గోదావరిఖనిలో రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కృషి : శ్రీధర్ బాబు


తెలంగాణలోని గోదావరిఖనిలో రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గోదావరిఖనిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ తో కలిసి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రూ. 8 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంత యువతకు ఉపయోగపడేలా నైపుణ్య శిక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనన చేశామన్నారు. అంతేగాక, రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని, దీని కోసం స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎంతో కృషి చేశారన్నారు శ్రీధర్ బాబు. వచ్చే ఏడాది వెయ్యి మందికి శిక్షణ ఇచ్చేలా ఈ సెంటర్ ను అభివృద్ది చేస్తామని మంత్రి వివరించారు. రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు.

Post a Comment

0 Comments