధ అంశాలపై చర్చించాయి. ఈ సందర్భంగా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, 'భారత్-అమెరికా రక్షణ సంబంధాలు మన ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రధాన స్థంభం. ఈ ఒప్పందం భవిష్యత్తులో మన రక్షణ సహకారానికి మార్గదర్శకంగా ఉంటుంది' అని అన్నారు. ఆయన మరింతగా వివరిస్తూ, ఉమ్మడి సైనిక సాధనాలు, సాంకేతిక మార్పిడి, రక్షణ ఉత్పత్తి రంగాల్లో భాగస్వామ్యం ద్వారా ఇరు దేశాలు పరస్పర భద్రతను బలోపేతం చేసుకోగలవని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో రక్షణ పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, స్వదేశీ రక్షణ ఉత్పత్తి దిశలో ఇది ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛాయుత నావిగేషన్, మరియు నియమాల ఆధారిత వ్యవస్థను కాపాడటంలో భారత్-అమెరికా భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుందని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. చైనా విస్తరణవాద చర్యల నేపథ్యంలో ఈ ఒప్పందం వ్యూహాత్మకంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. క్వాడ్ దేశాల మధ్య ఉన్న సహకారానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే దశాబ్దంలో భారత్-అమెరికా రక్షణ సంబంధాలు సాంకేతికంగా, వ్యూహాత్మకంగా మరింత ఉన్నతస్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

బంగ్లాదేశ్ లో ఉండుంటే నా ప్రాణానికే కాకుండా నా చుట్టూ ఉన్నవారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడేదని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆగస్టులో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక తిరుగుబాటు అనంతరం ఆమె దేశం విడిచి వెళ్లడం గ్లోబల్ చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చకు దారితీశాయి. హసీనా మాట్లాడుతూ, 'నేను ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాను. దేశంలో చట్టబద్ధమైన పాలనను తిరిగి తీసుకురావడమే నా లక్ష్యం' అని తెలిపారు. ఆగస్టులో జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చే ప్రయత్నాలు అని ఆమె విమర్శించారు. తాను అధికారంలో ఉన్న సమయంలో కొన్ని వర్గాలు కుట్రలు పన్నాయని, అదే దేశంలో స్థిరత్వానికి పెద్ద సవాలు అయ్యిందని పేర్కొన్నారు. తనపై నమోదైన కేసులు రాజకీయ ప్రతీకార చర్యల ఫలితమని హసీనా అన్నారు. 'ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నాకు మరణశిక్ష విధించినా ఆశ్చర్యం లేదు. అది బూటకపు విచారణ మాత్రమే' అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఇంకా క్లిష్టంగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. షేక్ హసీనా మళ్లీ రాజకీయంగా తిరిగి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆమె మద్దతుదారులు అంతర్జాతీయ వేదికలపై న్యాయపరమైన రక్షణ కోసం ప్రచారం ప్రారంభించినట్లు సమాచారం. 

నీటిపారుదల శాఖ అధికారులు ఈ ఏడాదిలో మరోసారి శ్రీశైలం జలాయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి మరోసారి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువనున్న జూరాల, సుంకేసుల, హాంద్రీ నుండి వరద నీరు రావడంతో శ్రీశైలం జలాశయం నుండి ఈ ఏడాది ఏడోవ సారి రేడియల్ గేట్లు ఎత్తి అధికారులు నీరు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. జలాశయం ఇన్‌ఫ్లో 68,691 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 90,293 క్యూసెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులుగాఉంది.. పూర్తిస్థాయి నీటి నిలువ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 213.4011 టీఎంసీలుగా ఉంది.. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.. 

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, వయసు రీత్యా జరిగే సాధారణ ఆరోగ్య పరీక్ష కోసం ఆసుపత్రికి వచ్చినట్లు సన్నిహిత కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ధర్మేంద్ర పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని రెగ్యులర్ చెకప్ ల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ధర్మేంద్ర బృందం తెలిపింది. త్వరలో 90 ఏళ్లు నిండనున్న ధర్మేంద్ర, ఈ వయసులో కూడా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. త్వరలో రాబోయే ‘ఇక్కీస్’ సినిమాలో కూడా కనిపించనున్నాడు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ‘ఇక్కీస్’ సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద ఈ సినిమాలో సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ పాత్రలో నటించాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది, ఇందులో ధర్మేంద్ర కూడా కనిపించాడు. 

ఏక్తా దివస్ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 'దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే ప్రతి పౌరుడు ప్రమాదంలో ఉన్నట్టే. మన దేశం ఐక్యంగా ఉన్నప్పుడే అది శక్తివంతంగా నిలుస్తుంది' అని అన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ను స్మరించుకుంటూ ఆయన, దేశ సమగ్రతను కాపాడటమే నిజమైన దేశభక్తి అని పేర్కొన్నారు. చొరబాట్లు, విభజనాత్మక రాజకీయాలు, అంతర్గత భద్రతా లోపాలు వంటి అంశాలపై దేశం ఏకమై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం యొక్క ఏకత, సమగ్రత కోసం కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.  దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, వారందరినీ తక్షణమే వెనక్కి పంపించే చర్యలు చేపడతామన్నారు. 'దేశ సార్వభౌమత్వం, భద్రత విషయంలో రాజీ అనేది ఉండదు. మన సరిహద్దుల్లోకి చొరబాట్లు జరగడం దేశానికి తీవ్ర ముప్పు' అని ఆయన పేర్కొన్నారు. గడిచిన ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల దృష్ట్యా ఈ సమస్యను పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు సమస్యలు పెరిగాయని మోడీ విమర్శించారు. కొన్ని రాజకీయ పార్టీలు చొరబాట్లను అడ్డుకునే చర్యలకు అడ్డుపడుతూ దేశ భద్రతను బలహీనపరుస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. 'దేశానికి ముప్పుగా మారే ఈ చొరబాట్లను సమూలంగా నిర్మూలించాలి. చట్టబద్ధమైన పౌరులను రక్షించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత. కానీ, అక్రమంగా దేశంలోకి వచ్చిన వారికి మద్దతు ఇవ్వడం దేశద్రోహంతో సమానం' అని ఆయన అన్నారు. భారతదేశ భద్రతపై ఎవరైనా విఘాతం సృష్టించే ప్రయత్నం చేస్తే, కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం ఉండదని మోడీ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్ కు వ్యక్తిగత పర్యటన నిమిత్తం బయల్దేరి వెళ్లనున్నారు. నవంబరు 4 తేదీన ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ లండన్ లో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు అందించనుంది. అలాగే, హెరిటేజ్ ఫుడ్స్‌కు ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును భువనేశ్వరి అదే వేదికపై అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నారా భువనేశ్వరిని డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పని చేసినందుకు గానూ ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును సంస్థ ఆమెకు అందించనుంది. లండన్ లోని గ్లోబల్ కన్వెన్షన్ లో జరిగే కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి ఈ అవార్డును అందుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సామాజిక సాధికారితకు పాటుపడుతున్న వ్యక్తిగా ఆమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపిచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్ పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహ్మద్, హీరో ఎంటర్ ప్రైజెస్, గోయెంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయెంకా వంటి దిగ్గజ వ్యక్తులు గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సులో హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలోనూ భువనేశ్వరి గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకోనున్నారు. ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు జాతీయ స్థాయిలో ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఐఓడీ ఎంపిక చేసింది. లండన్ లో వ్యక్తిగత పర్యటన అనంతరం పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరుగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి లండన్ లోని పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రవాసాంధ్రులతోనూ సీఎం భేటీ కానున్నారు. నవంబరు 6 తేదీన సీఎం తిరిగి రానున్నారు. 

హైదరాబాద్‌లోని హెచ్ సీఏహెచ్ రీహాబిలిటేషన్ సెంటర్‌లో అడ్వాన్స్‌డ్ రోబోటిక్ గైట్ రీహాబిలిటేషన్ టెక్నాలజీ "జి గైటర్"ను తొలిసారిగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అడ్వాన్స్ రోబోటిక్స్ & రికవరీ సెంటర్ ప్రారంభోత్సవంలో భాగంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ సీఏహెచ్ ఇండియా సహ వ్యవస్థాపకులు, అధ్యక్షులు డా. గౌరవ్ తుక్రాల్, అంకిత్ గోయెల్, డిజిటల్ గ్రోత్ హెడ్ రాహుల్ జైన్, కాన్సెప్ట్ అండ్ క్లినికల్ ఎక్సలెన్స్ హెడ్ డా. విజయ్ జనగామ, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీ జలీష్, చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ శ్రీమతి నిషా తదితరులు పాల్గొన్నారు. జెన్‌రోబోటిక్స్ రూపొందించిన "జి గైటర్" ఇప్పటికే భారతదేశం, విదేశాలలోని అనేక ప్రధాన వైద్య సంస్థల్లో వినియోగంలో ఉంది. ఇది ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ఖచ్చితమైన, స్థిరమైన గైట్ థెరపీ అందించడంలో సహాయపడుతుంది. ఫిజికల్ మెడిసిన్, మొబిలిటీ పునరుద్ధరణలో ఇది రోగుల ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని నిపుణులు తెలిపారు. హైదరాబాద్‌లో ఈ సాంకేతికతను మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చిన హెచ్ సీఏహెచ్, రోబోటిక్స్, ఏఐ ఆధారిత రీహాబిలిటేషన్‌ను ప్రధాన వైద్య పద్ధతుల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రారంభోత్సవ వేడుకలో వైద్య నిపుణులు, రీహాబిలిటేషన్ నిపుణులు న్యూరోలాజికల్, ఆర్థోపెడిక్ మరియు ప్రమాదాల అనంతర మొబిలిటీ సమస్యల పరిష్కారంలో రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు ప్రాధాన్యాన్ని వివరించారు. "జి గైటర్" వంటి రోబోటిక్ గైట్ ట్రైనర్లు నియంత్రిత, పునరావృత కదలికల శిక్షణ ద్వారా రోగుల పునరావాస ప్రక్రియను వేగవంతం చేస్తాయని వారు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. మరోవైపు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది వరద ప్రవాహం కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,56,400 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. కృష్ణా, పెన్నా, ఇతర ఉప నదుల పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఏపీ రిజిస్ట్రేషన్ పేరుతో సుమారు 1300 బస్సులు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం ప్రతి రోజు రాష్ట్రం నుంచి వివిధ పట్టణాలకు 600 సర్వీసులను ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్నట్లు నిర్ధారణకు వచ్చింది. కర్నూలు జిల్లాలో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంతో అలర్ట్ అయిన ట్రాన్స్ పోర్టు అధికారులు..నిబంధనల పేరుతో దాదాపు 250 బస్సులను సీజ్ చేశారు. దీంతో ట్రాన్స్ పోర్టు అధికారులకు భయపడిన ట్రావెల్స్ యజమానులు 600 బస్సులను గ్యారేజీలకే పరిమితం చేశారు. రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 800 సర్వీసులను గురువారం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిలిపివేశాయి. ఈ క్రమంలో ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ను కలిసేందుకు అసోసియేషన్ అధ్యక్షులు ప్రయత్నించడంతో ఫలితం లేకుండా పోయింది. అసోసియేషన్‌కు ట్రాన్స్‌పోర్టు కమీషనర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సమాచారం. అయితే సోమవారం నుంచి పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ సర్వీసులను నిలిపివేసే యోచనలో యాజమాన్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

