ప్రతిపక్ష నేతలను రకరకాల ప్రలోభాలకు గురిచేసి ఎన్‌డీఏ వైపు తిప్పుకుంటున్నారు : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్
ప్ర జాస్వామ్య విలువలను ధ్వంసం చేస్తూ, రెండేళ్ల క్రితం బీజేపీ వ్యతిరేక నినాదంతో గెలిచిన ప్రతిపక్ష నేతలను రకరకాల ప్రలోభాలకు గురిచేసి ఎన్‌డీఏ వైపు తిప్పుకుంటున్నారని, పార్టీ ఫిరాయించే నాయకులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాన్ని జైరాం రమేశ్ “మ్యూచువల్ ఫండ్స్” పెట్టుబడులతో పోల్చారు. ఎవరిని పార్టీలోకి చేర్చుకోవాలనుకుంటున్నారో, వారి అవసరాలు మరియు బలహీనతలకు అనుగుణంగా అమిత్ షా బృందం ముందే ప్రత్యేక ప్యాకేజీలను సిద్ధం చేస్తోందని ఆరోపించారు. ఇది కేవలం స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం సాగుతున్న చౌకబారు చర్య అని, అమిత్ షా రాజకీయ ఎత్తుగడలకు ఎలాంటి హద్దులు లేవని విమర్శించారు. అయితే, చివరికి ఆయన ఆశించిన దుష్టలక్ష్యం నెరవేరదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం మరోసారి చీలనుందనే వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మహారాష్ట్రకు చెందిన ప్రతిపక్ష ఎంపీలను అధికారపక్షం కొనుగోలు చేస్తో...