July 2026

కర్ణాటకలోని బళ్లారి నగరంలో కట్టుకున్న భార్య ప్రవర్తనపై అనుమానం, ఏడు నెలల పసిపాప తన సంతానమేనా అనే సందేహంతో సుత్తితో తీవ్రంగా బాది భార్యను, కన్నకూతురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడు హొన్నూరప్ప (28)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడిలో రాజేశ్వరి (24), ఆమె ఏడు నెలల కుమార్తె అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హొన్నూరప్ప, రాజేశ్వరిలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎపిఎమ్‌సి యార్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంధ్రాళ్ గ్రామంలోని వారి నివాసంలో గురువారం రాత్రి 8:30 నుండి 9:30 గంటల మధ్య ఈ ఘాతుకం జరిగింది. ఇంట్లో ఉన్న సమయంలో హొన్నూరప్ప సుత్తితో భార్య, పసిపాప తలలపై తీవ్రంగా కొట్టడంతో వారు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. రాజేశ్వరి సోదరుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో భార్య ప్రవర్తనపై ఉన్న అనుమానంతో పాటు, చిన్న కుమార్తె తన రక్తానికి పుట్టలేదనే భావనతోనే హొన్నూరప్ప ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. బళ్లారి ఎస్పీ సుమన్ డి పెన్నేకర్ మాట్లాడుతూ.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, భారతీయ నష్య సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణను వేగవంతం చేసి, నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా సాధ్యమైనంత త్వరగా చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు.

ఆగస్టు 6న ఎస్2 స్మార్ట్ ఫోన్  వివో  విడుదల చేయనున్నది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ ఐడియా ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫోన్ డిజైన్ వివరాలు అందించింది. వివో ఎస్2 స్మార్ట్ ఫోన్ స్టైలిష్ అండ్ స్లీక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. అలాగే, వెనుక కూడా కర్వుడ్ బ్యాక్ ప్యానల్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ కెమెరా సెటప్ ఫోన్ పై భాగంలో అడ్డంగా ఉంటుంది. ఇది ఫ్లాగ్ షిప్ ఇన్స్పైర్డ్ డిజైన్ తో వస్తుంది. వివో ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ఒకొక్కటిగా రివీల్ చేస్తుంది. వివో ఎస్2 స్మార్ట్ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.59 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7360 ప్రాసెసర్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని కొన్ని లీక్స్ చెబుతున్నాయి. అయితే , కొన్ని లీక్స్ ద్వారా ఈ వివో అప్ కమింగ్ ఫోన్ Snapdragon 8 Gen 5 తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేయగా, ఈ సెటప్ లో 50MP ప్రధాన సెన్సార్ జత 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉండే అవకాశం ఉన్నట్లు లీక్స్ చెబుతున్నాయి. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని కూడా అంచనా వేసి చెబుతున్నారు. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. అలాగే, ఇందులో 7,000mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్ సపోర్ట్ గురించి కూడా లీక్స్ చెబుతున్నాయి.

