August 2024

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలోని మొగల్రాజ పురం వద్ద కొండచరియలు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతుండగా ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అన్నిశాఖలు సహకరిస్తూ ముందుకు సాగాలని కోరారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి ఆదేశించారు. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా ఎప్పటికపుడు అలెర్ట్ మెసేజ్‌లు పంపించాలని కోరారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలని, ప్రజల ప్రమాదాల బారిన పడుకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్‌గా సురేంద్రమోహన్‌కు పూర్తి బాధ్యతలను అప్పగించింది. హార్టికల్చర్ డైరెక్టర్‌గా యాస్మిన్ బాషా, తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ వైస్ ఛైర్మన్‌గా మలూర్స్‌ను నియమించింది. ఇక ములుగు జిల్లా అదనపు కలెక్టర్‌గా సిరిజను నియమించగా, మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీగా ఇక్బాల్‌ను అపాయింట్ చేసింది. అటు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా నిర్మల క్రాంతిని నియమించగా, హెచ్‌ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యూ జాయింట్ సెక్రటరీగా వినయ్ కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఇటు హెచ్‌ఎండీఏ స్పెషల్ గ్రేడ్ అడిషనల్ కలెక్టర్‌గా అసదుల్లాకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ విచారణ చేపట్టింది. అయితే.. నేటితో కమిషన్ గడువు ముగియటంతో కమిషన్‌ గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. అక్టోబర్‌ నెలాఖరు వరకు పొడిగిస్తూ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసింది. జూన్‌లోనే కమిషన్‌ విచారణ గడువు ముగియగా రెండు నెలలు పొడిగించారు. ఆగస్టు 31తో ఆ గడువూ ముగిసింది. అయినా, విచారణ పూర్తి కాకపోవడంతో మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బంగాళాఖాతంలోని వాయుగుండం అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హోంమంత్రి వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 45-55కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. రేపు చాలాచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. రానున్న రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని.. ఇకపై ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు హోంమంత్రి అనిత సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరతగతిన రెస్క్యూ ఆపరేషన్స్ జరగాలన్నారు. ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇరిగేషన్ , ఆర్ డబ్ల్యూ ఎస్, హెల్త్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని హోంమంత్రి సూచించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ , పడిన చెట్లు వెంటనే తొలగించాలన్నారు. ప్రజలు రోడ్ల మీద నీరు పూర్తిస్థాయిలో తగ్గేవరకు బయటకు రాకూడదని.. ప్రజలు సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని హోంమంత్రి కోరారు. 

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్‌పై దాడికి యత్నం జరిగింది. బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఒక యువకుడు మంత్రిపై దాడికి ప్రయత్నించడంతో సింగ్ మద్దతుదారులు అతన్ని వెంటనే అదుపులోనికి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ''మౌల్వి తరహాలో దుస్తులు ధరించి గడ్డంతో ఉన్న యువకుడు ఒక పిటిషన్ తీసుకుని నా వద్దకు వచ్చాడు. పిటిషన్‌ను పరిశీలించాల్సిందిగా కోరాడు. జనతా దర్బార్ ముగిసిందని, సకాలంలో వచ్చి ఉండాల్సిందని అతనికి చెప్పాను. దాంతో అతను గట్టిగా కేకలేస్తూ నాకు వ్యతిరేకంగా నినాదులు చేశాడు. ఒక దశలో అతను భౌతిక దాడికి పాల్పడతాడని అనిపించింది. యువకుడు మాట్లాడిన తీరు చాలా దారుణంగా ఉంది. ఇలాంటి దాడులకు భయపడేది లేదు'' అని గిరిరాజ్ సింగ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో తెలిపారు. కాగా, ఈ ఘటనలో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు బెగుసరాయ్ ఎస్పీ మనీష్ తెలిపారు.

గ్రూప్ 3 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మరోసారి ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చింది టీజీపీఎస్‌సీ. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చింది. గ్రూప్ 3 అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలని టీజీపీఎస్‌సీ కమిషన్ తెలిపింది. అభ్యర్థులు టీజీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో నేరుగా లాగిన్ అయి ఎడిట్ చేసుకోవచ్చునని కమిషన్ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1375 గ్రూప్ 3 పోస్టుల భర్తీ కోసం జనవరి 24 నోటిఫికేషన్ జారీ చేసింది. జులైలో పరీక్షలు జరగాల్సి ఉండగా.. వివిధ కారణాల చేత వాయిదా పడింది. కాగా, ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్రపరిశ్రమను కుదిపేస్తోన్న నేపథ్యంలో.. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌'ను లక్ష్యంగా చేసుకోవద్దని 'అమ్మ' మాజీ అధ్యక్షుడు మోహన్‌ లాల్‌ విజ్ఞప్తి చేశారు. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని, ఆ నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైనదేనన్నారు. అన్ని ప్రశ్నలకు 'అమ్మ' సమాధానం ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అమ్మ అనేది ట్రేడ్ యూనియన్ కాదని ఇది ఒక కుటుంబం లాంటిదని మోహన్ లాల్ అన్నారు. అమ్మ అసోసియేషన్‌పై లైంగిక ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. మలయాళ చిత్రపరిశ్రమ.. చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ అని, ఇందులో చాలామంది ఉన్నారని, అందరినీ నిందించలేమని తెలిపారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో దయచేసి పరిశ్రమను నాశనం చేయకండని విజ్ఞప్తి చేశారు. దోషులకు శిక్ష తప్పదని మోహన్ లాల్ స్పష్టం చేశారు.

ఈరోజు నుంచి సెప్టెంబర్ 8 వరకు అమెజాన్ ఫ్రెష్ సూపర్ వాల్యూ డేస్ సేల్ నిర్వహిస్తుంది. కిరాణా మరియు నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, స్నాక్స్ & పానియాలు, రోజూవారీ అవసరాలపై 45% వరకు డిస్కౌంట్ ఇస్తోంది. మొదటి నాలుగు ఆర్డర్స్ పై మొత్తం రూ. 400 క్యాష్ బాక్ ను కొత్త కస్టమర్లు పొందవచ్చు.  ఐసీఐసీఐ క్రెడిట్ & డెబిట్ కార్డ్స్ పై కస్టమర్లు 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు, ఇతర ప్రముఖ క్రెడిట్ / డెబిట్ కార్డ్స్ నుండి ఉత్తేజభరితమైన ఆఫర్లను పొందవచ్చు. పండ్లు & కూరగాయలపై అదనంగా రూ. 50 క్యాష్ బాక్ పొందవచ్చు.అనుకూలమైన సమయంలో మీ ఇంట ముంగిట నేరుగా ఉత్పత్తుల డెలివరీ చేస్తోంది.  

హైదరాబాద్ లోని కూకట్ పల్లి శివానంద రిహబిలిటేషన్ హోమ్ లో విమల అనే మహిళ ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తూ తన తల్లిదండ్రులతో ఒక క్వార్టర్ లో నివాసం ఉంటోంది. గత శుక్రవారం రోజున రాత్రి స్వగ్రామం బాపట్ల నుండి ఉన్నత చదువుల కోసం వచ్చిన తమ్ముడు తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్నారు, ఈ క్రమంలో దోమల నివారణకు ఉంచిన బత్తి మండి చుట్టుపక్కల ఉన్న వస్తువులకు అంటుకొని సిలిండర్ కు మంటలు వ్యాపించడంతో ఊపిరి ఆడక తమ్ముడు అభిషేక్ (27) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విమల 35 శాతం కాలిన గాయాలతో పక్కనే ఉన్న రాందేవ్ రావు ఆసుపత్రిలో ఐ సి యూ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ అటు ఆసుపత్రి వర్గాలు కానీ, పోలీసులు కానీ, ఫైర్ ఉద్యోగులు గాని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. 

కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 8 గేట్లు 12 అడుగులు, మరో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో 3,26,481 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. 3,80,499 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా నిండి నిండుకుండలా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 215.8070 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

పారిస్ పారాలింపిక్స్ లో భారత్ మహిళా షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యం కైవసం చేసుకుంది. 10మీ.ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్1 ఫైనల్లో 211.1 స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. జవాన్మార్డి సారె (ఇరాన్) 236.8 స్కోరుతో స్వర్ణం సాధించింది. తుర్కియోకు చెందిన 46 ఏళ్ల ఐసెల్ ఓజ్గాన్ (231.1) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. తాజాగా రుబీనా పతకం గెలవడంతో భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది.

సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దేశంలో దీర్ఘకాల సగటు 167.9 మిల్లీ మీటర్లలో 109 శాతం వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మోహపాత్ర పేర్కొన్నారు. వాయువ భారత్‌, పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్చువల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో సహా వాయువ్య ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందదన్నారు. వాయువ్య భారతంలోని కొన్ని, దక్షిణ ద్వీపకల్పంలోని అనేక ప్రాంతాలు, ఉత్తర బీహార్, ఈశాన్య ఉత్తరప్రదేశ్, అలాగే ఈశాన్య భారతదేశంలో చాలా వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది ఐఎండీ చీఫ్‌ వెల్లడించారు. రుతుపవన ద్రోణి సాధారణ స్థితిలోనే ఉంటుందని, బంగాళాఖాతంలో పలు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. పశ్చిమ-వాయువ్య దిశగా రాజస్థాన్‌ వరకు.. ద్రోణి హిమాలయాల వైపు సైతం వెళ్లవచ్చని తెలిపారు. సెప్టెంబరులో ఈ ప్రాంతాన్ని వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావితం చేసే అవకాశం ఉందని మోహపాత్ర తెలిపారు.

పుష్ప 2 సినిమాను మొదట ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6న సినిమా రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్‌ లాక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా తెలుగు సహా అన్ని భాషలకు కలుపుకొని అక్షరాల రూ.270 కోట్లకు డీల్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ఓటీటీ డీల్ అంటే మాముులు విషయం కాదు. ఈ లెక్కన్న పుష్ప సీక్వెల్‌పై ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక బెస్ట్‌ యాక్టర్‌గా బన్నీకు, బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవికి నేషనల్ అవార్డులు రావడంతో సినిమాపై వీర లెవల్లో అంచనాలు నెలకొన్నాయి.

ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా పెళ్లయిన మహిళపై ఇంట్లోనే అత్యాచారం జరిగింది. భాదోహిలో 20 ఏళ్ల మహిళపై రాహుల్ (28)అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం మహిళ భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. రాహుల్ ముందుగా సదరు మహిళతో అక్రమ సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించాడని, ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో డబ్బులు కూడా ఎరగా చూపాడని, ఆమె ప్రతిఘటించడంతో నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడని ఇన్‌స్పెక్టర్ సచ్చిదానంద్ పాండే తెలిపారు. భర్త తిరిగి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని అతడికి వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64[1] (రేప్), 351[2] (నేరపూరిత బెదిరింపు) కింద నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో మూడు రోజులపాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్ పర్యటించనున్నారు. కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జగన్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాచునూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన వైసీపీ నాయకుడు చంద్రారెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఉదయం పులివెందులలోని వైసీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినితులను స్వీకరించినన్నారు. సెప్టెంబర్ రెండో తేదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ముగించుకుని తాడేపల్లికి తిరుగుపయనం కానున్నారు.

తెలంగాణలోని గోదావరిఖనిలో రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గోదావరిఖనిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ తో కలిసి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రూ. 8 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంత యువతకు ఉపయోగపడేలా నైపుణ్య శిక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనన చేశామన్నారు. అంతేగాక, రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని, దీని కోసం స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎంతో కృషి చేశారన్నారు శ్రీధర్ బాబు. వచ్చే ఏడాది వెయ్యి మందికి శిక్షణ ఇచ్చేలా ఈ సెంటర్ ను అభివృద్ది చేస్తామని మంత్రి వివరించారు. రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు.

తెలంగాణలోని రామగుండంలో మూతపడ్డ బీ పవర్​ హౌస్​ 62.5 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ స్థానంలో 800 మెగావాట్ల పవర్​ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పవర్​ ప్రాజెక్టుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి, జెన్​కో జాయింట్​గా పవర్​ ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. అతి త్వరలోనే పవర్​ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామని, భూసేకరణపై ప్రతిపాదన త్వరగా పంపించాలని అధికారులను కోరామని భట్టి విక్రమార్క చెప్పారు. ఈరోజు రామగుండంలో మంత్రులు శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్​తో కలిసి పర్యటించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీ పవర్​ హౌస్‌​ను పరిశీలించారు. ఈ క్రమంలో పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా అధికారులు బీ పవర్​ హౌస్​ గురించి మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ చారిత్రాత్మకమైన పవర్​ ప్రాజెక్టు 50 ఏళ్ల క్రితం ఏర్పడి ఈ ప్రాంతానికి వెలుగునిచ్చిందని తెలిపారు. సాగునీటిని కూడా తీసుకువచ్చిన ప్రాజెక్టు కాలం చెల్లడంతో మూసివేసే పరిస్థితికి వచ్చిందని అయన అన్నారు. భావోద్వేగమైన పరిస్థితులతో ముడిపడి ఉన్న పవర్​ ప్రాజెక్టుపై సీఎం రేవంత్​ రెడ్డితో ఉమ్మడి జిల్లాల ప్రతినిధులు చర్చించామని తెలిపారు. ఈ క్రమంలో 800 మెగావాట్ల విద్యుత్​ పవర్​ ప్లాంట్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల్లోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి, జెన్‌​కో సంయుక్త వెంచర్​గా పవర్​ ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క అన్నారు.

హైదరాబాద్ లోని గగన్ పహాడ్ లోని అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన పదమూడు షెడ్లను హైడ్రా విభాగం ఈరోజు ఉదయం కూల్చి వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా హైడ్రా ప్రకటన విడుదల చేసింది. శంషాబాద్ పరిధిలో లో 35 ఎకరాల విస్తీర్ణంలో వున్న గగన్ పహాడ్ చెరువులో అక్రమం నిర్మాణాలు జరుగుతున్నట్లుగా హైడ్రాకు పలు ఫిర్యాదులు వచ్చాయి. ఇక వాటి పైన స్పందించిన హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపారు. అనంతరం హైడ్రా అధికారులు అప్పా చెరువులో మూడు ఎకరాల పరిధిలో అక్రమంగా పదమూడు షెడ్లను నిర్మించినట్లుగా నివేదిక ఇవ్వడంతో హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం స్థానిక పోలీసులు, రెవెన్యూ, నీటి పారుదల, మున్సిపల్ విభాగాల ఆధ్వర్యంలో అప్పా చెరువులో అక్రమంగా నిర్మించిన పదమూడు షెడ్ల నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ తొలగింపులతో లతో ఆక్రమణకు గురైన మూడు ఎకరాల చెరువును భూమిని హైడ్రా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకొనున్నారు.

ముంబైలోని ఘట్‌కోపర్‌ ప్రాంతంలో ఆగస్టు 18న రాత్రి 11:20 గంటల సమయంలో ఓ షాపింగ్ మాల్‌కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఎంట్రన్స్ నుంచి ముందు వైట్ కలర్ ఆడీ కారు లోపలి వస్తోంది. దాని వెనుకే మారుతి ఎర్టిగా ఓలా క్యాబ్ లోపలి వస్తోంది. ఆడీ కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనకున్న మారుతి కారు దానికి తాకింది. వెంటనే ఆడీ కారులోంచి ఓ మహిళ బయటకు దిగింది. తర్వాత ఆడీ కారు యజమానికి బయటకు వచ్చాడు. రావడంతోనే ఓలా క్యాబ్ డ్రైవర్‌పై విరుచుకుపడ్డాడు. గట్టిగా అరుస్తూ అతడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా క్యాబ్ డ్రైవర్‌ను తన రెండు చేతులతో పైకెత్తి నేలకేసి కొట్టాడు. బూటు కాళ్లతో ఇష్టమొచ్చినట్టు తన్నాడు. ఆడీ కారు యజమాని భార్య కనీసం తన భర్తను ఆపడానికి కూడా ట్రై చేయలేదు. అక్కడే ఉన్న సెక్యురిటీ గార్డులు, జనం కూడా చోద్యం చూశారే తప్పా, దాడిని ఆపలేదు. నేలపై ఉలుకుపలుకు లేకుండా పడివున్న క్యాబ్ డ్రైవర్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా, ఇంకా తిడుతూ ఆడీ కారు యజమాని, అతడి భార్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంఘటనా స్థలంలో ఉన్నవారు కూడా అమానవీయంగా ప్రవర్తించారు. సృహ తప్పిపడిపోయిన బాధితుడికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కొద్దిసేపటి తర్వాత సృహలోకి వచ్చిన అతడు తనంతట తానే మెల్లగా లేచాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన విజువల్స్ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఆడీ కారు యజమానిపై నెటిజనులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు స్పందించారు. బాధిత క్యాబ్ డ్రైవర్ కయముద్దీన్‌ని ఆస్పత్రికి తరలించామని, ఆడీ కారు యజమాని రిషబ్ చక్రవర్తి, ఆయన భార్య అంతర ఘోష్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 'బాధితుడిని మొదట ఘట్కోపర్‌లోని రాజావాడి ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జెజె ఆసుపత్రికి తరలించాం. అతడి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశాం. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. డ్రైవర్‌పై దాడి చేసినందుకు రిషబ్, అతని భార్యపై భారతీయ న్యాయ సంహిత లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. కోర్టుకు హాజరు కావాలని వారిద్దరికీ నోలీసులు జారీచేశామ'ని పోలీసు అధికారి ఒకరు పీటీఐతో చెప్పారు. ఈ అమానవీయ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజనలు తీవ్రంగా స్పందిస్తున్నారు. చిన్నచిన్న రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమంది అతిగా ప్రవరిస్తున్నారని, అవతలి వారి వివరణ వినకుండానే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ముంబై ఘటనలో క్యాబ్ డ్రైవర్‌పై అంత దారుణంగా దాడి చేయాల్సిన అవసరం లేదని, అతడిని గట్టిగా మందలించి.. నష్టపరిహారం కోరితే సరిపోయేదని అభిప్రాయపడ్డారు. కేవలం కారు కోసం మనిషి ప్రాణాలకు ముప్పువాటిల్లేలా ప్రవర్తిస్తారా?, క్యాబ్ డ్రైవర్‌కు ఏమైనా అయితే అతడి కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని ప్రశ్నించారు. ఆడీ కారు యజమానిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బీఎస్ఎన్ఎల్ సిమ్ ను స్మార్ట్ ఫోన్ లో సెకండరీ సిమ్ గా ఉంచుకునే వారికి రూ. 397 ప్లాన్ చాలా మంచిది . ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఐదు నెలల వరకు ఉంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే మరో 150 రోజుల వరకు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 30 రోజుల పాటు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. వినియోగదారులకు 150 రోజుల పాటు ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. మొదటి 30 రోజులు మీరు ప్రతిరోజూ 2 జీబీ మొబైల్ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ పొందుతారు. మొదటి 30 రోజుల పాటు మీరు ఈ ప్లాన్ లో ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లను కూడా పొందుతారు. 