కేంద్ర ప్రభుత్వ అందజేసే గ్యాస్ సబ్సిడీ కోసం ఎల్పీజీ గృహ వినియోగదారులు ప్రతి ఏటా ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని చమురు కంపెనీలు తెలిపాయి. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్దిదారులు సహా గ్యాస్ వినియోగదారులు తమ కంపెనీ (హిందూస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం) మొబైల్ యాప్ ద్వారా దీనిని (బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ) చేయించుకోవచ్చని వెల్లడించాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 31లోపు ఈ-కేవైసీ పూర్తి చేస్తే ఆ సబ్సిడీని తిరిగి చెల్లిస్తారు. అలా కాకుంటే ఈ సబ్సిడీ శాశ్వతంగా రద్దవుతుందని పేర్కొన్నాయి. గడువులోగా వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. ఇప్పటికే కేంద్ర పెట్రోలియం గ్యాస్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే చమురు కంపెనీలకు ఇప్పటికే సూచనలు చేసింది. ఈ-కేవైసీ ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒకసారి చేయించడం తప్పనిసరని తెలిపింది. కేంద్రం ఏడాదికి గరిష్ఠంగా 9 సిలిండర్లకు మాత్రమే రాయితీ ఇస్తుంది. కానీ, 8, 9వ సిలిండర్లకు అథెంటికేషన్‌ పూర్తి చేసిన తర్వాత సబ్సిడీ విడుదల చేస్తోంది. ఒకవేళ ధ్రువీకరణలో జాప్యం జరిగితే తాత్కాలికంగా నిలిపివేస్తారు. గ్యాస్ ఏజెన్సీ లేదా సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద ఉండే ఈ యాప్ ద్వారా కూడా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. సబ్సిడీ, ఈ-కేవైసీ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్ గురించి పూర్తి వివరాల కోసం https://www.pmuy.gov.in/e-kyc.html వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ మూడింటిలో ఏదో విధానాన్ని ఎంచుకని ఈ-కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ దుర్వినియోగం, లీకేజ్‌ను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 879. ఉజ్వల్ వినియోగదారులు రూ. 300 సబ్సిడీని పొందుతుండగా, ఇతర వినియోగదారులు మాత్రం దాదాపు రూ.20 వరకు సబ్సిడీ పొందుతున్నారు. 'ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు, ఇప్పటికే బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేసిన వారు సహా, ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి ఆ ఈ-కేవైసీ మళ్లీ పూర్తి చేయాల్సి ఉంటుంది. 14.2 కిలోల LPG సిలిండర్‌పై సబ్సిడీ పొందాలంటే, ఇది తప్పనిసరి. ఈ సబ్సిడీ 8, 9వ రీఫిల్‌ల వరకు వర్తిస్తుంది.' కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంది.

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. శుక్రవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ ఓడిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు పేలవమైన ఆరంభం లభించింది. శుభ్‌మాన్ గిల్ (5 పరుగులు), సంజు సామ్సన్ (2 పరుగులు), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (1 పరుగు) తీవ్రంగా నిరాశ పరిచారు. హర్షిత్ రాణాతో కలిసి అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి భారత్ స్కోరును 100 దాటించారు. అభిషేక్ 37 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అతని అవుట్ తర్వాత, భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయింది. తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్స్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు. స్టోయినిస్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారు. ఇక మూడో మ్యాచ్ నవంబర్ 2న హోబర్ట్‌లో జరగనుంది.

తెలంగాణ ప్రభుత్వం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఉద్యోగుల బకాయిలతో పాటు, పంచాయతీరాజ్ , ఆర్ అండ్ బి శాఖలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ఒకేసారి విడుదల చేసింది. అక్టోబర్ నెలకు గాను మొత్తం రూ.1,031 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాం నుంచి పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా క్లియర్ చేస్తూ వస్తున్న డిప్యూటీ సీఎం, తాజాగా అక్టోబర్ మాసానికి సంబంధించిన రూ.712 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలతో పాటు, రూ.10 లక్షలలోపు విలువైన పెండింగ్ బిల్లులను పూర్తిగా క్లియర్ చేయాలని ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బి శాఖలకు చెందిన మొత్తం 46,956 బిల్లులకు సంబంధించిన రూ.320 కోట్ల రూపాయలను విడుదల చేశారు. రోడ్లు, భవనాల శాఖ కి చెందిన రూ.10 లక్షలలోపు విలువైన 3,610 బిల్లులకు సుమారు రూ.95 కోట్లు విడుదలయ్యాయి. అదేవిధంగా, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన 43,364 బిల్లుల మొత్తం రూ.225 కోట్ల రూపాయలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. శుక్రవారం ఉదయం ప్రజా భవన్‌లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

మొంథా తుపాను ప్రభావానికి గురైన వరద బాధితులకు రూ.15 వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వాళ్లను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మొంథా తుపాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావంతో 12 జిల్లాల్లో నష్టం జరిగిందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. '' వరద ప్రభావం వల్ల ప్రాణనష్టం, పంట నష్టం, పశుసంపదతో పాటు అన్ని శాఖలకు సంబంధించి జరిగిన నష్టాన్ని నివేదిక అందించండి. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టర్లకు నివేదికలు ఇవ్వండి. తుఫాను ప్రభావం వల్ల రాష్ట్రంలో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను ప్రభుత్వం రాబట్టుకుంటుంది. తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు వేయండి. సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయి. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఇళ్లు మునిగిన బాధితుల్లో ప్రతీ ఇంటికి రూ.15 వేలు ఇస్తాం. ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి. ఆవులు, గేదెలు చనిపోతే రూ.50వేలు.. మేకలు, గొర్రెలకు రూ.5వేలు, పంట నష్టం కింద ఎకరాకు రూ.10వేలు చెల్లిస్తాం. మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి.జిల్లా కలెక్టర్లు ఫీల్డ్ విజిట్స్ చేయాల్సిందే స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయండని'' సీఎం రేవంత్ వివరించారు. 

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.రామకృష్ణరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇప్పటి వరకు కేబినెట్ బెర్త్ కోసం ఎదురుచూసిన ఆ ఇద్దరు సీనియర్లకు అధిష్ఠానం బుజ్జగిస్తూ కేబినెట్ హోదాతో కూడిన పదవిని కట్టబెట్టినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

చిత్తూరు మాజీ మేయర్‌ కఠారీ అనురాధ దంపతుల హత్య కేసులో ఐదుగురిని దోషులుగా ఇదివరకే నిర్ధారించిన చిత్తూరు జిల్లా కోర్టు శుక్రవారం మరణ శిక్ష ఖరారు చేసింది. ప్రభుత్వ కార్యాలయంలోనే జరిగిన ఈ హత్యోదంతాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. 2015 నవంబరు 17న చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి బురఖాలు ధరించి తుపాకులు, కత్తులతో ప్రవేశించిన దుండగులు.. మేయర్‌ కఠారి అనురాధపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆపై పక్క గదిలో ఉన్న కఠారి మోహన్‌ను కత్తులతో నరికారు. తీవ్ర గాయాలతో మోహన్‌ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు. పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాసరం రమేష్‌ (ఏ22) తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్‌ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌.శ్రీనివాసాచారి (ఏ21) కేసు విచారణ సాగుతుండగానే మృతిచెందారు. దాంతో 21 మంది నిందితులుగా ఉన్నారు. అయితే ఇందులో శ్రీరామ్‌ చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూ (ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్‌ వెంకటేష్‌ (ఏ2), జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జయారెడ్డి(ఏ3), మంజునాథ్‌ అలియాస్‌ మంజు(ఏ4), మునిరత్నం వెంకటేష్‌(ఏ5)లు దోషులుగా తేలారు. దీంతో ఈ ఐదుగురికి 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు ఇవాళ మరణశిక్ష విధించారు. కఠారి మోహన్‌కు శ్రీరామ్‌ చంద్రశేఖర్‌ (చింటూ) మేనల్లుడు. వారి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాల నేపథ్యంతోనే ఈ హత్య జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. పదేళ్లకు తీర్పు వచ్చిన ఈ కేసులో ఏకంగా 352 వాయిదాలు పడ్డాయి. 122 మంది సాక్షులను విచారించారు. A 1 నిందితుడు చంద్ర శేఖర్ @చింటూ, A 2 నిందితుడు వెంకట చలపతి@ ములబాగల్ వెంకటేశ్, A 3 నిందితుడు జయ ప్రకాష్ రెడ్డి, A 4 నిందితుడు మంజునాథ్, A 5 నిందితుడు వెంకటేశ్ అలియాస్ గంగన్న పల్లి వెంకటేశ్‌. వీళ్లలో ఏ3, ఏ4గా ఉన్న జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్‌.. అరెస్టు అయినప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. తీర్పు నేపథ్యంలో చిత్తూరు పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై,వాట్సప్ మెసేజ్ పై ప్రత్యేక నిఘా ఉంచారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఓ ఎన్నారై యువతి అడిగిన ప్రశ్నలకు  ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మిసిసిప్పీ విశ్వవిద్యాలయంలో జరిగిన ''టర్నింగ్‌ పాయింట్‌ యూఎస్‌ఏ'' కార్యక్రమంలో కఠిన వలస విధానాల అవసరాన్ని వాన్స్‌ సమర్థించారు. చట్టబద్ధంగా వచ్చిన వలసదారుల ప్రవాహం కూడా అమెరికా సమాజాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. అయితే, సభలో భారతీయ మూలాలున్న యువతి ప్రశ్నలతో వాన్స్‌ను నిలదీశారు. అమెరికా కలలను నమ్మి చదువుకున్న, చట్టబద్ధంగా వచ్చినవారిని ఇప్పుడు ''అనవసరమైన వారుగా'' ఎందుకు చూస్తున్నారు? అని ఆమె గట్టిగా ప్రశ్నించారు. ఆమె మాటలకు హాజరైన విద్యార్థుల నుంచి చప్పట్లు వినిపించాయి. ఆ యువతి ఉద్వేగభరితంగా మాట్లాడుతూ వలసదారుల పాత్రను గుర్తించి, వారిని వెనక్కి నెట్టే విధానాలపై ప్రశ్నలు లేవనెత్తింది. వాన్స్‌ ఉద్దేశం వలసదారుల ప్రవాహాన్ని నియంత్రించడం మాత్రమేనని చెప్పినా, సమాధానం కొంత రక్షణాత్మకంగా అనిపించింది. తరువాత ఆమె, ''అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్‌ కావాలా?'' అని ఆలోచింపజేసే ప్రశ్న వేసింది. దానికి వాన్స్‌ తన మత విశ్వాసాన్ని గౌరవిస్తానని, భవిష్యత్తులో తన భార్య కూడా అదే దారిలో నడుస్తారని ఆశిస్తున్నానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ఘాటు చర్చకు దారితీశాయి. ఇండో-అమెరికన్‌ సమాజం వాన్స్‌ ద్వంద్వ వైఖరిని విమర్శిస్తోంది. భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఆయన పెళ్లి జరిగిందంటూ, మత స్వేచ్ఛపై వ్యాఖ్యలు చేయడం ఆయన వ్యక్తిగత-సామాజిక విలువల మధ్య వ్యతిరేకతగా పలువురు అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో ఎనిమిదేళ్ల బాలికపై 50 ఏళ్ల వయసున్న వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. ఆసుపత్రిలో తన తండ్రి వద్ద అటెండర్‌గా బాలిక ఉంటోంది. ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయంలో కామాంధుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన ఆసుపత్రి సిబ్బంది, అక్కడున్న రోగుల అటెండర్లు సదరు కామాంధుడికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో డీఎస్పీ గీతాకుమారి విచారణ చేపట్టారు.

తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు పాల్గొన్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినేట్ లో ఇంకా రెండు మంత్రి పదువులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఓసీ, బీసీలకు చోటు దక్కే అవకాశం ఉంది. అజారుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు.  ప్రస్తుతానికి అజారుద్దీన్ కు ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, మైనార్టీ సంక్షేమం, క్రీడలు లేదా హోం శాఖ వంటి కీలక శాఖల్లో ఏదో ఒకటి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కేబినెట్లో మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, మైనారిటీ ఓట్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగానే ఈ హడావుడి మంత్రివర్గ విస్తరణ జరిపించారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఈ మంత్రివర్గ విస్తరణ చేపట్టడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

దేశీయ మార్కెట్‌లో కవాసకి ప్రత్యేక స్థానం వుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్‌లు, అడ్వెంచర్ బైక్‌ల రంగంలో ఈ బ్రాండ్‌కి ఉన్న పేరు చెప్పక్కర్లేదు. నింజా, జడ్ సిరీస్ వంటి బైక్‌లు యువతలో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకున్నాయి. అదే సమయంలో, క్లాసిక్ లుక్‌ని ఇష్టపడే వారికి డబ్ల్యూ సిరీస్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కవాసకి డబ్ల్యూ175 బైక్‌కి మార్కెట్‌లో మంచి ప్రారంభ స్పందన వచ్చినప్పటికీ, తాజాగా దాని అమ్మకాల గణాంకాలు కంపెనీకి నిరాశ కలిగించేలా మారాయి. కవాసకి ఇండియా తాజాగా విడుదల చేసిన సెప్టెంబర్ 2025 నెల విక్రయ నివేదిక ప్రకారం, డబ్ల్యూ175 బైక్ ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. ఇది గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 106 యూనిట్లతో పోలిస్తే పెద్ద తగ్గుదలగా చెప్పుకోవాలి. ఈ గణాంకాలు చూసినప్పుడు స్పష్టమవుతుంది, డబ్ల్యూ175కు గతంలో ఉన్న డిమాండ్ క్రమంగా తగ్గిపోతోంది. దీనికి కారణాలు అనేకం కావచ్చు, బైక్ ధర మార్కెట్లో ఇతర ప్రత్యర్థులతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉండటం, అలాగే కొత్త జనరేషన్ యువత ఇప్పుడు మరింత టెక్నాలజీ, ఫీచర్లను కోరుకుంటుండటం వల్లా కావచ్చు. మరోవైపు, దేశీయ బ్రాండ్‌లు తక్కువ ధరలో మైలేజ్, పనితీరును అందిస్తుండటంతో కవాసకి వంటి ప్రీమియం బ్రాండ్‌లకు సవాలు ఏర్పడుతోంది. మార్కెట్‌లో కొన్ని నెలల మాంద్యం ఉన్నప్పటికీ, ఈ బ్రాండ్‌కి ఉన్న గ్లోబల్ ఇమేజ్, నాణ్యత, అభిమానుల విశ్వాసం దీన్ని మళ్లీ పటిష్ట స్థితికి తీసుకురావడంలో సహాయపడతాయని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో కొత్త మోడళ్లు, హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ బైక్‌ల రూపంలో కవాసకి తన దిశను మారుస్తే, మళ్లీ ఈ బ్రాండ్‌కి మార్కెట్లో బలమైన పునరాగమనం సాధ్యమే. కవాసకి డబ్ల్యూ175 భారత మార్కెట్‌లో రెట్రో లుక్స్‌తో కూడిన ప్రత్యేక బైక్‌గా గుర్తింపు పొందింది. క్లాసిక్ డిజైన్‌కి ఆధునిక ఇంజిన్ పనితీరును కలిపిన ఈ మోడల్, రోజువారీ ప్రయాణాలకు సరైన భాగస్వామిగా కవాసకి అందించింది. ప్రస్తుతం ఈ బైక్ భారతదేశంలో రెండు వేరియంట్లలో డబ్ల్యూ175 (బేస్ మోడల్), డబ్ల్యూ175  స్ట్రీట్‌లలో లభిస్తుంది. బేస్ మోడల్ డబ్ల్యూ175 లో క్లాసిక్ స్పోక్డ్ రిమ్స్, రౌండ్ హెడ్ల్యాంప్, సింపుల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి. దీని రూపం పూర్తిగా పాత తరహా రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌లను గుర్తు చేస్తుంది. కలర్ ఆప్షన్‌ను బట్టి దీని ధరల్లో కొంత తేడా ఉంటుంది, నలుపు- బూడిద రంగు వేరియంట్‌లకు ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.15 లక్షల నుండి రూ. 1.25 లక్షల వరకు ఉంటుంది. ఇక రెండవ వేరియంట్ W175 స్ట్రీట్ కొంచెం ఆధునిక టచ్‌తో వస్తుంది. ఇందులో అల్లాయ్ వీల్స్ వంటి కొన్ని కొత్త ఫీచర్లు చేర్చబడ్డాయి. ఇది నగర రైడింగ్‌కి మరింత అనుకూలంగా ఉండేలా కవాసకి ఈ వెర్షన్‌ను రూపొందించింది. బైక్‌లో 177 సిసి సామర్థ్యమున్న రెండు వాల్వ్, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ SOHC ఇంజిన్ ఉపయోగించారు. ఈ ఇంజిన్ 12.8 bhp శక్తిని, 13.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన ఈ పవర్‌ట్రెయిన్ రోజువారీ ప్రయాణాలకు సరిపడే స్మూత్ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.

