Posts

Showing posts with the label Based on these

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల అంతర్ జిల్లా బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం

Image
ఆం ధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అంతర్ జిల్లా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వీటి ఆధారంగా ఉద్యోగులకు బదిలీలు చేపట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు స్పౌజ్ (భార్య-భార్త) కేటగిరీ కింద అంతర్ జిల్లాల బదిలీలు కోరుకుంటే వారిని బదిలీ చేసేందుకు అనుమతి ఇచ్చారు. దరఖాస్తులు మాత్రం ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా సమర్పించాలి. నియామక యూనిట్ అయిన పాత జిల్లాలే ట్రాన్స్‌ఫర్ యూనిట్లుగా గుర్తించారు. సంబంధిత హెచ్ వో డీ తమ హోదాలకు సంబంధించిన ఖాళీల జాబితాను ప్రకటించాలి. ఉద్యోగులు తమకు కావాల్సిన మండలాలు/పట్టణ స్ధానిక సంస్థల్ని ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. కేసులున్న వారికి మాత్రం బదిలీలలో మినహాయిస్తారు. అలాగే బదిలీ కోరుకుంటున్న వారు ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ నుంచి తప్పనిసరిగా బకాయిలు లేవని ధృవపత్రం తీసుకోవాలి. అలాగే ఇలాంటి బదిలీ అభ్యర్ధన కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే పరిగణిస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, పీఎస్యూలు, రాష్ట్ర యూనివర్సిటీలు, మున్సిపాలిటీలు, సహకార సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, కేంద్ర యూని వర్సిటీలు, కేంద్ర సంస్థల్లోకి...