గూగుల్ క్రోమ్‌లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆగస్టు 29న పేర్కొంది. ఇది చాలా ప్రమాదకరమైన సమస్య అని చెప్పింది. "గూగుల్ క్రోమ్‌లో చాలా సమస్యలు కనిపించాయి. ఈ సమస్యలను ఉపయోగించి హ్యాకర్లు టార్గెటెడ్ కంప్యూటర్‌లో ఆర్బిట్రరీ కోడ్‌ రన్ చేయవచ్చు. ఈ సమస్యలను 'V8లో టైప్ కన్ఫ్యూజన్', 'స్కియాలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో' అని పిలుస్తారు." అని CERT-In సెక్యూరిటీ బులిటెన్‌ తెలిపింది. V8లో టైప్ కన్ఫ్యూజన్ అనేది కంప్యూటర్ ప్రోగ్రామ్‌లో ఒక రకమైన తప్పు. హ్యాకర్లు సెక్యూరిటీని బైపాస్ చేసి ఈ సమస్యతో ప్రోగ్రామ్‌ను తమకు అనుకూలంగా మార్చగలరు. "స్కియాలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో" ఇది కూడా ఒక రకమైన తప్పు. ఈ తప్పు వల్ల హ్యాకర్లు కంప్యూటర్‌లోని సమాచారాన్ని మార్చగలరు లేదా దొంగతనం చేయగలరు. అలానే హ్యాకర్లు యూజర్లను ఒక మాలిషియస్ వెబ్‌సైట్‌కి విజిట్ చేసేలా మోసం చేస్తారు. ఆ వెబ్‌సైట్‌కి వెళ్తే కంప్యూటర్‌లోకి మాల్వేర్ లేదా వైరస్ సోకవచ్చు. విండోస్, మ్యాక్OS, లైనెక్స్ కంప్యూటర్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతుంటే, బ్రౌజర్ వెర్షన్ ఏదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ కింది వెర్షన్లను వాడుతుంటే వెంటనే లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. విండోస్‌లో 128.0.6613.113/.114 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్‌లో 128.0.6613.113/.114 కంటే ముందు వెర్షన్లు, లైనెక్స్‌లో 128.0.6613.113 కంటే ముందు వెర్షన్లపై నడుస్తున్న కంప్యూటర్లకు రిస్కు చాలా ఎక్కువ. వీరు లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓల్డ్ వెర్షన్ అయితే, దాన్ని వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. అందుకు క్రోమ్‌లో ఉన్న త్రీ డాట్ ఐకాన్స్‌పై క్లిక్ చేసి, సెట్టింగ్స్ > అబౌట్ క్రోమ్ ఆప్షన్‌కి వెళ్లాలి. అప్‌డేట్ అందుబాటులో ఉంటే, అక్కడ "అప్‌డేట్ క్రోమ్" ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోవచ్చు. గూగుల్ లేటెస్ట్ వెర్షన్‌లో చాలా సమస్యలను సరి చేసింది. ప్రతి సమస్యను అలా కొత్త అప్‌డేట్స్‌తో ఫిక్స్ చేస్తుంది. అందుకే బ్రౌజర్‌ని ఎప్పటికప్పుడు అప్-టు డేటెడ్‌గా ఉంచుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కమిషనర్ కనకారావు, డీఈ భవాని శంకర్ తీవ్ర వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎన్నికల సమయంలో డీఈ భవానీ శంకర్ సెలవుపై వెళ్లారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. డీఈ భవాని శంకర్ ఉండగా ఈఈ చేత ఫైల్స్‌పై కమిషనర్‌ కనకారావు సంతకాలు చేయించుకుంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుని చివరికి అందరూ చూస్తుండగానే బాహాబాహీకి దిగారు.

కొంత మంది చికెన్‌తో భోజనం చేశాక లాస్ట్‌లో పెరుగుతో ముగించేస్తారు. అయితే ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు. చికెన్‌ని పెరుగుతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయట. అందుకే ఈ రెండింటి కాంబినేషన్‌కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలాగే చాలా మంది పెరుగు వేసి చికెన్‌ వండుతుంటారు. ఇలాంటి అలవాటు ఉంటే కచ్చితంగా మానుకోవాలి అంటున్నారు నిపుణులు. పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ, చికెన్‌తో పాటు పెరుగును కలపడం వల్ల మాత్రం నష్టమే ఎక్కువ ఉందని నిపుణులు అంటున్నారు. చికెన్‌ వల్ల శరీరంపై వేడి ప్రభావం ఉంటే పెరుగు వల్ల చల్లని ప్రభావం ఉంటుంది. ఈ రెండింటి ఎఫెక్ట్ జీర్ణ వ్యవస్థపై పడతాయి. ఈ ప్రభావం చెడుగా ఉంటుంది కాబట్టి వీటిని మిక్స్ చేయడం మంచిదికాదంటున్నారు. చికెన్ తిన్న తర్వాత పాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి భోజనం తర్వాత పాలు తాగి పడుకోవడం కొందరికి అలవాటు. అయితే చికెన్‌ తిన్న రోజు పాలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంపై దద్దుర్లు, తెల్ల మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయి కాబట్టి చికెన్ తిన్న తర్వాత పాలను తాగకుండా ఉండడం మంచిదంటున్నారు. 