1945లో నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించినప్పటి నుంచి ఇండోనేషియా రాజధానిగా జకార్తా ఉంది. అప్పటి నుంచి జకార్తా 10.5 మిలియన్ల జనాభాతో విశాలమైన మహానగరంగా అభివృద్ధి చెందింది. అయితే జకార్తా చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతం సుమారు 30 మిలియన్లకు నివాసంగా ఉంది. ఈక్రమంలో నగరం వేగంగా మునిగిపోతోందని నివేదికలు వెలువడుతూనే ఉన్నాయి. 2030 నాటికి ఈ మహానగరంలోని కొన్ని ప్రాంతాలు తరచుగా వరదలకు గురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ఫలితంగా కలుషితమైన, రద్దీగా ఉండే, మునిగిపోతున్న జకార్తాను ఖాళీ చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. 2022లో ఇండోనేషియా రాజధాని తరలింపుకు నిధులు, పాలనను నియంత్రించే చట్టాన్ని ఆమోదించింది. కొత్త రాజధానిని ప్లాన్ చేస్తున్న కమిషన్, జకార్తా నుంచి రాజధానిని తరలించడం అత్యవసరమని పేర్కొంది. ఎందుకంటే నగరం, జావా ద్వీపం “భారీ ట్రాఫిక్ రద్దీ, పర్యావరణ కాలుష్యం, రద్దీ జనాభా” నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని నివేదికల్లో వెల్లడించాయి. నుసంతారా క్యాపిటల్ అథారిటీ 2023 అచీవ్‌మెంట్ రిపోర్ట్‌లో కొత్త రాజధాని ఇండోనేషియా గ్రాండ్ స్ట్రాటజీ.  2045 గోల్డెన్ ఇండోనేషియా విజన్‌లో భాగమని ఆ దేశం వెల్లడించింది. ఈ కొత్త ప్రణాళిక 2045 నాటికి ఇండోనేషియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్ర్యం పొందిన 100వ వార్షికోత్సవం అని అధికారులు వెల్లడించారు. అథారిటీ ప్రణాళికల ప్రకారం నుసంతారా రాబోయే రెండు దశాబ్దాలలో ఆధునిక, స్థిరమైన నగరంగా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి వాణిజ్య మౌలిక సదుపాయాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా వ్యవస్థతో సహా అనేక దశల్లో పూర్తవుతుందని వెల్లడించారు. నుసంతారాను స్పాంజ్ సిటీగా నిర్మిస్తున్నారు. అంటే వర్షపు నీటిని భూమిలోకి పీల్చుకోగల నగరంగా కొత్త రాజధానిని నిర్మిస్తున్నారు. ఇంకా ఈ నగరానికి కొన్ని ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. 2035 నాటికి పేదరిక రేటును సున్నా శాతానికి తగ్గించడం ఇందులో ప్రధాన లక్ష్యం. 2045 నాటికి సున్నా ఉద్గారాలను సాధించడం కూడా నగరం లక్ష్యంగా పెట్టుకుంది. నుసంతారాలో జనాభా చాలా తక్కువ. ప్రస్తుతం ఇక్కడ 2 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 8 వేల మంది నిర్మాణ కార్మికులు మాత్రమే నివసిస్తున్నారు. 2030 నాటికి 1.2 మిలియన్ల మందిని ఈ నగరంలో నిర్మించేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని అపార్ట్‌మెంట్లు, మంత్రిత్వ శాఖ భవనాలు, ఆసుపత్రులు, రోడ్లు, నీటి వ్యవస్థలు, విమానాశ్రయం నిర్మించబడినప్పటికీ, నగరంలో ఎక్కువ భాగం ఇంకా నిర్మాణంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలో మద్యం బానిసైన ఓ యువకుడు భార్య మందలించిందన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోటవాని వలస గ్రామానికి చెందిన కిషోర్‌ (30) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే గత కొంతకాలంగా మద్యం వ్యసనానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా అలవాటు విడిచిపెట్టలేకపోయాడు. ఇటీవలి రోజుల్లో పనులు కూడా మానేసి మద్యం మత్తులోనే రోజులు గడిపేవాడు. ఈ కారణంగా అప్పుల పాలయ్యాడు. మద్యం మానుకోవాలనే విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవి. తాజాగా కూడా చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకోగా భార్య భార్గవి కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోవడంతో కిషోర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కిషోర్ విక్రాంపురం సమీపంలోని ఓ మామిడి తోటకు వెళ్లి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొంతసేపటికి అతడు అపస్మారక స్థితిలో పడిపోయినట్టు గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అతడిని పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భర్త మరణవార్త తెలుసుకున్న భార్య భార్గవి, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్క క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలో ముంచింది. మద్య వ్యసనం అనేక కుటుంబాలను దుఃఖంలోకి నెడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. కార్పొరేట్‌ హంగులతో ప్రభుత్వ ఆసుపత్రి సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న నేపథ్యంలో డిసెంబర్‌ 9వ తేదీన ఈ ఆసుపత్రిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో 11.68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+5 అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మిస్తోంది. ఇందులో వెయ్యి పడకలు, 30 విభాగాల్లో కార్పొరేట్‌ తరహా వైద్యసేవలు రోగులకు అందనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే క్రిటికల్‌ కేసులకు రిఫరల్‌ ఆసుపత్రులుగా ఉన్న గాంధీ, ఉస్మానియా, నిలోపర్, ఫీవర్, ప్రసూతి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వం భావించింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల నుంచి అత్యవసర పరిస్థితుల్లో నగరం నడిబొడ్డున ఉన్న ఈ ఆసుపత్రులకు వెళ్లాలంటే ట్రాఫిక్‌ తిప్పలు తప్పడంలేదు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే ప్రత్యామ్నాయంగా నగరం నలుమూలలా పెద్ద ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్‌లో సుమారు రూ.2,500 కోట్లతో మూడు ఆసుపత్రులను ప్రతిపాదించింది. సనత్‌నగర్‌లోని ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో టిమ్స్‌ నిర్మాణానికి 22.6 ఎకరాలు కేటాయించింది. రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టింది. ఎల్‌బీ నగర్, అల్వాల్‌లో ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి పనులు పూర్తి చేయాలని తొలుత ప్రభుత్వంతో అగ్రిమెంట్‌ చేసుకున్నా వివిధ కారణాలతో పనులు పూర్తికాలేద సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రిలో ప్రధానంగా గుండె జబ్బులకు అత్యాధునిక శస్త్రచికిత్సలు అందించనున్నారు. క్యాథ్‌ల్యాబ్‌లు, ఆధునాతన ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులో ఉంటాయి. అవయవ మార్పిడికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆపరేషన్‌ థియేటర్లు, నిపుణులైన వైద్యులను కేటాయించనున్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ ఫర్‌ కార్డియాక్‌ డిసీజెస్‌ అండ్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విభాగం అందుబాటులోకి రానుంది. సుమారు 500 పడకలను గుండె వ్యాధుల రోగులకు కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని హృద్రోగ నిపుణులతో సమావేశం నిర్వహించారు. అదే సమయంలో ఇతర విభాగాలైన ప్రసూతి, పీడియాట్రిక్, న్యూరాలజీ, ఈఎన్‌టీ, పల్మనరీ, ఇతర విభాగాల్లోనూ ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గూగుల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. దీని ద్వారా భారత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని వేగంగా పెంచడానికి రెండు కంపెనీలు కలిసి పనిచేస్తాయి. ఈ భాగస్వామ్యం జియో వినియోగదారులకు 18 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్‌కు ఉచిత యాక్సెస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఒక్కో వినియోగదారునికి దాదాపు రూ.35,100 విలువైనదని జియో చెబుతోంది. గూగుల్ ఏఐ ప్రోతో, జియో వినియోగదారులు గూగుల్ జెమిని 2.5 ప్రో, తాజా నానో బనానా, వీయో 3.1 మోడళ్లతో ఫోటోలు, వీడియోలను సృష్టించడానికి అనుమతి పొందుతారని జియో తెలిపింది. ఇందులో స్టడీ అండ్ రీసెర్చ్ కోసం నోట్‌బుక్ ఎల్ఎంకి విస్తరించిన యాక్సెస్, 2 టీబీ క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రీమియం సేవలు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్‌ను మొదటగా 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల జియో వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నట్లు జియో పేర్కొంది. తరువాత, అందరు జియో వినియోగదారులకు యాక్సెస్ లభిస్తుంది. 5G అపరిమిత ప్లాన్‌లతో జియో కస్టమర్లకు మాత్రమే కంపెనీ ఈ ఉచిత యాక్సెస్‌ను అందిస్తుందని గమనించాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, “1.45 బిలియన్ల భారతీయులకు ఏఐ సేవలను అందించడమే మా లక్ష్యం. గూగుల్ వంటి భాగస్వాములతో కలిసి, భారతదేశాన్ని ఏఐ -ఎనేబుల్డ్ చేయాలనుకుంటున్నాము” అని అన్నారు. 18-25 సంవత్సరాల మధ్య వయస్సు గల జియో యూజర్ అయితే, రాబోయే రోజుల్లో మీరు ఈ ఉచిత ఆఫర్‌కు అర్హులు అవుతారు. అయితే, మీ మొబైల్ ప్లాన్ అపరిమిత 5Gతో కూడినదిగా ఉండాలి. గూగుల్ AI ప్రోను అన్ని రకాల వినియోగదారులకు తీసుకువస్తామని కంపెనీ స్పష్టం చేసింది, అయితే ప్రారంభంలో ఈ సబ్‌స్క్రిప్షన్ యువతకు మాత్రమే అందించనుంది.

చైనా దేశ వ్యోమగాములతో కలిసి పాకిస్తాన్ వ్యోమగామిని అంతరిక్షంలోకి తీసుకు వెళ్ళనున్నట్లు చైనా మానవ సహిత అంతరిక్ష కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ అంతరిక్ష కేంద్రం ఎంపిక చేసిన ఇద్దరు వ్యోమగాములు చైనా వ్యోమగాములతో కలిసి శిక్షణ తీసుకుంటారని ప్రతినిధి జాంగ్ జింగ్బో తెలిపారు. వారిలో ఒకరిని పెలోడ్ స్పెషలిస్ట్‌గా స్వల్పకాలిక అంతరిక్ష ప్రయాణ మిషన్‌లో పాల్గొనేందుకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఆ మిషన్ సమయంలో పాక్ వ్యోమగామి శాస్త్రీయ ప్రయోగాలతో పాటు సాంకేతిక ప్రదర్శనలకు సంబంధించి చైనా వ్యోమగాములకు సహాయం అందిస్తారని ఆయన వివరించారు.2030 నాటికి చంద్రుడిపైకి తమ వ్యోమగామిని దింపేందుకు సిద్ధంగా ఉన్నామని జింగ్బో పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వ్యోమగాముల బృందాన్ని త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ తెర వెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత స్పష్టం చేసింది.. వీరిద్దరి తెర వెనక బంధాన్ని ఆమె బయటపెట్టింది. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకారంతోనే బీజేపీ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు గెలుచుకుందన్నారు. జూబ్లీ హిల్స్ లో తమకు గెలిచే అవకాశం లేదని బీజేపీ కి తెలుసు. అందుకే బీఆర్ ఎస్ కు లాభం చేయడం కోసం చాలా లేట్ గా బలహీనమైన అభ్యర్థి ని బీజేపీ ప్రకటించిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో మైనార్టీలు ఎవరూ బీజేపీకి ఓటు వేయరు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు లాభం కల్గించడం కోసమే అజారుద్దీన్ ను మంత్రి కాకుండా బీజేపీ అడ్డుకుంటోందన్నారు. అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించకుండా రాష్ట్ర గవర్నర్ పైన బీజేపీ ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. నాకున్న సమాచారం మేరకు వారు గొప్ప వ్యక్తి, అలా చేయరు అని భావిస్తున్నానన్నారు. కుట్రలో భాగంగా ఎన్నికల కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది. గతంలో రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థి ని మంత్రి వర్గంలోకి తీసుకుంది. శ్రీ గంగానగర్ జిల్లా శ్రీ కరణ్ పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్ సింగ్‌ను డిసెంబర్ 30న రాష్ట్ర మంత్రి వర్గంలోకి ఏకంగా ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రి వర్గంలోకి బీజేపీ తీసుకుంది.. ఉపఎన్నికకు 20 రోజుల ముందు ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనం అన్నారు. కేవలం మైనార్టీ అన్న ద్వేషంతోనే బీజేపీ అజారుద్దీన్ ప్రమాణస్వీకారాన్ని అడ్డుకుంటోంది.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను మైనార్టీలు అర్థం చేసుకోవాలన్నారు. బై ఎలక్షన్ కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకే.. ప్రమాణ స్వీకారం నియోజకవర్గం బయట జరుగుతుందన్నారు. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ లో పోటీ చేయడం లేదు.. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీ.. ఎవరెన్ని కుట్రలు చేసినా.. సమాజంలోని అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించడం కాంగ్రెస్ మూల సిద్ధాంతం అన్నారు. ఈ క్రమంలో అజారుద్దీన్‌కు కల్పిస్తున్న అవకాశంపై కుట్రలు చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. రాష్ట్ర మంత్రుల మధ్య స్పష్టమైన అవగాహన, ఆలోచన, ప్రణాళిక నిర్ణయాల పట్ల నిబద్ధత ఉన్నాయని స్పష్టత ఇచ్చారు. తుఫానుకు సంబంధించి ప్రభుత్వం 46 గంటల ముందే అప్రమత్తమయిందని.. 24 గంటలు పనిచేసిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్, చీఫ్ సెక్రటరీతో పాటు మొత్తం యంత్రాంగం అప్రమత్తమై కావలసిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ముందస్తు చర్యల మూలంగా భారీ ప్రాణ, ఆస్తి, ఇతర నష్టం జరగకుండా చూడగలిగామని తెలిపారు. అన్ని ప్రయత్నాలు చేసినా ప్రకృతి విపత్తు వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. నష్టాలు అంచనా వేసి నష్టపోయిన వారికి సహాయం చేస్తాం. తుఫాను నష్టంపై ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో ఆలోచన చేస్తుందన్నారు. 

