Posts

Showing posts with the label Auto Driver Rapes Young Woman in Vijayawada

విజయవాడలో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

Image
వి జయవాడలో ఓ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒంటరిగా వచ్చిన ఆ యువతిని వెళ్లాల్సిన గమ్యానికి తీసుకెళ్లకుండా బలవంతంగా కృష్ణలంక వైపునకు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ ఆమెను భయబ్రాంతులకు గురి చేసి ఎవరూ లేని ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను అక్కడే వదిలేసి ఆటోతో పాటు పారిపోయాడు. తనపై జరిగిన దుర్ఘటనపై తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటో డ్రైవర్ వదిలిపెట్టిన స్థలం నుంచి ఏడ్చుకుంటూ వచ్చిన యువతిని చూసి తల్లిదండ్రులు షాకయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.