Posts

Showing posts with the label Conductor Dies of Severe Injuries

కోదాడ డిపోలో కండక్టర్‌ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు : తీవ్ర గాయాలతో కండక్టర్‌ మృతి

Image
కో దాడ ఆర్టీసీ డిపోలో నిన్న రాత్రి జరిగిన ఘోర ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనం వద్దకు వెళ్తున్న కండక్టర్ కొమ్ము కోటయ్యపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. బస్సు రెండు కాళ్లపై నుంచి వెళ్లడంతో కోటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. డిపో గ్యారేజ్‌లో బస్సును పార్కింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డిపోలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కుమార్‌కు బస్సు అప్పగించడంతో పార్కింగ్ చేస్తుండగా ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి పార్కింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో కండక్టర్ కోటయ్య బస్సు కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అనుభవం, తగిన డ్రైవింగ్ అర్హత లేని ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో బస్సు నడిపించడమే ప్రమాదానికి కారణమని సిబ్బంది ఆరోపిస్తున్నారు. అసిస్టెంట్ మెకానిక్‌లతో బస్సులు నడిపిస్తున్నారని, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వడం లేదని కా...