దేశంలో ఇంధన భద్రత పేరుతో ఇథనాల్ కలిపిన పెట్రోల్ ను తప్పనిసరి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు భారీ ఉద్యమం ప్రారంభం కాబోతోంది. జాతీయ స్ధాయిలో ఈ20 పెట్రోల్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలని ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్  నిర్ణయించారు. ఈ మేరకు ఆయన రేపు ఢిల్లీలో ఉద్యమం ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు. అదే సమయంలో ఈ20కి వ్యతిరేకంగా ఇప్పటికే నిరసనలు చేస్తున్న సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాలా కూడా పాదయాత్ర, నిరాహారదీక్ష చేపట్టబోతున్నారు. కేంద్రం E20 కార్యక్రమానికి వ్యతిరేకంగా తన జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు రోజు, ఒక ప్రముఖ వ్యక్తి ఈ ఆందోళనలో చేరబోతున్నారని కేజ్రీవాల్ ఇవాళ ప్రకటించారు. ఇథనాల్ మిశ్రమం సమస్యపై జూలై 5న తొలి క్షేత్రస్థాయి నిరసనకు నాయకత్వం వహించిన పూనావాలా, తాను గాంధీ స్మృతి వరకు పాదయాత్ర చేసి నిరాహార దీక్ష ప్రారంభిస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని కేజ్రివాల్ గుర్తుచేశారు. రేపు న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగే కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుందని, పాల్గొనేవారు ఉదయం 11.30 గంటలకల్లా చేరుకోవాలని కేజ్రీవాల్ తెలిపారు.  ఆగస్టు 1న ఈ20కి వ్యతిరేకంగా జాతీయ టౌన్ హాల్ కార్యక్రమంలో ప్రజల సమస్యలను వినడానికి, E20పై ఒక నిర్ణయం తీసుకోవడానికి దేశానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి నాతో పాటు ఉంటారని కేజ్రివాల్ ట్వీట్ చేశారు. మీ ఆలోచనలను కూడా పంచుకోవడానికి తప్పకుండా రండి అని ప్రజల్ని కోరారు. వర్చువల్‌గా చేరాలనుకునే వారి కోసం వాట్సాప్ నంబర్‌ను కూడా షేర్ చేశారు. తాజాగా కాక్రోచ్ ల ఉద్యమంతో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను ఈ20 ఉద్యమానికి కేజ్రివాల్ లింక్ చేశారు. దేశ యువత అహంకారపూరిత ప్రభుత్వాన్ని తలవంచేలా చేసిందని, ధర్మేంద్ర ప్రధాన్ ప్రజల ముందు రాజీనామా చేయాల్సి వచ్చిందని కేజ్రీ తెలిపారు. ఇప్పుడు ఈ20 పెట్రోల్ సమస్యను కూడా పరిష్కరించాలని ప్రధానిని కోరారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కేసు నమోదు చేసింది.  కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంబంధించిన ఏఐ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై ఈ చర్యలు తీసుకుంది. అంబటి రాంబాబు పోస్టు చేసిన వీడియోలో పెమ్మసాని చంద్రశేఖర్‌కు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్నట్లు చూపించారు. ఈ వీడియో తప్పుడు ప్రచారానికి ఉద్దేశించినదని ఆరోపిస్తూ టీడీపీ నేత మద్దిరాల మ్యానీ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఉద్దేశపూర్వకంగా కేంద్ర మంత్రి ప్రతిష్ఠను దెబ్బతీసేలా అంబటి రాంబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం మంగళగిరిలోని సీఐడీ కార్యాలయం అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసింది. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారగా, ఏఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందించే తప్పుడు వీడియోలపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను కొంతసేపు పరిమితం చేసిన ఘటనపై మెటా గ్లోబల్ బృందాన్ని పిలిపించి సంస్థ విధానాలు, కంటెంట్ నియంత్రణ వ్యవస్థలపై వివరణ కోరాలని నిర్ణయించింది. మెటా ప్రతినిధులను ముఖ్యంగా అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తాయి?, వినియోగదారులకు ఏ కంటెంట్ చూపించాలి?, అనే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, కంటెంట్ మోడరేషన్‌లో ఏమైనా పక్షపాతం ఉందా?, అనే అంశాలపై ప్రశ్నించనున్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజా శాంతి, సమాజంపై చూపించే ప్రభావం గురించి కూడా చర్చ జరగనుంది. దీంతో.. మెటా గ్లోబల్ బృందం వచ్చే వారం మధ్యలో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, అనంతరం పార్లమెంటరీ కమిటీ ముందు కూడా హాజరుకానుందని సమాచారం. సోషల్ మీడియా సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు.. దేశ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి షేర్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్టును తాత్కాలికంగా పరిమితం చేసింది. ఈ పోస్టులో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటన సాంకేతిక లోపం వల్ల జరిగిందని మెటా వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివరణపై కేంద్రం సంతృప్తి చెందలేదని సమాచారం. ఈ పరిణామాల తర్వాత ప్రధాని మోడీతో పాటు ఇతర ప్రముఖుల ఖాతాల నుంచి వచ్చే పోస్టులపై మరింత పర్యవేక్షణ ఉంటుందని మెటా తెలిపింది. 

