టాటా ప్లే నెల రోజుల సర్వీస్ ఉచితం!
గతంలో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఇటీవల టాటా ప్లే ఫైబర్ గా పేరు మారింది. టాటా స్కై పేరుతో ఉన్న అన్ని సేవలు టాటా ప్లే పేరుతో లభిస్తున్నాయి. ట్రై అండ్ బయ్ స్కీమ్‌లో భాగంగా కస్టమర్లకు రూ.1150 విలువైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఉచితంగా టాటా ప్లే ఫైబర్ అందిస్తోంది. ఒక నెల పాటు ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని పొందొచ్చు. కొత్తగా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారు టాటా ప్లే ఫైబర్ ప్లాన్ ట్రై చేయొచ్చు. నెల రోజుల పాటు ఇంటర్నెట్ వాడుకున్న తర్వాత సేవలు నచ్చితే కనెక్షన్ కొనసాగించొచ్చు. ఇప్పటికే ఇతర బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు కూడా ఇలాంటి ఆఫర్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టాటా ప్లే ఫైబర్ కూడా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ ఆఫర్ అందిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగిపోయింది. మరోవైపు ఆన్‌లైన్ క్లాసులు కూడా ఉండటంతో ఇళ్లల్లో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడం సాధారణం అయిపోయింది. అందుకే కస్టమర్లను ఆకట్టుకోవడానికి బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు చాలా ఆఫర్స్ ఇస్తున్నాయి. మార్కెట్ షేర్ పెంచుకోవడం కోసం చూస్తున్నాయి. టాటా ప్లే ఫైబర్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 200ఎంబీపీఎస్ స్పీడ్‌తో ప...