బిగ్‌బాస్ షో రియాల్టీ షో మొదట హిందీలో మొదలై తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది. షో మొదట్లో సెలబ్రిటీలను మాత్రమే తీసుకురాగా తర్వాత సామాన్యులను, పెళ్లైనా జంటలను కూడా షోకు తీసుకురావడం మొదలుపెట్టారు. తెలుగులో ద్విగజయంగా ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్, మరో సీజన్‌కు రెడీ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్న భారీ సెట్‌ కూడా పూర్తి కావొచ్చింది. ఈ సీజన్‌లో హోస్ట్‌ను మారుస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ , 8వ సీజన్‌లో కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గత మూడు 'బిగ్ బాస్' సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఫెయిల్ అయ్యాయి. హౌస్‌లోకి వచ్చిన ఆర్టిస్టులు పెద్దగా ఫేమస్ కాకపోవడం, 'బిగ్‌ బాస్' ఆడించే గేమ్స్ ఆసక్తికరంగా లేకపోవడం ఇలా అన్ని కలిసి 'బిగ్‌ బాస్' షో ప్లాప్‌ అయ్యేలా చేశాయి. దీంతో టీఆర్పీ రేటింగ్స్‌ సైతం భారీగా పడిపోవడంతో షో యాజమాన్యం  8వ సీజన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. దీనిలో భాగంగానే పలువురు సెలబ్రిటీలను షోకు తీసుకువచ్చేలా షో యాజమాన్యం ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకూ విడుదలైన ప్రోమోలు షోపై అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి.'బిగ్‌ బాస్' ఏడో సీజన్‌లో కంటెస్ట్‌ల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తలు వహించినట్టు సమాచారం. ఫేమస్ యాకర్ట్స్‌తో పాటు, కపుల్స్‌ను కూడా ఈసారి ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి జరగబోయే సీజన్‌లో టీవీ ఆర్టిస్టులతో పాటు, సినిమా వారిని కూడా అధిక సంఖ్యలో తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఈసారి బిగ్‌బాస్‌కు వచ్చే కంటెస్టెంట్ల లిస్ట్‌ను ఓసారి పరిశీలిస్తే..ఖయూమ్, ఇంద్రనీల్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, యూట్యూబర్ బంచిక్ బబ్లు, ఆదిత్య ఓం, నిఖిల్ మిలిక్కల్, డ్యాన్సర్ నైనిక, రింగ్ రియాజ్, వర్షిణి సుందరరాజన్, రీతూ చౌదరి,విష్ణుప్రియ భీమినేని,శేఖర్ బాషా,మోడల్ రవితేజ, దర్శకుడు పరమేశ్వర్ ,అంజలి పవన్ ,సౌమ్యరావు,అభినవ్ నవీన్,అభిరామ్ వర్మ హీరోయిన్ విస్మయ శ్రీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్లు ఈసారిలో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టనున్నారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన రాజేష్, ఎస్. కొండేపాడు గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని విషయాన్ని పెద్దల దృష్టికి తెచ్చారు. అయితే వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవాలని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి బైక్ పై పాలకొల్లు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ కి దూరంగా పట్టాల వద్ద నిల్చున్న యువతీ యువకుడు రైలు రాగానే పట్టాలపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా రైలు రాగానే  తాను చనిపోయినా తన ప్రియురాలు మాత్రం బతికి ఉండాలని భావించిన రాజేష్ ఆమెను వెనక్కి నెట్టేసి తాను మాత్రం రైలు కింద పడి ప్రాణాలు విడిచాడు. ప్రియుడి మృతదేహం దగ్గర ప్రియురాలు విలపిస్తుండడం గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రేమ విఫలమైన తామిద్దరం ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామని, తన ప్రియుడు తనను పక్కకు నెట్టేసి రైలు కింద పడ్డాడని ఆమె పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కింద పడటంతో గాయాలపాలైన యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆల్కహాల్ తాగితే శరీరం కొద్దికొద్దిగా అనారోగ్యం పాలవుతుంది. కిడ్నీలు, లివర్‌ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఆల్కహాలిక్ పానీయాలలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్ అకస్మాత్తుగా పెరుగుతుంది. అయితే అందరి శరీరంలో ఒకే విధమైన స్పందన ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. ఆల్కహాల్ ప్రతి వ్యక్తి శరీరంలో వివిధ ప్రతిచర్యలను కలిగిస్తుంది. అతిగా తాగడం వల్ల శరీరంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం తగ్గిపోతుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లలో ఈ రిస్క్ చాలా ఎక్కువ. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ పడిపోతుంది. రక్తంలో చక్కెర అకస్మాత్తుగా తగ్గడం వివిధ శారీరక సమస్యలను కలిగిస్తుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా పెరగవచ్చు. అధిక రక్తపోటు సమస్యను కలిగిస్తుంది.

స్మార్ట్‌ ఫోన్‌ పాస్‌వర్డ్‌ ను మర్చిపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యకు గూగుల్‌ సాయం చేస్తుంది. ఆండ్రాయిడ్‌ యూజర్ల కు ఈ అవకాశం ఉంది. ఇందుకు స్మార్ట్‌ ఫోన్‌ లో లాగిన్‌ అయిన గూగుల్‌ అకౌంట్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తెలిసి ఉండాలి. దీంతోపాటు యాక్టివ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ను కలిగి ఉండాలి. ఈ పద్దతి ద్వారా సులభంగా ఫ్యాక్టరీ రీసెట్‌ చేయవచ్చు. ఇతర స్మార్ట్‌ ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ లో వెబ్‌ బ్రౌజర్‌ ఓపెన్‌ చేయాలి. అనంతరం అడ్రస్‌ బార్‌లో Android.com/find అని టైప్‌ చేసి, ఎంటర్‌ చేసి గూగుల్ అకౌంట్‌ లోకి లాగిన్‌ కావాలి. అక్కడ మీరు Reset చేయాలని భావిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ ను ఎంచుకోవాలి. తరువాత 'ఫ్యాక్టరీ రీసెట్ డివైస్‌' ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి, ఆ తర్వాత ఫ్యాక్టరీ రీసెట్‌ ప్రాసెస్‌ ప్రారంభం అవుతుంది.

గూగుల్​ పే ‘యూపీఐ సర్కిల్​’ పేరుతొ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.  ఈ ఫీచర్​ ద్వారా ఒక వ్యక్తికి చెందిన​ ‘యూపీఐ అకౌంట్’​ను ఐదుగురు వ్యక్తులు కలిసి వాడుకోవచ్చు. అవతలి వ్యక్తులకు బ్యాంకు ఖాతా లేకపోయినా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. యూపీఐ సర్కిల్ ఫీచర్ ద్వారా ఒక ప్రైమరీ యూపీఐ యూజర్​, తనకు నమ్మకమైన వ్యక్తులకు (సెకెండరీ యూజర్లకు) పేమెంట్స్​ చేసే హక్కును కల్పించవచ్చు. అయితే ఈక్రమంలో వారు చేసే ఆర్థిక లావాదేవీలను కంట్రోల్ చేయొచ్చు. ప్రైమరీ యూజర్ ఎంత వరకైతే అమౌంటును నిర్దేశిస్తాడో అంత వరకు మాత్రమే సెకెండరీ యూజర్లు గూగుల్ పే యూపీఐ సర్కిల్ ద్వారా పేమెంట్ చేయగలుగుతారు. అయితే ఈ లావాదేవీలు చేసిన ప్రతిసారీ ప్రైమరీ యూజర్​ అనుమతి పొందాల్సిన అవసరం ఉండదు. దీన్నే టెక్నికల్ భాషలో 'ఫుల్ డెలిగేషన్' అంటారు. ఇందులో మరో ఆప్షన్ కూడా ఉంది. గూగుల్ పే యూపీఐ సర్కిల్‌లోని ప్రైమరీ యూజర్ ప్రతీ లావాదేవీకి తన అనుమతి పొందేలా చేయొచ్చు. దీన్ని టెక్నికల్ భాషలో 'పార్శియల్​ డెలిగేషన్' అని పిలుస్తారు. ఈ ఆప్షన్‌ను ప్రైమరీ యూజర్ ఎంచుకుంటే అతడి సర్కిల్‌లో ఉన్నవాళ్లు ప్రతి లావాదేవీకి ప్రైమరీ యూజర్​ అథంటికేషన్ పొందాల్సి ఉంటుంది. అంటే ప్రైమరీ యూజర్ -​ యూపీఐ పిన్​ను ఎంటర్​ చేస్తేనే సెకెండరీ యూజర్లు చేసిన లావాదేవీలు ఎగ్జిక్యూట్ అవుతాయి. కాగా, యూపీఐ సర్కిల్ సేవలను అందించేందుకు ‘ఎన్‌పీసీఐ’తో గూగుల్‌ పే జట్టు కట్టింది.

బ్రెజిల్‌లో ఎక్స్ (ట్విట్టర్) సేవలను పూర్తి స్థాయిలో ఆపేయాలంటూ బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలెగ్జాండర్ డి మోరేస్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. బ్రెజిల్ ప్రభుత్వానికి రూ.27.66 కోట్ల జరిమానాలను చెల్లించడంతో పాటు దేశంలో ఒక న్యాయ ప్రతినిధిని నియమించే వరకు ఎక్స్‌పై బ్యాన్ కొనసాగుతుందని న్యాయమూర్తి మోరేస్ స్పష్టం చేశారు. ఈమేరకు దేశ టెలికాం నియంత్రణ సంస్థ అనాటెల్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు అందిన 24 గంటల్లోగా అవి తప్పకుండా అమలు చేయాలని నిర్దేశించారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తులు లేదా కంపెనీలు ఈ నిషేధాన్ని ధిక్కరించి వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ (వీపీఎన్) ద్వారా ఎక్స్‌ను యాక్సెస్ చేసేందుకు యత్నిస్తే రూ.7.47 లక్షల జరిమానా విధించాలని అనాటెల్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మోరేస్ సూచించారు. తప్పుడు వార్తలను వ్యాపింపజేసేందుకు కొన్ని డిజిటల్ ముఠాలు కుట్ర చేస్తున్నాయని, అలాంటి అకౌంట్లను గుర్తించి బ్లాక్ చేయాలని ఈ ఏడాది ప్రారంభంలో ఎక్స్‌ను బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మోరేస్ ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను అప్పట్లో ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ వ్యతిరేకించారు. ఎక్స్ సోషల్ మీడియా కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌ను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక తాము బ్రెజిల్‌లో ఆఫీసును మూసేస్తామని ప్రకటించారు.ఆఫీసును మూసేసినా బ్రెజిల్‌లోని తమ సోషల్ మీడియా యూజర్ల అకౌంట్లు యాక్టివ్‌గానే ఉంటాయని తెలిపారు.