దేశవ్యాప్తంగా రైల్వేలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రపంచంలో భారతీయ రైల్వేలకు ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ మధ్య కీలక మార్పులు చేస్తున్నాయి. రైల్వే ను ప్రపంచ స్ధాయిలో అభివృద్ధి చేయటంతో పాటు వందే భారత్ వంటి కొత్త తరం రైళ్లను పట్టాలపై పరుగులు తీయించడం వంటి చర్యలున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఓ సదుపాయం సక్సెస్ కావడంతో దీన్ని 76 స్టేషన్లకు విస్తరించబోతున్నారు. తాజాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో పాసింజర్ హోల్డింగ్ ఏరియా పేరుతో ఓ ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో వారికి కాస్త ఊరట కల్పించేందుకు చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైంది. దీంతో దేశవ్యాప్తంగా మరో 76 స్టేషన్లలో ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేసేందుకు వీలుగా రైల్వేశాఖ పంపిన ప్రతిపాదనకు మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమోదం తెలిపారు. దీంతో వివిధ జోన్ల పరిధిలో త్వరలోనే ఈ పాసింజర్ హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 2026లో పండుగల సీజన్ లోపే దేశంలోని ఎంపిక చేసిన 76 స్టేషన్లలో ఈ పాసింజర్ హోల్డింగ్ ఏరియాల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సెంట్రల్ రైల్వే పరిధిలో 6 స్టేషన్లు, తూర్పు రైల్వే పరిధిలో 5, తూర్పు మధ్య రైల్వే పరిధిలో 6, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో 3, ఉత్తర రైల్వే పరిధిలో 12, ఉత్తర మధ్య రైల్వే పరిధిలో 4, ఈశాన్య రైల్వే పరిధిలో 4, ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో 2, వాయువ్య రైల్వే పరిధిలో 5, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6, ఆగ్నేయ రైల్వే పరిధిలో 3, నైరుతి రైల్వే పరిధిలో 4, పశ్చిమ రైల్వే పరిధిలో 8, పశ్చిమ మధ్య రైల్వే పరిధిలో 3 స్టేషన్లు ఉన్నాయి. ఇందులో దక్షిణ మధ్య రైల్వేపరిధిలో అంటే తెలుగు రాష్ట్రాల పరిధిలో ఆరు స్టేషన్లకు ఇలా పాసింజర్ హోల్డింగ్ ఏరియాల ఏర్పాటుకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లతో పాటు ఏపీలోని తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి స్టేషన్లు ఉన్నాయి. వీటిలో నాలుగు నెలల్లోనే ఈ పాసింజర్ హోల్డింగ్ ఏరియాల్ని ఏర్పాటు చేయబోతున్నారు. 

శామ్‌సంగ్ జాతీయ విద్యా కార్యక్రమం 'శామ్‌సంగ్ సాల్వ్ ఫర్ టుమారో 2025' నాల్గవ ఎడిషన్ విజేతలను ప్రకటించింది. ఈ కార్యక్రమం యువ విద్యార్థులు సాంకేతికతను వినియోగించి తమ స్థానిక కమ్యూనిటీల్లోని వాస్తవ ప్రపంచ సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుంది. మొదటి నాలుగు విజేత జట్లుగా  పెర్సెవియా (బెంగళూరు), నెక్ట్స్‌ప్లే.ఏఐ (ఔరంగాబాద్), పారస్పీక్ (గురుగ్రామ్),పృథ్వీ రక్షక్ (పలాము)లను ప్రకటించింది.  ఐఐటి ఢిల్లీకి చెందిన ఎఫ్ఐటీటీ ల్యాబ్స్‌లో మెంటర్‌షిప్ మద్దతుతో, తమ ఆవిష్కరణాత్మక ప్రోటోటైప్లను స్కేలబుల్ రియల్-వరల్డ్ పరిష్కారాలుగా అభివృద్ధి చేయడానికి రూ. 1 కోటి విలువైన ఇంక్యుబేషన్ గ్రాంట్లు అందుకున్నారు. జ్యూరీ ప్యానెల్‌లో.. శామ్‌సంగ్ మాత్రమే కాకుండా, విద్యా సంస్థలు, ప్రభుత్వం & పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్యానెల్ నాలుగు ప్రధాన నేపథ్య ట్రాక్లలో ఫైనలిస్టుల పరిష్కారాలను అంచనా వేసింది. అత్యుత్తమ ప్రపంచాన్ని నిర్మించడంలో తమ సృజనాత్మకత & అంకితభావాన్ని ప్రతిబింబించినందుకు టాప్ 20 ఫైనలిస్ట్ జట్లు ఒక్కొక్కటి రూ 1 లక్ష నగదు బహుమతితో పాటు తాజా శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా అందుకున్నాయి. అదనంగా, ఈ కార్యక్రమం ఐదు ప్రత్యేక అవార్డుల కింద బహుమతులను అందించింది

యూట్యూబ్ కంపెనీ విడిచి వెళ్లే ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలను ఆఫర్ చేసింది. కృత్రిమ మేథ దూసుకు వస్తున్న నేపధ్యంలో యూ ట్యూబ్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ క్రమంలో ఆ కంపెనీ సీఈఓ నెల్ మోహన్ ఈ మేరకు ప్రకటన చేసారు. కృత్రిమ మేథను ఉపయోగించుకునేందుకు మార్పులు సహజమని ఆయన వెల్లడించారు. ఏఐ దెబ్బకి ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇది మరీ ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లేఆఫ్‌లు సాగుతూనే వున్నాయి. ఫలితంగా సుమారు 80,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ముంబైలోని ఆర్‌ఏ స్టూడియోలో మొదటి అంతస్తులో స్టూడియోలో పనిచేస్తూ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రోహిత్ 15 నుంచి 20 మంది పిల్లలను బందీలుగా తీసుకున్నట్లు కేసు నమోదు అయ్యింది. మొత్తం 100 మంది పిల్లలు ఆడిషన్ల కోసం వచ్చినట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం ఈ స్టూడియోలో ఆయన గత నాలుగైదు రోజులుగా ఆడిషన్లు నిర్వహిస్తున్నాడు. గురువారం ఆడిషన్ల కోసం వచ్చిన సుమారు 100 మంది పిల్లల్లో దాదాపు 80 మందిని బయటికి పంపించారు. కానీ మిగిలిన పిల్లలను ఒక గదిలో బంధించారు. బందీలుగా ఉన్న పిల్లలు కిటికీల నుంచి బయటకు చూస్తున్నట్లు కనిపించడంతో సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించడంతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. స్టూడియోను చుట్టుముట్టి, నిందితుల గుర్తింపు, వారి ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం స్టూడియో వెలుపల హై అలర్ట్ అమలులో ఉంది. బందీలుగా ఉన్న పిల్లలను పోలీసులు, రెస్క్యూ బృందాలు సురక్షితంగా రక్షించాయి. పిల్లలను రక్షించిన అనంతరం పోలీసులు రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 

తెలంగాణలో ఎన్ హెచ్ 44 పై ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్డు వరకు ట్రాఫిక్ మళ్లింపులను సిటీ పోలీసులు వెల్లడించారు. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ అక్టోబర్ 30, గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్న ఈ డైవర్షన్లు, ఆల్టర్నేట్ రూట్లు దాదాపు 9 నెలలపాటు బంద్ కానున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిర్మాణ పనులు పూర్తయినంత కాలం రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్- బాలమ్రాయ్ మధ్య ఇరు వైపులా డైరెక్షన్ లను మూసివేయనున్నారు. వాహనదారులు బాలమ్రాయ్- సీటీఓ జంక్షన్ మధ్య ప్రయాణించొద్దని సూచనలు చేశారు. వీళ్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ విషయాలను జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ స్పష్టం చేశారు. బాలానగర్ నుంచి పంజాగుట్ట/ ట్యాంక్ బండ్ కువెళ్తున్న వాహనదారులు తాడ్ బండ్, మస్తాన్ కేప్, డైమండ్ పాయింట్, రైట్ టర్న్, మడ్ ఫోర్ట్, ఎన్సీసీ, జేబీఎస్, ఎస్బీఐ గుండా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే సుచిత్ర నుంచి పంజాగుట్ట/ ట్యాంక్ బండ్ వైపునకు వచ్చే వాహనదారులు సేఫ్ ఎక్స్ ప్రెస్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని బాపూజీ నగర్- సెంటర్ పాయింట్- డైమండ్ పాయింట్- మడ్ ఫోర్ట్- ఎన్సీసీ- జేబీఎస్- ఎస్బీఐ వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ట్యాంక్ బండ్/ రాణిగంజ్/పంజాగుట్ట/రసూల్ పూరా/ ప్లాజా నుంచి తాడ్ బండ్ వైపు వయా సీటీఓ జంక్షన్ కు వెళ్లేవారు రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుంచి అన్నా నగర్- బాలమ్రాయ్- తాడ్ బండ్ వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. అన్నా నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్.. వాహనదారులు పంజాగుట్ట/ ట్యాంక్ బండ్ వైపునకు వెళ్లే వాహనదారులు మీటింగ్ పాయింట్ బై లైన్, హాకీ గ్రౌండ్ బై లైన్, లేదా ఎల్ అండ్ ఓ పోలీస్ స్టేషన్ బై లైన్ ను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

విజయవాడ లోని ప్రకాశం బ్యారేజ్‌ని మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 6 నుంచి 6 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్‌కు వస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.  ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని మంత్రి నిమ్మల తెలిపారు.

