Posts

Showing posts with the label design updates

ఎంజీ మోటార్స్ హెక్టర్ కొత్త మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ విడుదల

Image
దే శీయ మార్కెట్లో ఎంజీ మోటార్స్ హెక్టర్ కొత్త మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. కొత్త ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ కారు డిజైన్ అప్‌డేట్స్‌, ప్రీమియం ఇంటీరియర్స్‌, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో వచ్చింది. రూ.11.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయింది. ఇది పాత మోడల్ కంటే దాదాపు రూ.2 లక్షలు తక్కువ.  2019లో ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశంలో మొట్టమొదటి ఇంటర్నెట్‌- కనెక్టెడ్‌ ఎస్‌యూవీగా ఇది లాంచ్ అయింది. ‘ఇంటర్నెట్ ఇన్సైడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఎంజీ కార్లలో ఇది ఒకటి. ఇప్పుడు కంపెనీ ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను అప్‌గ్రేడ్‌లతో లాంచ్ చేసింది. ముందు, వెనుక భాగాల్లో కొత్త బంపర్లు, ఆరా హెక్స్ గ్రిల్తో రీడిజైన్ చేసిన గ్రిల్‌ను అందించారు. అలాగే కొత్త డిజైన్ అలాయ్ వీల్స్‌ను జోడించారు. ఈ ఎస్‌యూవీ సెలడాన్ బ్లూ, పెర్ల్ వైట్ రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 5 సీటర్‌, 6 సీటర్‌, 7 సీటర్‌ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఇంటీరియర్ విభాగంలో కూడా ఎంజీ కీలక మార్పులు చేసింది. 5 సీటర్ వేరియంట్‌కు డ్యూయల్ టోన్ ఐస్ గ్రే థీమ్.. ...