ద్రాక్ష పండ్లతో రకరకాల వంటకాలు, పానీయాలు తయారు చేసుకోవచ్చు. ఇందులో బోలెడు విటమిన్‌లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ద్రాక్షలోని రెస్వెరాట్రాల్ గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. అంతేకాకుండా విటమిన్ సి వంటి విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ద్రాక్షలోని ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. ముడతలు పడకుండా సహాయపడుతుంది. విటమిన్ ఎ కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ద్రాక్షలోని ఫైబర్ ఎక్కువ సేపు పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ద్రాక్షను శుభ్రమైన నీటితో బాగా కడగండి. కాడలను తీసివేయండి. శుభ్రం చేసిన ద్రాక్షను బ్లెండర్‌ జార్‌లో వేయండి. ద్రాక్షకు తగినంత నీరు కలపండి. జ్యూస్ ఎంత పలుచగా కావాలో అనుకుంటున్నారో అంత నీరు కలపండి. బ్లెండర్‌ను ఆన్ చేసి ద్రాక్షను బాగా మిక్సీ చేయండి. మిక్సీ చేసిన ద్రావణాన్ని జల్లెడ ద్వారా జల్లించండి. రుచికి తగినంత చక్కెర, నిమ్మరసం కలపండి. సర్వ్ చేసే ముందు ఫ్రిజ్‌లో చల్లార్చితే మరింత రుచిగా ఉంటుంది. ద్రాక్ష విత్తనాలు జీర్ణం కావడానికి కష్టంగా ఉంటాయి. కాబట్టి, జల్లెడ ద్వారా జల్లించేటప్పుడు విత్తనాలు మిగిలిపోయేలా చూసుకోండి. జ్యూస్‌లో ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది. పుదీనా ఆకులను కలిపితే జ్యూస్‌కు మంచి కలుగుతుంది. ఎర్ర ద్రాక్ష, ఆకుపచ్చ ద్రాక్ష లేదా నలుపు ద్రాక్ష ఏ రకమైన ద్రాక్షను వాడినా రుచికరమైన జ్యూస్ తయారు చేయవచ్చు. ద్రాక్ష పండ్ల జ్యూస్ చాలా రుచికరమైనది, ఆరోగ్యకరమైనది. 

డయాబెటిస్ ఉన్నవారు ద్రాక్ష జ్యూస్ లో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు దీన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. మూత్రపిండాలు సరిగా పని చేయని వారికి ద్రాక్ష జ్యూస్ లో ఉండే పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. కొంతమంది వ్యక్తులకు ద్రాక్షకు అలర్జీ ఉంటుంది. వారు ద్రాక్ష జ్యూస్ తాగడం వల్ల అలర్జీ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. ద్రాక్ష జ్యూస్ లో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎసిడిటీ సమస్య ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది. ద్రాక్ష జ్యూస్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శరీర బరువు పెరగడానికి భయపడేవారు దీన్ని తక్కువ మొత్తంలో తాగాలి.

జమ్మూకాశ్మీర్ లో వచ్చే నెలలోఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై మండిపడ్డారు. ఆ పార్టీ తీసుకునే విధానాలపైన ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 'అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే నేషనల్ కాన్ఫరెన్స్ కి ఎన్నికలు హలాల్ అవుతాయి. అధికారం కోల్పోతే హరామ్ అవుతాయి. 1987లో జమాతే - ఇ - ఇస్లామీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్సిపి ఎలాంటి పోటీని ఎదుర్కోలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ని తన సామ్రాజ్యంగా పరిగణించడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. 1987లో నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడింది. ఒకవేళ జమాత్ -ఇ-ఇస్లామీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం మంచి విషయం. అయితే ప్రభుత్వం దానిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి. వారు స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని తిరిగి ఇవ్వాలి. ఇది ప్రజాస్వామ్యం కోసం పోరాటం అని' ఆమె అన్నారు.

గుజరాత్ లో భారీ వర్షాలకు, వరదలకు కారణమైన అల్పపీడనం 'అసాని' తుఫానుగా రూపాంతరం చెందినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) శుక్రవారం తెలిపింది. ఈ తుఫాను  గుజరాత్ లోని కచ్ తీరంతో పాటు పాకిస్థాన్ పరిసర ప్రాంతాలపై విరుచుకుపడనున్నట్లు హెచ్చరించింది. గంటకు 63కి.మీ నుండి 87 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం గత 6 గంటల్లో 6 కి.మీ వేగంతో పశ్చిమం వైపు కదిలి అసాని తుఫానుగా మారింది. భుజ్కి పశ్చిమ వాయువ్యంలో 190 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. 1976 తర్వాత అరేబియా సముద్రంలో ఏర్పడిన మొదటి తుఫాను ఇది. ఈ తుఫానుకు పాకిస్థాన్ అసానిగా నామకరణం చేసింది. 1891 నుండి 2023 మధ్య అరేబియా సముద్రంలో కేవలం మూడు తుఫానులు మాత్రమే ఏర్పడ్డాయని, అది కూడా 1976, 1964,1944 ఆగస్టులో నని ఐఎండి పేర్కొంది.

సింగరేణి కాలరీస్‌ సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్‌ మజ్దూర్‌లుగా క్రమబద్ధీకరిస్తున్నట్టు సంస్థ ఎండీ ఎన్‌.బలరామ్‌ తెలిపారు. సంస్థలో చేరినప్పటి నుంచి ఏడాదిలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు ఒకటి నుంచి వీరిని జనరల్ మజ్దూర్‌లుగా గుర్తించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఏడాదిలో నిర్ణీత మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తుండటం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా సంస్థలో చేరిన వారిని తొలుత బదిలీ వర్కర్లుగా సంస్థ నియమిస్తోంది. ఏడాది కాలం పనిచేసిన తర్వాత కనీస మస్టర్లు పూర్తి చేస్తే జనరల్ మజ్దూర్లు (శాశ్వత ఉద్యోగులు)గా గుర్తిస్తోంది. ఉన్నత విద్యార్హతలు కలిగిన వీరంతా కంపెనీలో ఇంటర్నల్ ఉద్యోగాల ద్వారా పదోన్నతులు పొందడానికి అర్హత లభిస్తుంది. అలాగే క్వార్టర్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. క్రమశిక్షణతో పనిచేయాలని సీఎండీ ఎన్.బలరామ్ కోరారు. సింగరేణిలో ఒకేసారి 2,364 మందిని జనరల్ మజ్దూర్లుగా ఉద్యోగ ఉన్నతి కల్పిస్తున్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్‌ కళాశాల ఘటన వివాదం సద్దుమణిగింది. సీఎం ఆదేశాలతో పోలీసులు గుడ్లవల్లేరు ఘటనపై విచారణ వేగవంతం చేశారు. విద్యార్థినులు, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రుల సమక్షంలో దాదాపు 4గంటలకుపైగా హాస్టల్‌ మొత్తం తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్‌ డివైస్‌ను గుర్తించే పరికరంతో హాస్టల్‌లో అణువణువూ తనిఖీ చేశారు. ఎలాంటి హిడెన్‌ కెమెరా లభించలేదు. తమ సమక్షంలోనే జరిగిన తనిఖీల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థినులు ఆందోళన విరమించారు. సోమవారం వరకు సెలవులు ప్రకటించి మరోమారు తనిఖీలు చేపడతామని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ లోగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులకు మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆందోళన చేసిన విద్యార్థినులపై ఎలాంటి చర్యలు, కక్షసాధింపు ఉండరాదని కళాశాల యాజమాన్యానికి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఆందోళన చేసిన విద్యార్థినుల పట్ల వేధింపులు ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి, హాస్టల్‌లో ఉండేందుకు విద్యార్థినులు అంగీకరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు. ''మా ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసినట్టు ఎమ్మెల్యే రవికుమార్ గౌడ నాతో చెప్పారు. బీజేపీ కేవలం 'ఆపరేషన్ లోటస్'తోనే కర్ణాటకలో అధికారంలోకి వస్తుంటుంది. ప్రజల ఆశీస్సులతో ఎన్నడూ ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. 2008, 2019లో ఆపరేషన్ లోటస్‌తో దొడ్డిదారిలో వాళ్లు అధికారంలోకి వచ్చారు'' అని సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 136 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తమ ప్రభుత్వాన్ని కూల్చడం అంత సులభం కాదని అన్నారు. సుమారు 60 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని, అయితే, మా ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా డబ్బులకు ఆశపడరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నటుడు దర్శన్‌కు జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వడం సంచలనం కావడంపై సీఎం మాట్లాడుతూ, ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది సిబ్బందిని సస్పెండ్ చేశామని, బళ్లారి జైలుకు దర్శన్‍ను తరలించామి చెప్పారు. డీజీపీకి నోటీసు కూడా ఇచ్చామన్నారు. కాగా, మహదయి ప్రాజెక్టు పనుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తమకు పర్యావరణ అనుమతి ఇస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని సిద్ధరామయ్య తెలిపారు.

