వాట్సాప్ గ్రూప్ కాల్స్ కోసం సరికొత్త ఫీచర్ !
వా ట్సాప్ గ్రూప్ కాల్స్ కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూప్ కాల్స్‌లో వాయిస్ ఛాట్స్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రారంభించింది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఫోన్ యూజర్లకు ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా ఏదైనా గ్రూప్ కాల్ వస్తే గ్రూప్‌లోని సభ్యులందరికీ నోటిఫికేషన్‌తో పాటు రింగ్‌టోన్ వస్తుంది. ఏదైనా అర్జెంట్ పనిలో ఉన్నా, మీటింగ్‌లో ఉన్నా గ్రూప్ కాల్ వస్తే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌లో గ్రూప్ కాల్స్ వస్తే ఎలాంటి రింగ్ రాదు. గ్రూప్‌లోని సభ్యులందరికీ కేవలం సైలెంట్ నోటిఫికేషన్ మాత్రమే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. దీంతో వాయిస్ ఛాట్‌ల పాల్గొనలనుకునే వారు కాల్ ముగిసేలోపు ఎప్పుడైనా జాయిన్ కావొచ్చు. ఈ కొత్త ఫీచర్ సహాయంతో కేవలం 60 నిమిషాలు మాత్రమే మాట్లాడొచ్చు. ఆ తర్వాత దానంతటదే కాల్ కట్ అవుతుంది. కాల్‌లో జాయిన్ అయిన వారు మాత్రమే వాయిస్ ఛాట్‌ను వినొచ్చు. అయితే ఛాట్‌లో పాల్గోనని వారు కూడా కాల్‌లో పాల్గొన్నవారి ప్రొఫైల్‌ను చూడొచ్చు. ఈ వాయిస్ చాట్‌ల్లోనూ ఎండ్...