28న తిరుమలకు జగన్మోహన్ రెడ్డి !

Telugu Lo Computer
0


నెల 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయించారు. లడ్డూ వివాదం వేళ అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని పార్టీ శ్రేణులతో పాటుగా ప్రజలకు పిలుపునిచ్చారు. లడ్డూ వివాదంలో జగన్ పైన కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న ఈ సమయంలో జగన్ నిర్ణయం కీలకంగా మారుతోంది. తిరుమల లడ్డూ వివాదం వేళ సీఎం జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే అంశం పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ చర్చించారు. రాజకీయ దురుద్దేశంతోనే సీఎం చంద్రబాబు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే ఈ అంశం పైన విచారణ కోరుతూ డిమాండ్ చేసిన అంశాన్ని జగన్ ప్రస్తావించారు. ప్రధాని, సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖల గురించి వివరించారు. ఈ నేపథ్యం లో తాను ఈ నెల 28న తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించారు. అదే సమయంలో ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని కోరుతూ జగన్ సోషల్ మీడియా వేదికగా ఒక సందేశం విడుదల చేసారు. అందులో.. తిరుమల పవిత్రతను,స్వామివారి ప్రసాదం విశిష్టతను,వెంకటేశ్వరస్వామి వైభవాన్ని తగ్గించేలా, టీటీడీ పేరు ప్రఖ్యాతులను,వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోందని పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default