నటి కాదంబరీ జెత్వానీ ఇవాళ విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబును కలిశారు. అంతకు ముందు ఉదయం ఏపీ పోలీసు ఎస్కార్ట్ సాయంతో నగరానికి చేరుకున్న ఆమె స్థానిక నోవాటెల్ హోటల్లో బస చేశారు. అక్కడ ఆమెను కలిసిన పోలీసులు వేధింపుల ఆరోపణలపై వివరాలు సేకరించారు. ఆమెకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆమె సాయంత్రం సీపీని కలిశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన తప్పుడు కేసు, అంతకు ముందు ఆమె పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్ పై ముంబైలో పెట్టిన కేసు, ఇతర వివరాలను పోలీసులు ఇవాళ కాదంబరీ జెత్వానీ నుంచి తీసుకున్నారు. సజ్జన్ జిందాల్ పై కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఆమెపై జరిగిన వేధింపులు, ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీం పట్నం పోలీసులు తనపై నమోదు చేసిన ఫోర్జరీ కేసు, దీనిపై ఐపీఎస్ లు ముంబై వచ్చి మరీ తనను, కుటుంబ సభ్యుల్ని అరెస్టు చేయడం, కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపడం వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. మరోవైపు ఇబ్రహీంపట్నం పీఎస్ లో కుక్కల విద్యాసాగర్ ఆస్తిని బెదిరించి రాయించుకుందంటూ కాదంబరిపై నమోదైన కేసులో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులు పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఆదేశాలతోనే తాము అప్పట్లో ముంబైకి వెళ్లి ఆమెను కుటుంబంతో తీసుకురావడం, వేధింపులకు గురి చేసినట్లు విచారణలో పోలీసు సిబ్బంది చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మరో ఇద్దరు ఐపీఎస్ లు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ ఎవరి ఆదేశాలతో కదిలారన్న దానిపైనా ఆరా తీస్తున్నారు. ఇవాళ, రేపు కాదంబరి నగరంలోనే పోలీసు భద్రత మధ్య ఉండే అవకాశముంది. 

కోల్‌కత్తా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి మరో లేఖ రాశారు. హత్యాచార ఘటనలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినచట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నిర్దిష్ట కాలపరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా ఆ చట్టం ఉండాలని లేఖలో అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 90 అత్యాచార ఘటనలు జరుగుతుండటం భయానక పరిస్థితిని సూచిస్తోందన్నారు మమత. ఇలాంటి చర్యలు సమాజం, దేశం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. సత్వర న్యాయం జరగాలంటే ఈ కేసుల విచారణ 15 రోజుల్లో పూర్తి చేయాలి అని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 'స్పీడ్' ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి సీఎస్‌ శాంతి కుమారి, మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రమేశ్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని, ఎకో, టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. హెల్త్‌ టూరిజంను అభివృద్ధి చేయాలన్న రేవంత్‌ రెడ్డి, హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై వివరాలు సమర్పించాలన్నారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులను అర్ధాంతరంగా ఆపవద్దని స్పష్టం చేశారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.

భారత్ మరో కోవిడ్ వ్యాప్తికి సిద్ధంగా ఉండాలని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) నిపుణుడు శుక్రవారం హెచ్చరించారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వచ్చాయి. సీడీసీ అంచనాల ప్రకారం యూఎస్‌లో 25 రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలో కూడా గణనీయంగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజా గణాంకాల ప్రకారం జూన్ 24 మరియు జూలై 21 మధ్య 85 దేశాల్లో ప్రతీ వారం సగటున 17,358 కోవిడ్ నమూనాలను పరీక్షించారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం భారత్‌లో కూడా 908 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్-జూలై మధ్య రెండు మరణాలు సంభవించాయి. ఇతర దేశాల మారిగానే భారత్‌లో పరిస్థితి తీవ్రంగా లేనప్పటికీ మనం దీనికి సిద్ధంగా ఉండాలని నోయిడాలోని శివ్ నాడార్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ దీపప్ సెహగల్ చెప్పారు. వైరస్ ఖచ్చితంగా తిరిగి పుంజుకుందని, ఈ వైరస్ సంభవించిన వారిలో 26 శాతం మరణాలు, 11 శాతం పెరుగుదల ఉందని డబ్ల్యూహెచ్ఓ నివేదించింది. ఇది ఆందోళనకరమైన విషయమని అన్నారు. ఇటీవల వ్యాప్తిలో KP వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఓమిక్రాన్ వంశానికి చెందినది. ఓమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణంతో పాటు రోగనిరోధక శక్తిని తప్పించుకునే లక్షణం ఉంది. జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ జేఎన్.1 నుంచి KP.2 వేరియంట్ పుట్టుకొచ్చినట్లు గుర్తించారు. భారతదేశంలో కేపీ.2 మొదటిసారిగా డిసెంబర్ 2023 ఒడిశాలో కనుగొన్నారు. కేపీ.2 జాతి ఓమిక్రాన్ వేరియంట్ నుంచి స్పైక్ రీజియన్‌లో మూడు మ్యూటేషన్లను కలిగి ఉంది. INSACOG (ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం) నుండి వచ్చిన డేటా, ఈ వేరియంట్ ఇప్పటికే భారతదేశంలో ఉందని చూపింది. KP.x — ఇందులో KP.3.1.1 మరియు FLiRT వేరియంట్ లేదా KP.2 వంటి దానికి సంబంధించి జాతులు ఉన్నాయి. జూలై చివరి వారంలో సేకరించిన భారతదేశంలోని మొత్తం కోవిడ్ సీక్వెన్స్ శాంపిల్స్‌లో దాదాపు 39 శాతం ఉన్నాయి. ఇదిలా ఉంటే, కేంద్ర ఆరోగ్య శాఖ కోవిడ్ డాష్ బోర్డులో భారత్ లోని అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల పెరుగుదలను చూపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 279 యాక్టివ్ కేసులు8 ఉన్నాయి. JN.1 ఓమిక్రాన్ నుంచి ఉద్భవించిన KP.1 మరియు KP.2 జాతులు భారతదేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణమవుతాయి. 

ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) స్పెషల్ సీఎస్‌గా రజత్ భార్గవ నియామకమయ్యారు. దాదాపు రెండు నెలల నుంచి రజత్ భార్గవకు పోస్టింగ్ దక్కకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా రజత్ భార్గవ నేడు రిటైర్‌ కానున్నారు. ఎలాంటి పోస్టింగ్ లేకుండా రిటైరయ్యేలా చేయడం సరి కాదని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. గతంలో పూనం మాల కొండయ్యకు ఇదే తరహాలో సర్వీస్ చివరి రోజున ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అదే తరహాలో రజత్ భార్గవకు పోస్టింగ్ ఇవ్వడం విశేషం.

భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు మరో జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ నెల 23తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 681.69 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. ఈ నెల 16తో ముగిసిన వారానికి 4.54 బిలియన్ డాలర్లు వృద్ధితో 674.66 బిలియన్ డాలర్లకు చేరిన ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు ఈ నెల 23తో ముగిసిన వారానికి మరో 7.02 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్ మీద రూపాయి మారకం విలువ పతనం కాకుండా ఆర్బీఐ జోక్యం చేసుకుంటున్నది. ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) 5.98 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 597.55 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం రిజర్వు నిల్వలు 893 మిలియన్ డాలర్లు పెరిగి 60.9 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. ఎస్డీఆర్‌లు 118 మిలియన్ డాలర్లు పుంజుకుని 18.45 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్ లో భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు మూడు మిలియన్ డాలర్లు పెరిగి 4.68 బిలియన్ డాలర్ల వద్ద ముగిశాయి. ఆగస్టు రెండో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 675 బిలియన్ డాలర్లతో ఆల్ టైం గరిష్టానికి చేరినా, ఆగస్టు తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి 4.8 బిలియన్ డాలర్లు పతనం అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి ఎకో పార్కులో జరిగిన వన మహోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ కోటి చెట్లు పెట్టాలని సంకల్పించాం. కోటి చెట్లు పెడితే 0.33 శాతం మేర గ్రీన్ కవర్ పెరుగుతుంది. చెట్లు నాటే కార్యక్రమాన్ని మహోద్యమంగా చేపట్టాలి. స్కూళ్లల్లో చెట్లకు నీళ్లు పోయడమనేది అలవాటు చేసేవారు. పచ్చదనం పెరిగితే స్వర్ణాంధ్ర ప్రదేశ్ కావడం ఖాయం. భూమినే జలాశయంగా మార్చేలా ఇంకుడు గుంతల ద్వారా ప్రణాళికలు రచించాం. అడవుల్లో చెక్ డ్యాములు నిర్మించి భూగర్భ జలాలు పెంచేలా చేసేవాళ్లం. గత ప్రభుత్వం చెక్ డ్యాముల్లో మట్టిని కూడా తీయలేదు. ఇప్పుడు పవన్ వచ్చారు. అన్నీ చేస్తారు అని అన్నారు. అటవీ శాఖ, పీఆర్ శాఖలు పవన్ వద్దే ఉన్నాయి. రాజధాని నడిబొడ్డున ఎకో పార్కు ఉండడం సంతోషంగా ఉంది. ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోవాలని ఉంది. 2014లో మిషన్ హరితాంధ్ర ప్రదేశ్ కు శ్రీకారం చుట్టాం. 50 శాతం గ్రీన్ కవర్ ఏర్పడాలి. సీడ్ బాల్స్ ద్వారా చెట్ల పెంపకం చేపట్టాలి. 175 నియోజకవర్గాల్లో నగర వనాల ఏర్పాటుచేస్తాం. ప్రతి నియోజకవర్గంలో రెండున్నర ఎకరాల్లో నగర వనాలను ఏర్పాటు చేస్తాం. జపనీస్ టెక్నాలజీతో మియాబాకి కార్యక్రమం చేపడతాం అని చంద్రబాబు పేర్కొన్నారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గవర్నర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో అందుకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఢిల్లీ పెద్దలను కూడా కలిసి తనను గవర్నర్ గా పంపించాలని కోరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒంటరిగా వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కలవడం జరిగిందట. దీని వెనుక ఉద్దేశం కూడా ఇదే అన్నట్లుగా వార్తలు  వినిపిస్తున్నాయి. వీటితో పాటుగా బిజెపి పెద్దలను కూడా కలిసి తన మనసులో మాట చెప్పినట్లుగా ప్రచారం జరుగుతున్నది. విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మంచి సన్నిహితుడని కూడా చెప్పవచ్చు. అందుకే ఆయనకు రెండుసార్లు రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు. 2024 ఎన్నికలలో విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంటుకు నిలబడి ఓడిపోయారు. ఒకానొక దశలో వైసీపీ పార్టీ నెంబర్ -2 గా పేరు పొందారు విజయసాయిరెడ్డి. మొదట వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా ఈయనకే అప్పగించారు. ఆ తర్వాత ఇతరత్రా బాధ్యతలను కూడా అప్పగించారు ఇంత ప్రియారిటి ఇచ్చిన విజయసాయిరెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ కు దూరమయ్యారని సమాచారం. జగన్ ను కూడా ఈయన కలవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అన్ని ఆర్థిక లావాదేవీలను అన్నీ కూడా విజయ్ సాయి రెడ్డిని చూసుకునేవారు. ఇటీవలే 2024 ఎన్నికలలో ఓడిపోవడంతో కాస్త నిరాశతో ఉన్నట్లుగా సమాచారం. విజయ సాయి రెడ్డికి ఢిల్లీలో అన్ని పార్టీలతో కూడా మంచి స్నేహబంధాలు ఉన్నాయి. అలాగే అమిత్ షాతో భేటీ అవ్వడం వెనుక కారణాలు ఏంటనే విషయం మాత్రం తెలుపలేదు. అలాగే మరొకవైపు వక్స్ బోర్డు స్థాయి సంఘంలో కూడా మెంబర్ గా ఉండాలని అమిత్ షా విజయసాయి రెడ్డికి ఆఫర్ చేసినట్లుగా సమాచారం. 

వైసీపీ ఎన్నికల్లో మరీ అంత దారుణంగా ఓడిపోవాల్సింది కాదని మాజీ మంత్రి రోజా అన్నారు . అంత ఘోరమైన తప్పులు తామేమీ చేయలేదన్నారు. ఘోర ఓటమికి  ప్రజలు కూడా కారణం కాదన్నారు. అసలు కారణాలు, నిజ నిజాలు నిలకడమీద తెలుస్తాయని అన్నారు. ప్రజలకు కూడా నిజాలు తెలిసొస్తాయన్నారు. ఇటీవల కొంతకాలం మీడియాకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న రోజా, మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నట్టు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో బలిజ భవన్ ని ప్రారంభించిన ఆమె, పార్టీ నేతలు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఓడిపోయినా తాము ప్రజలకు అందుబాటులో ఉంటామని, ప్రజలకు అండగా నిలబడతామన్నారు. ఓడిపోయినంత మాత్రాన తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. ఎన్నికలు ఒక సునామీలాగా జరిగాయన్నారు రోజా. ప్రజలు తమను ఓడించలేదని చెప్పుకొచ్చారు. అందరూ తనవాళ్లే అనుకున్నాను కాబట్టే, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారామె. ప్రభుత్వం కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, కానీ ఓటమి తప్పలేదన్నారు. ఈ ఓటమికి అసలు కారణాలు నిదానంగా తెలుస్తాయన్నారు. 

సెప్టెంబర్‌ 1న గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో పాటు ఇంధన ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట!. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటి అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.50,వాణిజ్య సిలిండర్ల ధర రూ.60 నుంచి రూ.70 వరకు తగ్గుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఆగస్టులో బిజినెస్-గ్రేడ్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ.8.50 పెరిగింది, జూలైలో రూ.30 తగ్గింది. ఇక గతేడాది రాఖీ, ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్‌ ఎల్‌పీజీ సిలిండర్ ధరను 300 రూపాయలు తగ్గించింది. ఇప్పుడు దాని ధర మరో రూ.50 తగ్గితే, రూ.760 రూపాయలకే అందుబాటులో ఉంటుంది. రాయితీని సద్వినియోగం చేసుకుంటే రూ.460కే సిలిండర్‌ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. పీఎం ఉజ్వల యోజన ఇప్పటికే ఎల్‌పీజీ సిలిండర్‌లపై రూ.300 రాయితీ అందిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం గ్యాస్‌ సిలిండర్‌ రేట్లతో పాటుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా తగ్గించనున్నట్లు సమాచారం. పెట్రోల్‌ లీటర్‌పై రూ.6, డీజిల్‌ లీటర్‌పై రూ.5 వరకు తగ్గనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌ X (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. దేశంలోని అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి సౌకర్యాలలో కమ్యూనికేషన్, కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేగవంతమైన డేటా బదిలీని సులభతరం చేస్తుంది. రియల్ టైమ్ కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది మరియు అధునాతన పారిశ్రామిక అనువర్తనాలకు మద్దతు ఇస్తుంది. తద్వారా ప్లాంట్‌లో ఉత్పాదకత మరియు భద్రతను పెంచుతుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టెలికాం పరిశోధనా సంస్థ C-DoT మరియు తేజాస్ నెట్‌వర్క్‌లతో సహా టెక్నాలజీ ని స్వదేశీంగా అభివృద్ధి చేసిన కన్సార్టియం కింద పరికరాల స్టాక్ తయారు చేయబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ఆగస్టు 15 నుండి 4G సేవలను ప్రారంభించనుందని ఇదివరకు నివేదికలు వచ్చినప్పటికి అవి, పరీక్ష దశవరకు మాత్రమే జరిగాయి. నివేదిక ప్రకారం, సెప్టెంబర్ చివరి నాటికి బీఎస్ఎన్ఎల్ 4G సేవలు యాంటెనాలు, బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్లు వలె రాష్ట్రవ్యాప్తంగా ఆక్టివేట్ చేయబడతాయి. మరియు కోర్ నెట్‌వర్క్ పనులు ప్రస్తుతం వివిధ దశల్లో పూర్తయ్యాయి. విశాఖపట్నం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలతో సహా, ఈ సంవత్సరం చివరి నాటికి దాదాపు 1000 4G మొబైల్ టవర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో 420 బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్లు ఉన్నాయని, వీలైనంత త్వరగా 4జి సేవలను అందించేందుకు మరో 680 మొబైల్ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ 420 మొబైల్ టవర్లు కూడా 4జీకి అప్‌గ్రేడ్ చేయబడతాయి. 

