లష్కర్ బోనాల జాతర ప్రారంభం : ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు : తొలి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
ల ష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయానికి వస్తున్న భక్తులతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. కాగా, భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం మూడు క్యూలైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం రెండు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అలాగే వీఐపీలకు మరో క్యూలైన్ ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటుచేశారు. బందోబస్త్‌లో సుమారు 1500 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా, లష్కర్ జాతర సందర్భంగా ఇవాళ అమ్మవారికి బోనాలు సమర్పించగా.. రేపు సోమవారం నాడు రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లష్కర్ బోనాల దృష్ట్యా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో 4వ తేదీ వరకు ఆలయం చుట్టూ రెండుకిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమలు చేస్తు...