Posts

Showing posts with the label Chiranjeevi's 'Chattamtho Poratam'

చిగురించిన సినిమాల చెట్టు : ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన స్థానికులు

Image
ఆం ధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం సమీపంలో గోదావరి ఒడ్డున నిద్రగన్నేరు చెట్టుంది. ఈ చెట్టు కింద షూటింగ్‌ జరుపుకున్న సినిమాలెన్నో. అందుకే దీనిని సినిమా చెట్టుగా పిలుస్తుంటారు. కృష్ణ నటించిన పాడిపంటలు, చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, తదితర సుమారు 300 చిత్రాలు ఈ చెట్టు దగ్గర షూటింగ్‌ జరుపుకున్నాయని స్థానికులు చెబుతారు. జిల్లాలోని ఏలూరు, కొల్లేరు, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, పెద్దేము, భీమవరం పరిసర ప్రాంతాలు, పాలకొల్లు, నిడదవోలు, చాగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్‌ ప్రదేశాలు ఉన్నాయి. సితార, లేడీస్‌ టైలర్, డిటెక్టివ్‌ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి-గోపిక-గోదావరి, మంచు పల్లకీ ఇలా సుమారు 18 సినిమాలకు కుమారదేవం చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించానని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ తెలిపారు. ఈ చెట్టు కూలిపోయిందని తెలియగానే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వెళ్లారు. కూలిపోయిన భారీ నిద్ర గన్నెరు వృక్షాన్ని పరిశీలించి భావోద్వేగానికి లోనయ్యారు. స్థానికులతో మాట్లాడుతూ తనకు, చెట్టుకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ చెట్టు మళ్లీ ...