బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న జకీర్ నాయక్ : స్వాగతం పలికేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు ?


మత బోధకుడు జకీర్ నాయక్ బంగ్లాదేశ్‌ పర్యటనకు యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. జకీర్ నాయక్‌కు స్వాగతం పలికేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు జకీర్ నాయక్ బంగ్లాదేశ్ పర్యటన కొనసాగనుంది. జకీర్ నాయక్ బంగ్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.జూలై 2016లో ఢాకాలోని ఒక బేకరీపై ఉగ్రదాడి జరిగింది. ఆ దాడి అనంతరం ఒక ఉగ్రవాది మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా జకీర్ చేసిన బోధనలకు తాను ప్రభావితమయ్యానని చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో భారత్‌లో ఉన్న జకీర్ అరెస్టు భయంతో మలేసియాకు పారిపోయాడు. దీంతో మనీలాండరింగ్, విద్వేష ప్రసంగాల ఆరోపణల కేసులో భారత్ జకీర్‌ను వాంటెడ్‌గా ప్రకటించింది.జకీర్ నాయక్‌కు చెందిన పీస్ టీవీని అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నిషేధించారు. అలాంటి వ్యక్తికి యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారికంగా స్వాగతం పలకనుంది. జకీర్ నాయక్ గత ఏడాది పాకిస్థాన్‌లో కూడా పర్యటించారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org