సోనీ WF-C510 ఇయర్‌బడ్స్‌విడుదల !
దే శీయ మార్కెట్ లో సోనీ WF-C510 ఇయర్‌బడ్స్‌ను అందుబాటులోకి విడుదల చేసింది. ఈ ఇయర్‌బడ్స్ సౌకర్యంగా ఉంటాయని, ఎక్కువ రోజులపాటు బ్యాటరీ లైఫ్ ఇస్తాయని సోనీ చెబుతోంది. దీంతోపాటు ఈ ఇయర్‌బడ్స్ మెరుగైన ఫీచర్లు, అందుబాటులో ధరలో సోనీ విడుదల చేసింది. సోనీ WF- C510 ఇయర్‌బడ్స్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉన్నాయి. సౌకర్యవంతంగా వినియోగించుకొనేలా ఉంటాయి. ఎక్కువ సమయం వినియోగించినా.. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఈ ఇయర్‌బడ్స్‌ను డిజైన్ చేసినట్లు తెలిపింది. చెవులకు సంబంధించిన అనేక సంవత్సరాల సమాచారం ఆధారంగా ఇయర్‌బడ్స్‌ను డిజైన్ చేసినట్లు తెలిపింది. ఇది మల్టీ పాయింట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను కలిగి ఉంది. ఫలితంగా రెండు పరికరాలను ఒకేసారి కనెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ బడ్స్ Spotify ట్యాప్‌ను సపోర్టు చేస్తాయి. ఫలితంగా Fast pair మరియు Swift Pair ను సులభంగా చేయవచ్చు. ఈ బడ్స్ IPX4 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా వ్యాయామం సహా వర్షాకాలం సమయాల్లో వినియోగించేందుకు వీలుగా ఉంటాయి. ఈ ఇయర్‌బడ్స్ యాంబియంట్ సౌండ్ మోడ్‌ను కలిగి ఉంటాయి. అంటే సంగీతం వింటున్న సమయంలోనూ పర...