దేశీయ మార్కెట్లోకి  రియల్ మీ 13 5జీ, రియల్ మీ 13+ 5జీ పేరిట రెండు ఫోన్లను విడుదల చేసింది. ఆకర్షణీయమైన స్టైలిష్ డిజైన్ తో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ తో వీటిని ఆవిష్కరించి ఆకట్టుకుంది. రియల్ మీ 13 5 జీ స్మార్ట్ ఫోన్ డిస్​ ప్లే 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ + ఎల్సీడీతో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేటు, 240Hz టచ్ సాంప్లింగ్ రేటు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 580 నిట్స్ బ్రైట్ నెస్ ను అందిస్తోంది. 6 ఎమ్ఎమ్ ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్​తో నడుస్తుంది. 5,000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ దీని సామర్థ్యం. ఈ స్మార్ట్ ఫోన్​లో 50 మెగా పిక్సల్​ డ్యుయెల్ రియర్ కెమెరా, శాంసంగ్ S5KJNS మెయిన్ సెన్సర్ తో వస్తోంది. 16 మెగా పిక్సల్​ సెల్ఫీ కెమెరాను కూడా అమర్చారు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో యూజర్స్​కు అందుబాటులో ఉంచారు. 8జీబీ + 128జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. దీని ధర రూ.17,999గా కంపెనీ ప్రకటించింది. 8జీబీ + 256 జీబీ వేరియంట్ ధరను రూ.19,999గా తెలిపింది. డార్క్ పర్పల్, స్పీడ్ గ్రాన్ రంగుల్లోనూ కూడా ఇది మార్కెట్​లో లభిస్తోంది. రియల్ మీ 13 5 జీలో ఉన్న బ్యాటరీ, కెమెరా ఫీచర్లే రియల్ మీ 13 + 5జీ స్మార్ట్ ఫోన్లోనూ ఉండటం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ + ఓఎల్ఈడీ డిస్ ప్లేను వస్తోంది. 120 Hz రిఫ్రెష్ రేటు, 2,000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంది. 4 ఎమ్ఎమ్ ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్​తో నడుస్తోంది. తడి చేత్తోనూ ఫోన్​ను వాడేందుకు వీలుగా అనుకూలంగా రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ తో ఇది నడుస్తుంది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందిస్తున్నారు. 8జీబీ + 128జీబీ స్టోరేజ్ కెపాసిటీని సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.22,999గా కంపెనీ ప్రకటించింది. 8జీబీ + 256జీబీ వేరియంట్ ధరను రూ.24,999గా, 12జీబీ + 256జీబీ వేరియంట్ ధరను రూ.26,999గా సదరు కంపెనీ తెలిపింది. స్పీడ్ గ్రాన్, డార్క్ పర్పల్, విక్టరీ గోల్డ్ కలర్స్​లో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ఈ రెండు కొత్త ఫోన్లు ప్రీ బుకింగ్ ఆర్డర్లు ఇప్పటికే మొదలైపోయ్యాయి. యూజర్స్ బుక్ చేసుకోవడం ప్రారంభించేశారు. ముందుగా బుక్ చేసుకోవాలనుకునే వారు రియల్మీ ఇండియా వెబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ స్టోర్లలో బుక్ చేసుకునే వీలును కల్పించింది. ప్రీ బుకింగ్ ఆర్డర్లకు ఆరు నెలల పాటు ఉచితంగా స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది. రూ.1,500 వరకు క్యాష్ బ్యాక్ కూడా పొందేలా వెసులుబాటును కల్పిస్తోంది.

ఇండోనేసియా రాజధాని జకర్తాకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని ఓ వ్యక్తి పాములతో రకరకాల స్నాక్స్ తయారు చేస్తున్నాడు. ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర నాగుపాము పకోడీలను తయారు చూస్తున్నాడు. ఆ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. Akash Chaudhary అనే కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఆకాష్ చౌదరి కోబ్రా పకోడీలను తినడానికి ప్రజలు ఎంత ఉత్సాహంతో అక్కడికి వస్తున్నారో చూపించాడు. అంతేకాదు ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర జనాలు నాగుపాము రక్తాన్ని కూడా తాగుతున్నారట!. అది తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా, చర్మానికి మంచి మెరుపు కూడా వస్తుందట. ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర ఒక పెద్ద బోను ఉంది. ఆ బోనులో బతికి ఉన్న నాగు పాములు ఉన్నాయి. ఒక్కో నాగు పాము ధర రూ. 2 లక్షల ఇండోనేషియా రూపాయిలు అట. అంటే భారతీయ కరెన్సీలో వెయ్యి రూపాయలు. ఎవరైనా ఆర్డర్ చేసే ఆ బోనులో నుంచి పాములను తీసి స్నాక్స్ తయారు చేస్తున్నారు. 

ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బ్రేన్​ అనే ఐటీ కంపెనీ దాదాపు 1,500 మంది ఉద్యోగులను తొలగించింది. బిజినెస్​ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెయిల్స్​పంపించింది. మూడు నెలల జీతం ఇవ్వకుండానే లేఆఫ్స్​ప్రకటించింది. మాదాపూర్ మైండ్​స్పేస్​బిల్డింగ్​నం.3ఏలోని మూడు, నాలుగు ఫ్లోర్లలో బ్రేన్ ఎంటర్​ప్రైజెస్​ప్రైవేట్ లిమిటెడ్​పేరుతో ఐటీ కంపెనీ నడుస్తోంది. ఈ కంపెనీకి బెంగళూరు, సింగపూర్​లో బ్రాంచ్ లున్నాయి. హైదరాబాద్​ బ్రాంచ్​లో దాదాపు 3వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలోని 1,500 మందిని తాజాగా తొలగించింది. ఉన్నపళంగా తొలగించడంపై బాధితులు మండిపడుతున్నారు. బ్రేన్​కంపెనీ మూడు నెలలుగా జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. మార్చి నెలలో ఒకటో తేదీన పడాల్సిన జీతాలను 18న చెల్లించారని తెలిపారు. కొందరికి ఏప్రిల్​నెల మధ్యలో వేశారని చెబుతున్నారు. కొందరికి ఏప్రిల్, మే నెల చివరి రోజుల్లో జీతంలో పది శాతం మాత్రమే చెల్లించారన్నారు. మే నెల నుంచి జీతాలు ఇవ్వకుండా తేదీలు మార్చుతూ వస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తాజాగా హెచ్ఆర్​ను సంప్రదిస్తే ఈ రోజు రేపు అంటూ మెయిల్స్​ పంపించారని, చివరికి ఉద్యోగాల నుంచే తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 13న బిజినెస్​కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని లీడర్​షిప్​ ఆపరేషన్స్​పేరిట మెయిల్స్​వచ్చాయని తెలిపారు. సెప్టెంబర్​2 వరకు నోటీస్​ పీరియడ్​గా పేర్కొన్నారని చెప్పారు. సెప్టెంబర్ 2లోపు జీతాలు చెల్లిస్తామని హామీ ఇస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్స్​వచ్చాయంటున్నారు. దీనిపై బాధితులు రంగారెడ్డి జిల్లా జాయింట్​లేబర్ కమిషనర్​ను కలిసి కంపెనీపై ఫిర్యాదు చేశారు. 

ఉక్రెయిన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్నిరష్యా కూల్చివేసింది. సోమవారం రెండు దేశాల మధ్య భీకర దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో రష్యాకు చెందిన పాట్రియాట్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ వ్యవస్థ ఆ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని నాటో దళాలు.. ఉక్రెయిన్‌కు ఇటీవలే అందజేశాయి. వాస్తవానికి ఆ యుద్ధ విమానం అమెరికా తయారు చేస్తున్నది. సోమవారం రష్యా వందల సంఖ్యలో మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది. ఆ సమయంలో ఎఫ్‌-16 యుద్ధ విమానం నేల కూలినట్లు ఉక్రెయిన్ ఎంపీ మారియానా బెజుగయా తెలిపారు. శతృవులు చేసిన మిస్సైల్ దాడిలో ఎఫ్‌-16 యుద్ధ విమానం కూలినట్లు ఉక్రెయిన్ మొదట అంగీకరించ లేదు. కానీ ఆ యుద్ధ విమాన పైలెట్.. నేల కూలడానికి ముందు మూడు రష్యన్ క్రూయిజ్ మిస్సైళ్లను, ఓ డ్రోన్‌ను కూల్చివేసినట్లు తెలుస్తోంది. భీకరమైన రష్యా మిస్సైళ్ల దాడి నుంచి ఉక్రెయిన్లను పైలెట్ ఒలెసీ కాపాడినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మంగళవారం ఈ ఘటన పట్ల ప్రకటన చేశారు. రష్యా డ్రోన్లు, మిస్సైళ్లను కౌంటర్ చేసేందుకు అమెరికాలో తయారైన ఎఫ్‌-16 విమానాలు వాడినట్లు జెలెన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌కు సుమారు 65 ఎఫ్‌-16 యుద్ధ విమానాలను ఇవ్వాలని నాటో దళాలు గత ఏడాది నిర్ణయం తీసుకున్నాయి. ఎఫ్‌-16లతో పాటు పాట్రియాట్‌, నాసామ్స్ యాంటీ మిస్సైల్ సిస్టమ్స్ కూడా ఉక్రెయిన్ వద్ద ఉన్నాయి. ఎఫ్‌-16 యుద్ధ విమానం కూలిపోవడం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఎదురుదెబ్బే అవుతుంది.

.

3