దేశీయ మార్కెట్లో ఎంజీ మోటార్స్ హెక్టర్ కొత్త మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. కొత్త ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ కారు డిజైన్ అప్‌డేట్స్, ప్రీమియం ఇంటీరియర్స్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో వచ్చింది. రూ.11.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయింది. ఇది పాత మోడల్ కంటే దాదాపు రూ.2 లక్షలు తక్కువ. 2019లో ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశంలో మొట్టమొదటి ఇంటర్నెట్- కనెక్టెడ్ ఎస్‌యూవీగా ఇది లాంచ్ అయింది. ‘ఇంటర్నెట్ ఇన్సైడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఎంజీ కార్లలో ఇది ఒకటి. ఇప్పుడు కంపెనీ ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను అప్‌గ్రేడ్‌లతో లాంచ్ చేసింది. ముందు, వెనుక భాగాల్లో కొత్త బంపర్లు, ఆరా హెక్స్ గ్రిల్తో రీడిజైన్ చేసిన గ్రిల్‌ను అందించారు. అలాగే కొత్త డిజైన్ అలాయ్ వీల్స్‌ను జోడించారు. ఈ ఎస్‌యూవీ సెలడాన్ బ్లూ, పెర్ల్ వైట్ రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 5 సీటర్, 6 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఇంటీరియర్ విభాగంలో కూడా ఎంజీ కీలక మార్పులు చేసింది. 5 సీటర్ వేరియంట్‌కు డ్యూయల్ టోన్ ఐస్ గ్రే థీమ్.. 6, 7 సీటర్ వేరియంట్లకు డ్యూయల్ టోన్ అర్బన్ టాన్ థీమ్ ఇచ్చింది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అడ్జస్టబుల్ స్టీరింగ్, కొత్త అప్‌హోల్స్టరీ, అప్‌డేటెడ్ డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ ఫినిష్‌లను అందించింది. ఎంజీ హెక్టర్‌లో ఉన్న 14-ఇంచుల పోర్ట్రెయిట్ స్టైల్ టచ్‌స్క్రీన్ ను మరింత వేగంగా పనిచేసేలా స్మార్ట్ బూస్ట్ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేశారు. కొత్తగా అందించిన i-SWIPE టచ్ జెస్చర్ కంట్రోల్ ద్వారా ఏసీ, మ్యూజిక్, నావిగేషన్ వంటి ఫంక్షన్లను మల్టీ-ఫింగర్ జెస్చర్లతో నియంత్రించవచ్చు. అదనంగా డిజిటల్ బ్లూటూత్ కీ, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అలర్ట్స్, రిమోట్ ఏసీ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా హెక్టర్‌లో 360 డిగ్రీ HD కెమెరాను అందించారు. స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా ABS, EBD, ESP, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ ఉన్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో ADAS కూడా అందుబాటులో ఉంది. దీనిలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది మాన్యువల్, సీవీటి గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంజిన్ 143 PS పవర్, 250 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఓనర్‌షిప్ ప్రోగ్రామ్‌ను హెక్టర్‌లో అందిస్తోంది. ఇందులో 3 సంవత్సరాల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 3 లేబర్-ఫ్రీ సర్వీసులు ఉన్నాయి. అదనంగా వారంటీ, మెయింటెనెన్స్ ప్యాకేజీలను విస్తరించుకునే అవకాశం కూడా ఉంది.
0 Comments