టాటా మోటార్స్‌ ద్విచక్ర వాహనాల తయారీలోకి రాబోతున్నదని, సంప్రదాయ బైకులతోపాటు విద్యుత్తు ఆధారిత (ఈవీ) టూవీలర్లను మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నదన్న వార్తలు పలు సోషల్‌ మీడియా వేదికల్లో హల్‌చల్‌ చేశాయి. ఇప్పటికే భారీ, మధ్యశ్రేణి, తేలికపాటి వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్‌ కార్ల తయారీలో దూసుకుపోతున్న టాటా మోటార్స్‌, ఇక టూవీలర్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశించబోతున్నదని, ఈ క్రమంలోనే ముందుగా 110సీసీ, 125సీసీ బైకులను అందుబాటులోకి తేనుందని జోరుగా ప్రచారం జరుగుతున్నది. 110సీసీ బైక్‌ ధర రూ.45,999గా, 125సీసీ బైక్‌ ధర రూ.55,999గా ఉండొచ్చన్న అంచనాలూ వినిపిస్తుండటం గమనార్హం. ఇవి లీటర్‌ పెట్రోల్‌కు 90 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయనీ అంటున్నారు. అలాగే సింగిల్‌ చార్జింగ్‌పై 280 కిలోమీటర్లు ప్రయాణించేలా టాటా బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ టూవీలర్లూ వస్తాయని చెప్తుండటం విశేషం. అయితే వీటి ధర కేవలం రూ.85,000గానే ఉండొచ్చని ఆయా వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి.

మహారాష్ట్ర లోని పూణే నుంచి మాంగావ్‌కు వోక్స్‌వాగన్ వర్టస్ కారులో వెళ్తుండగా తమ్హిని ఘాట్‌ వద్ద  ఒక పెద్ద రాయి కారుపై పడింది. రాయి దాటికి సన్‌రూఫ్‌ పగిలి ప్యాసింజర్ సీటులో కూర్చున్న స్నేహల్ గుజరాతీ అనే మహిళ తలపై పడింది. సన్‌రూప్ ఉండకపోయి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవనే మాటలు వినిపిస్తున్నాయి. చూడటానికి లగ్జరీగా అనిపించినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీసే అవకాశం ఉందని ఈ ఘటన రుజువు చేస్తోంది. సన్‌రూఫ్ కార్లపై ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. ప్రతీ కంపెనీ తమ ప్రముఖ కార్లకు ఖచ్చితంగా సన్‌రూఫ్ ఆప్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, కొన్ని సందర్భాల్లో ఇవి ఎంత ప్రమాదమో ఈ ఘటన తెలియజేస్తుంది. 

దేశీయంగా రాగికి డిమాండ్‌ బలపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) 1,878 కిలో టన్నులకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో డిమాండ్‌ 1,718 కిలో టన్నులతో పోల్చి చూసినప్పుడు 9.3 శాతం పెరిగింది. ఇంటర్నేషనల్‌ కాపర్‌ అసోసియేషన్‌ ఇండియా (ఐసీఏ ఇండియా) ఈ వివరాలను నివేదిక రూపంలో విడుదల చేసింది. ఆర్థికంగా పురోగమిస్తుండడం, కీలక రంగాల్లో కాపర్‌ వినియోగం పెరుగుతుండడం డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. భారీ స్థాయి మౌలిక ప్రాజెక్టులు, భవన నిర్మాణాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, సోలార్‌ విద్యుత్‌ సామర్థ్యాల విస్తరణ వంటివి డిమాండ్‌ను అధికం చేస్తున్నాయని పేర్కొంది. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో భవన నిర్మాణ రంగం నుంచి కాపర్‌కు డిమాండ్‌ 11 శాతం పెరగ్గా, మౌలిక సదుపాయాల రంగం నుంచి 17 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది. ''భారత్‌లో ఆర్థిక, పారిశ్రామిక పురోగతికి అనుగుణంగా కాపర్‌ డిమాండ్‌ పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన వనరులు, సుస్థిర రవాణా పరిష్కారాలు, మౌలిక వసతుల అభివృద్ధి కాపర్‌ డిమాండ్‌ను పెంచుతున్నాయి. దేశ అభివృద్ధికి కీలక వనరుగా కాపర్‌ తనవంతు పాత్రను తెలియజేస్తోంది''అని ఐసీఏ ఇండియా తెలిపింది. అయితే వికసిత్‌ భారత్‌ ఆకాంక్షకు అనుగుణంగానే ప్రస్తుత కాపర్‌ డిమాండ్‌ ఉందా? అని ప్రశ్నించుకోవాలని ఏసీఏ ఇండియా ఎండీ మయాంక్‌ కర్మార్కర్‌ పేర్కొన్నారు. కాపర్‌ నిల్వలను అభివృద్ధి చేసుకోవడం, దేశీ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం ద్వారా భవిష్యత్‌ డిమాండ్‌ను చేరుకోవచ్చని సూచించారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకో కొత్త ధరకు చేరుతూ సామాన్యులకు అందనంత దూరంగా జరిగిపోతోంది పసిడి. ఇన్వెస్టర్లు సైతం స్వర్ణంపై సంపూర్ణ విశ్వాసం పెట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో 'భవిష్యత్‌ బంగారం'గా మరో లోహం ఆశలు పూయిస్తోంది. అదే 'రాగి'. మల్టీ నేషనల్‌ మైనింగ్‌ సంస్థ వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కాపర్‌ను 'తదుపరి బంగారం'గా అభివర్ణించారు. ఇది క్లీన్‌ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ఎక్కువగా ప్రాముఖ్యతను పొందుతోందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి మౌలిక సదుపాయాలు, ఏఐ, రక్షణ పరికరాలలో కాపర్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను ఆయన ప్రస్తావించారు. కెనడాలోని బారిక్ గోల్డ్ సంస్థ తన పేరులో గోల్డ్‌ పదాన్ని తొలగించి కేవలం 'బారిక్'గా మార్చడం గ్లోబల్ స్థాయిలో కాపర్ గనులపై దృష్టి మారే సంకేతంగా ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజ్‌కు భారీ ప్రమాదం తప్పింది. వరదలో కొట్టుకు వచ్చిన 30 టన్నుల భారీ బోటు బ్యారేజ్‌ గేట్లకు అడ్డంగా పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణ చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తుఫాన్‌ కారణంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లేలాయి. పెన్నా నదిపై ఉన్న సంగం బ్యారేజ్‌కు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. అదే సమయంలో భారీ బోటు ప్రవాహంలో కొట్టుకువచ్చి బ్యారేజ్‌ వైపు చేరింది. అది గేట్లను తాకే పరిస్థితి వస్తే బ్యారేజ్‌కు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షణ చేపట్టారు. వారి ఆధ్వర్యంలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, కృష్ణపట్నం పోర్టు గస్తీ సిబ్బంది, పోలీసు విభాగం, వ్యవసాయ శాఖ అధికారులు సమిష్టిగా పని చేశారు. దాదాపు 100 మంది సిబ్బంది సహకారంతో ఆ బోటును విజయవంతంగా తొలగించారు. 3.85 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి ఆధారమైన సంగం బ్యారేజ్‌ ప్రమాదం నుంచి బయటపడడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా యంత్రాంగం సమయోచితంగా స్పందించిందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా అధికారులను అభినందిస్తూ, "ఆ బోటు అలాగే కిందకు వెళ్లి ఉంటే బ్యారేజ్‌ గేట్లను ఢీకొని భారీ నష్టం జరిగేదే" అని పేర్కొన్నారు. అధికారుల ప్రకారం, బిరపేరు, బోగ్గేరు వాగుల్లో అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు సంగం బ్యారేజ్‌ వద్ద నీరు 11 అడుగులకు చేరుకుంది. ఈ వరద వేగం కారణంగా వంతెన రైలింగ్‌కు కట్టిన మూడు బోట్ల తాళ్లు తెగిపోయాయి. వాటిలో ఒకటి ఇసుక తిన్నెల్లో చిక్కుకోగా, మరోటి కనిగిరి రిజర్వాయర్‌ వైపుకు వెళ్లింది. మూడో బోటు మాత్రం బ్యారేజ్‌కు కేవలం 400 మీటర్ల దూరంలో నిలిచిపోవడంతో వెంటనే చర్యలు తీసుకుని రక్షించారు. 

అమెరికా వర్క్ పర్మిట్ రెన్యువల్ విషయంలో గతంలో ఉన్న 'ఆటోమేటిక్ ఆథరైజేషన్' నిబంధనను రద్దు చేసింది. దీని ప్రభావంతో, రెన్యూవల్ కోసం దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నప్పటికీ గతంలో ఉన్న 540 రోజుల పాటు పని చేసే అవకాశం ఇకపై ఉండదు. వర్క్ పర్మిట్ గడువు ముగిసేలోగా కొత్త పర్మిట్ మంజూరు కాకపోతే, సంబంధిత మైగ్రెంట్‌కు ఉద్యోగ అనుమతి వెంటనే ఆగిపోతుంది. ఇది ముఖ్యంగా ఇండియన్ ఐటీ నిపుణులు, వారి కుటుంబాలపై పెను ప్రభావం చూపనుంది. ఈ కొత్త నిబంధన వల్ల నేరుగా నష్టపోయే వ్యక్తుల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ల భాగస్వాములు (H4 వీసాదారులు), H-1B వీసా హోల్డర్ల భాగస్వాములు (H4 EAD), అలాగే STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) లోని విద్యార్థులు వర్క్ ఎక్స్‌టెన్షన్స్ OPTపై ఉన్నవారు ఉన్నారు. USCIS ప్రాసెసింగ్ సమయాలు తరచుగా ఎక్కువ ఉండడం వలన, ఈ మార్పు వల్ల రెన్యూవల్ ప్రక్రియలో ఆలస్యం జరిగితే లక్షలాది మంది వలసదారులు, ముఖ్యంగా భారతీయ మైగ్రెంట్లకు తాత్కాలికంగానైనా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. కొత్త పర్మిట్ వచ్చే వరకు వారు విధిగా 'అన్‌పెయిడ్ లీవ్' తీసుకోవాల్సి వస్తుంది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, పౌరుల భద్రతకు, జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, దరఖాస్తుదారుల స్ర్కీనింగ్‌ను మరింత పటిష్టం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఇమ్మిగ్రేషన్ నిపుణులు, వలసదారుల హక్కుల సంఘాలు ఈ మార్పును తీవ్రంగా విమర్శిస్తున్నాయి. USCIS తన ప్రాసెసింగ్ సమయాలను మెరుగుపరచడంలో విఫలమవడం వల్లే ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ అవసరం ఏర్పడిందని, ఇప్పుడు ఆ పద్ధతిని రద్దు చేయడం ప్రభుత్వ అసమర్థతకు వలసదారులను శిక్షించడమేనని అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు, పరిశ్రమలకు కూడా నష్టం చేకూరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సవరించిన నిబంధనల దృష్ట్యా, ప్రభావితమైన వర్గాలు గడువు ముగిసే ప్రమాదం రాకముందే మేల్కోవాలి. USCIS ఇప్పుడు EAD రెన్యూవల్ కోసం గడువు ముగియడానికి 180 రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని గట్టిగా సూచిస్తోంది. ఈ మార్పు అక్టోబర్ 30, 2025 నుండి అమలులోకి వస్తుంది. అందువల్ల, వలసదారులు తమ వర్క్ పర్మిట్ రెన్యూవల్ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా సమర్పించడం, వారి చట్టబద్ధమైన ఉద్యోగ స్థితికి అంతరాయం కలగకుండా చూసుకోవడం అత్యవసరం. నిరంతరాయంగా ఉద్యోగం చేయగలిగేందుకు ముందస్తు ప్రణాళిక, దరఖాస్తుల వేగవంతమైన సమర్పణ కీలకం.

టీవీఎస్ కంపెనీ త్వరలోనే దేశంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ స్కూటర్‌ను విడుదల చేయనుంది. సీఎన్‌జీ స్కూటర్‌ను లాంచ్ చేసేందుకు టీవీఎస్ కంపెనీ ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. టీవీఎస్ కంపెనీ జూపిటర్ సీఎన్‌జీ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ 226 కిలోమీటర్ల వరకు అద్భుతమైన మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది ద్విచక్ర వాహన విభాగంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. జూపిటర్ స్కూటర్‌ను టీవీఎస్ కంపెనీ 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో కాన్సెప్ట్‌గా ప్రదర్శించింది. ఈ స్కూటర్ 2026 మధ్య నాటికి మార్కెట్‌లో విక్రయానికి అందుబాటులోకి వస్తుందని, దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ స్కూటర్‌గా పరిచయం చేస్తారని భావిస్తున్నారు. సీఎన్‌జీ ట్యాంక్‌ను సీటు కింద అమర్చారు. అయితే ట్యాంక్ కారణంగా స్కూటర్‌లో లభించే డిక్కీ స్థలం (బూట్ స్పేస్) కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఈ స్కూటర్ 1.4 కిలోగ్రాముల సీఎన్‌జీ ట్యాంక్‌తో వస్తుంది. ఒక కిలోగ్రాము CNGలో 84 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు. సీఎన్‌జీ కార్ల మాదిరిగానే బయో-ఫ్యూయల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ రెండింటిపై నడుస్తుంది. ఇందులో రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది. ఇది స్కూటర్ ఫ్లోర్‌బోర్డ్‌లో అమర్చబడుతుంది. పెట్రోల్, సీఎన్‌జీ మైలేజీని కలిపి చూస్తే, జూపిటర్ సీఎన్‌జీ మొత్తం రేంజ్ 226 కిలోమీటర్లు ఉంటుందని టీవీఎస్ పేర్కొంది. సీఎన్‌జీ నింపే నాజిల్, ప్రెజర్ గేజ్ డిక్కీ లోపల ఉంటాయి. అంటే సీఎన్‌జీ నింపడానికి వినియోగదారులు సీటు తెరవాల్సి ఉంటుంది. పెట్రోల్ నింపే నాజిల్ మాత్రం ముందున్న ఆప్రన్ ఏరియాలోనే ఉంటుంది. టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీలో 124.8cc సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ లభిస్తుంది. ఇది 7.1 bhp శక్తిని, 9.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు ఉండవచ్చు. డిజైన్, టెక్నాలజీ పరంగా, ఈ సీఎన్‌జీ స్కూటర్ సాధారణ జూపిటర్ స్కూటర్ మాదిరిగానే ఉంటుంది, కానీ దీనికి సీఎన్‌జీ బ్యాడ్జింగ్ (లోగో) అదనంగా లభిస్తుంది. కంపెనీ సీఎన్‌జీ స్కూటర్ కోసం కొత్త రంగుల ఎంపికలు (కలర్ ఆప్షన్స్), బాడీ గ్రాఫిక్స్‌ను కూడా తీసుకురావచ్చు. ఈ సెగ్మెంట్‌లో లభించే అన్ని ఆధునిక సాంకేతిక ఫీచర్లను ఇందులో చేర్చనున్నారు.

దక్షిణ కొరియా లోని బుసాన్ వేదికగా ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత వీరి భేటీ జరిగింది. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా సమావేశంతో ఉద్రిక్తలు చల్లారినట్లుగానే కనిపిస్తోంది. చైనాపై విధించిన సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య అద్భుతమైన సమావేశం జరిగిందని ట్రంప్ తెలిపారు. కీలక ఒప్పందాలు, ద్వైపాక్షిక చర్చలు ఆశాజనకంగా జరిగాయని పేర్కొన్నారు. అమెరికా సోయాబీన్‌ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా తక్షణమే పునరుద్ధరించేందుకు అంగీకారం కుదిరిందని వెల్లడించారు. అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని ట్రంప్ తెలిపారు. ఇకపై చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ఈ ఖనిజాలను ఏడాది పాటు అగ్రరాజ్యానికి ఎగుమతి చేసేలా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ అరుదైన ఖనిజాల కారణంగానే ఇటీవల ట్రంప్‌ చైనాపై 100శాతం సుంకాల హెచ్చరికలు జారీ చేశారు. తాజా డీల్‌తో బీజింగ్‌కు ఊరట లభించినట్లయ్యింది. ఇక చైనాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా కుదరనున్నట్లు ట్రంప్‌ సంకేతాలిచ్చారు. జిన్‌పింగ్‌పై ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. జిన్‌పింగ్‌ గొప్ప నేత అని, ఆయనకు 10కి 12 మార్కులు ఇస్తానన్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఆపేందుకు అమెరికాతో కలిసి పనిచేసేందుకు చైనా అంగీకరించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చైనాలో పర్యటిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే జిన్‌పింగ్ కూడా అమెరికాకు వస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. జిన్‌పింగ్ మాట్లాడుతూ ట్రంప్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి చూడటం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్ తిరిగి ఎన్నికైన తర్వాత మూడుసార్లు ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు గుర్తు చేశారు. ఆయా లేఖల ద్వారా సన్నిహిత సంబంధాలు కొనసాగాయని వెల్లడించారు. ఉమ్మడి మార్గదర్శకత్వంలో అమెరికా-చైనా సంబంధాలు స్థిరంగా ఉన్నాయని, అప్పుడప్పుడు ఘర్షణలు పడటం సాధారణమే అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.

బెంగళూరులో కొందరు టెక్కీలు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఊహించని పనులు చేస్తున్నారు. ఫుడ్‌ డెలివరీ బాయ్‌లుగా, ట్యాక్సీ డ్రైవర్లు సేవలందిస్తూ రిలాక్స్‌ అవుతున్నట్లు తెలిపారు. పగలంతా ఉద్యోగంలో బిజీగా ఉండి, రాత్రి కాగానే కొత్త అవుతారం ఎత్తుతున్నారు. మరికొందరు డబ్బు కోసమే చేస్తున్నారు. రాత్రి సమయాలో ఈ వృత్తుల్లోకి మారుతున్నారు. సంపాదిస్తున్న డబ్బులు సరిపోవడం లేదా? లేదా ఊరికే టైంపాస్‌ కోసం ఇలా చేస్తున్నారా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నం అవుతున్నాయి. ఇవే ప్రశ్నలను కొందరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను ప్రశ్నిస్తే ఆశ్చర్యకరమైన సమాధానాలు వచ్చాయి. బెంగళూరు రోజురోజుకి ఎంతో ఖరీదు అయిన నగరంగా మారుతోంది. అందులోనూ ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతాల్లో ఇంటి అద్దెలు, ఆహారం, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ప్రతి టెక్కీకి అందరూ అనుకున్నట్లుగా పెద్ద పెద్ద జీతాలు లభించడం లేదు. కొత్తగా కెరీర్‌ ప్రారంభించిన వారికి రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వేతనం లభిస్తోంది. ఆ డబ్బు చాలక అదనపు మార్గాలను అన్వేస్తున్నారు. పలువురు యువ ఇంజనీర్లు వారానికి రెండు రాత్రులు అయినా క్యాబ్‌ నడుపుతూ సంపాదిస్తారు. బెంగళూరు టెక్కీలకు జీవితం ఒక యాంత్రికంగా మారిపోయింది. ఉదయాన్నే లేవడం, రెడీ కావడం, ఆఫీసుకు వెళ్లడం, అక్కడ రోజంతా ఒత్తిడిలో కష్టపడడం, టార్గెట్లు, తిరిగి ఇంటికి రావడం, పడుకోవడం ఇలా ఒక రొటీన్‌ జీవితానికి అలవాటు పడ్డారు. దీంతో జీవితంలో ఒంటరితనం పెరుగుతోంది. అలాగే మానసిక సమస్యలు, కోపం, ఉద్వేగాలు నియంత్రణలో లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి బయటకు వచ్చేందుకు తరచూ ట్రెక్కింగ్‌ వెళ్లడం, నైట్‌ పార్టీలకు వెళ్లడం చేస్తున్నారు. అయితే వీటి వల్ల ఆశించిన మేర వారికి ఫలితాలు రావడం లేదు. ఈ క్రమంలో ఒక మార్పు కోసం రాత్రి సమయాల్లో ఇతర వ్యాపకాలను అనుసరిస్తున్నారు. 

తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థలు ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్, నిర్వహణ ఫీజు  పథకాల కింద విడుదల చేసిన నిధులను అక్రమంగా దుర్వినియోగం చేశాయని అందిన సమాచారం ఆధారంగా ప్రభుత్వం విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, బిఎడ్ వంటి కళాశాలలు నిజంగా ఆమోదం పొంది పనిచేస్తున్నాయా లేదా అని విచారించాలని ప్రభుత్వం విజిలెన్స్ విభాగాన్ని కోరింది. స్కాలర్‌షిప్‌లు పొందుతున్న విద్యార్థులు అర్హులా కాదా, వారి ప్రవేశ ప్రక్రియపై దర్యాప్తు చేయాలని కూడా ఆ శాఖను ఆదేశించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ జారీ చేసిన మెమో ప్రకారం, నిబంధనల ప్రకారం బోధన, బోధనేతర సిబ్బంది, తరగతి గదులు, ఫర్నిచర్, ల్యాబ్‌లు మరియు ఇతర ముఖ్యమైన మౌలిక సదుపాయాలు/సౌకర్యాల అవసరాలను దర్యాప్తు పరిశీలిస్తుంది. రీయింబర్స్‌మెంట్ పొందిన విద్యార్థులకు కనీస హాజరు ఉందా, సరైన విద్యా పనితీరు ఉందా లేదా అనే దానిపై విచారణ చేసే పని ఈ విభాగానికి అప్పగించబడింది. ప్రభుత్వం ఆ శాఖను వెంటనే తనిఖీలు చేపట్టి, నిర్దిష్ట సిఫార్సులతో పాటు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. నవంబర్ 1 నాటికి రూ.900 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలతో కూడిన తెలంగాణ ఉన్నత సంస్థల సంఘాల సమాఖ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దసరా మరియు దీపావళికి ముందు రూ.1,200 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇప్పటివరకు రూ.300 కోట్లు మాత్రమే చెల్లించలేదని తెలుస్తోంది. అదనంగా, 2024-25 విద్యా సంవత్సరానికి పెండింగ్‌లో ఉన్న రూ.9,000 కోట్ల బకాయిలను చెల్లించడానికి, జూన్ 2026 నాటికి పూర్తి చెల్లింపును నిర్ధారించేందుకు ప్రభుత్వం ఒక నిర్ణీత కాలపరిమితి గల రోడ్‌మ్యాప్‌ను ప్రకటించాలని ప్రైవేట్ కళాశాలలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం బకాయిలను కూడా సకాలంలో విడుదల చేయాలని యాజమాన్యం డిమాండ్ చేసింది.

మొంథా తుఫాన్ వాయుగుండంగా బలహీనపడింది. గడిచిన 6 గంటలుగా ఇది 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తెలంగాణ రాష్ట్రంపై దీని ప్రభావం కొనసాగుతోంది. భద్రాచలానికి 50 కిలోమీటర్లు, ఖమ్మం జిల్లాకు 110 కిలోమీటర్లు దూరంలో వాయుగుండంలో కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడింది. దీని కారణంగా రానున్న 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో ఒకట్రెండు ప్రాంతాలకు ఆకస్మిక వరద హెచ్చరికలను విశాఖ వాతావరణ కేంద్రం జారీ చేసింది. విశాఖ, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని మిగతా జిల్లాల్లో అక్కడకక్కడ తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌, పోలీస్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ కల్పనా రఘువంశీ చోరీకి పాల్పడటం ప్రధానాంశంగా నిలిచింది. ఎన్‌డీటీవీ కథనం ప్రకారం డిప్యూటీ సూపరింటెండెంట్ కల్పనా రఘువంశీ తన స్నేహితురాలి ఇంటిలో నుంచి రూ. 2 లక్షల నగదు, మొబైల్ ఫోన్ దొంగిలించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమెపై కేసు నమోదయ్యింది. భోపాల్‌లోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసుశాఖలో జవాబుదారీతనంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు తన మొబైల్ ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచి స్నానానికి వెళ్లానని, ఇంతలో డిఎస్పీ కల్పనా రఘువంశీ తమ ఇంటిలోనికి ప్రవేశించి, తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచిన నగదు, మరొక సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లారని ఆరోపించారు. నగదు, ఫోన్‌ కనిపించకపోవడంతో ఫిర్యాదుదారు సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేయగా, దానిలో డీఎస్పీ రఘువంశీ ఇంట్లోకి ప్రవేశించడం, బయటకు వెళ్లడం కనిపించింది. ఆ ఫుటేజీలో అధికారిణి ఆ ఇంటి ఆవరణ నుండి బయటకు వెళ్లేటప్పుడు కరెన్సీ నోట్ల కట్టను పట్టుకుని ఉన్నట్లు కూడా కనిపించిందని పోలీసుల వర్గాలు తెలిపాయి. ఈ ఫుటేజీని చూసిన వెంటనే ఆ మహిళ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.

మోంథా తుపాను వల్ల మహబూబ్‌నగర్‌లో భారీ వర్షాల కారణంగా శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్‌లోని ఉప్పునుంతల మండలం లత్తిపూర్ వద్ద జాతీయ రహదారి రోడ్డు తెగిపోయింది. డిండి ప్రాజెక్టు అలుగుపోయడంతో జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో 765 హైవేపై హైదరాబాద్‌- శ్రీశైలం వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను అచ్చంపేట మండలంలోని హాజీపూర్ మీదుగా మళ్లించారు. వంగూరు మండలం చింతపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి. మరోవైపు ఎడతెరపి లేని వర్షానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లా చిగురుటాకులా వణికింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో భారీ వర్షం కురిసింది. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో సుమారు రెండు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నీట మునిగింది. రైల్వే ట్రాక్‌పై మూడు అడుగుల ఎత్తులో నీరు ప్రవహించగా, జేసీబీల సాయంతో అధికారులు 12 గంటలు శ్రమించి నీటిని తొలగించారు. ముందు జాగ్రత్తగా వేగం నియంత్రించి నెమ్మదిగా రైళ్ల రాకపోకలు సాగిస్తున్నారు.

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో 17 ఏళ్ల క్రికెటర్ బెన్ ఆస్టిన్ తలకు బంతి తగలడంతో మరణించాడు. మంగళవారం మధ్యాహ్నం బెన్ మెల్బోర్న్ లోని ఫెర్న్ ట్రీ గల్లీలోని వ్యాలీ ట్యూ రిజర్వ్ గ్రౌండ్ లో నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. నివేదికల ప్రకారం, అతను పూర్తి భద్రతతో హెల్మెట్ ధరించి బౌలింగ్ మెషిన్ ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, అప్పుడు వేగంగా వచ్చిన బంతి అతని తల,మెడ మధ్య భాగంలో తగిలింది. ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని తీవ్ర స్థితిలో మొనాష్ మెడికల్ సెంటర్ కు తరలించారు. అక్కడ వైద్యులు ఎంత ప్రయత్నించినా బుధవారం నాడు అతను మరణించాడు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని, అది తీవ్ర వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకొచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 31వ తేదీకి ఆవర్తనంగా మారుతుంది. నవంబర్ 1వ తేదీకి ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం తూర్పు బంగాళాఖాతంలో, థాయిలాండ్ పక్కన ఏర్పడుతుంది. ఇది క్రమంగా పశ్చిమం వైపు కదులుతుంది. అది దిశమార్చుకోకుండా అలానే ముందుకు వస్తే ఏపీలోని గుంటూరును చేరగలదని తెలుస్తోంది. అయితే, దాని దిశ ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఇది అల్పపీడనంగా ఉంటుందా వాయుగుండంగా మారి ఆ తరువాత తుపానుగా మారుతుందా అనేది ఇంకా తెలియదని, ఒకవేళ అల్పపీడనం దిశ మార్చుకోకుండా వస్తే ఏపీలో మళ్లీ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

భారీగా వరద నీరు, వర్షపునీరు రావడంతో సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులో 20 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 16 గేట్లు 10 అడుగులు, 04 గేట్లు 5 అడుగుల వరకు పైకెత్తి 2,72,608 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం కూడా 590 అడుగులు ఉండటంతో అధికారులు కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టిఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో & అవుట్ ఫ్లో కలిపి 3,06,062 క్యూసెక్కులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కాలువల్లో భారీగా వరదనీళ్లు కిందకు వెళ్తుండటంతో వాగుల్లో ఉన్న వారందరూ బయటకు రావాలంటూ హెచ్చరిస్తున్నారు. పశువుల కాపరులు, జాలరులు ఎవరైనా కాలువల వెంబడి ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీ లో హైదరాబాద్ టాకీస్ ఆధ్వర్యంలో నవంబర్ 8న గ్రాండ్ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. ఈ విషయాన్ని బుధవారం హైదరాబాద్ టాకీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకలో రెహమాన్ తన సూపర్‌హిట్ పాటలను ప్రత్యక్షంగా ఆలపించబోతున్నారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ "హైదరాబాద్ ఒక డైనమిక్ సిటీగా నిరంతరం అభివృద్ధి చెందుతోంది. లైవ్ కాన్సర్ట్‌లకు ఇక్కడ ప్రజలు చూపుతున్న ఆదరణ నిజంగా అద్భుతం. ఏఐ ప్రభావం పెరుగుతున్న ఈ కాలంలో, ప్రేక్షకులు ఇంకా నిజమైన సంగీత అనుభూతి కోసం లైవ్ కాన్సర్ట్‌లకు రావడం కళాకారులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. ఇది మన సంగీత పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం" అని చెప్పారు. హైదరాబాద్ టాకీస్ వ్యవస్థాపకుడు సాయినాథ్ గౌడ్ మాట్లాడుతూ "మా లక్ష్యం ఎల్లప్పుడూ ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సంగీత అనుభవాన్ని అందించడమే. ఈ ఏడాది ఆరంభంలో ఎం.ఎం. కీరవాణిని ఆతిథ్యం ఇచ్చాము. ఇప్పుడు ఏఆర్ రెహమాన్‌ను రెండోసారి నగరానికి తీసుకురావడం గర్వకారణం. దీని కోసం దీపక్ చౌదరి, ఇవా లైవ్ సంస్థలతో కలిసి పని చేస్తున్నాం" అని తెలిపారు.

3