తెలంగాణ వైద్య విద్య పరిపాలనలో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర నూతన వైద్య విద్య సంచాలకులుగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. వాణి నియామకమయ్యారు. ప్రస్తుత డిఎమ్‌ఈ డాక్టర్ ఎ. నరేంద్ర కుమార్ ఈరోజు (జూలై 31, 2026) పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో డాక్టర్ వాణిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ఆర్‌టీ నం. 318ను జారీ చేసింది. డాక్టర్ వాణికి డిఎమ్‌ఈగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. అంతకుముందు ఆమె సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో, ఫిబ్రవరి 2024లో తెలంగాణ ఇన్-ఛార్జ్ డిఎమ్‌ఈగా సేవలు అందించారు. ఆ తర్వాత జనవరి 2025లో క్రమబద్ధమైన (రెగ్యులర్) నియామకాలు జరిగే క్రమంలో ఆమె ఆ పదవి నుంచి తప్పుకుని, అనంతరం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య విద్యా శాఖలో చేపట్టిన పరిపాలనాపరమైన ప్రక్షాళన, బదిలీలలో భాగంగా ఈ కీలక నియామకం జరిగింది.

పాకిస్తాన్‌లో కాక్రోచ్ పార్టీ పాకిస్తాన్ (సీపీపీ) పేరుతో ఒక పార్టీ ప్రారంభమైంది. ఇది ప్రస్తుతం ఆన్‌లైన్ వరకే పరిమితమైంది. పాకిస్తాన్‌కు చెందిన సల్మాన్ తరార్ అనే విద్యార్థి న్యూయార్క్‌లో ఉంటున్నాడు. అతడే సీపీపీని స్థాపించాడు. పాకిస్తాన్‌లో అవినీతిని అంతం చేయడం, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకించడం, గౌరవ ప్రదమైన రాజకీయాలు నడిచేలా చేయడం తమ లక్ష్యమని సీపీపీ ఫౌండర్ సల్మాన్ అంటున్నాడు. తమ ఉద్యమంలో యువతను భాగస్వాముల్ని చేస్తామని, వారి గళాన్ని వినిపిస్తామని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి సీపీపీ పేరుతో గత మేలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అకౌంట్ క్రియేట్ అయింది. ఇది కెనడా కేంద్రంగా కొనసాగుతుండగా, ఇటీవలే వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకుంది. సీపీపీకి ఇప్పటికే ఇన్‌స్టాలో 1,12,000 మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. మెరుగైన పాలన, రాజకీయాల్లో పారదర్శకత వంటివి లక్ష్యాలుగా చెబుతోంది. తన సీపీపీ లోగోలో మెజారిటీ ప్రజలకు ప్రతినిధిగా చెబుతూ, మైనారిటీలకు రక్షణగా ఉంటామని పేర్కొంది. యునిటీ ఫెయిత్ డిసిప్లైన్ అనే క్యాప్షన్ కూడా ఉంది. ఇప్పటికే ఈ అకౌంట్ చాలా యాక్టివ్‌గా పని చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఆందోళనకారులపై జరుగుతున్న అణచివేతలను ప్రస్తావిస్తోంది. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా వివరిస్తోంది. ఇదే సమయంలో సీపీపీకి వివిధ హోదాల్లో పని చేసే వారి నుంచి దరఖాస్తులు కూడా కోరుతోంది. అవినీతిని అంతం చేయడం, వారసత్వ రాజకీయాల్ని అడ్డుకోవడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, విద్యావ్యవస్థను మెరుగుపరచడం, చమురు సంక్షోభానికి పరిష్కారం, నీటి కొరతను ఎదుర్కోవడం, ఆర్థిక, రాజకీయ స్థిరత్వాన్ని సాధించడం ప్రధాన లక్ష్యాలుగా సీపీపీ చెబుతోంది. అయితే, పాకిస్తాన్‌లోని షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీపీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంలో స్పష్టత లేదు. ఇటీవల దేశంలో సీజేపీ చేపట్టిన ఉద్యమానికి పాకిస్తాన్‌ నుంచి చాలా మంది మద్దతు తెలిపారు. కానీ, అక్కడ మాత్రం ఇలాంటి ప్రజాస్వామిక పరిస్థితులు లేవు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడం అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆందోళనకారుల్ని ప్రభుత్వం దారుణంగా అణిచివేస్తుంది. ప్రభుత్వం తీవ్ర హింసకు పాల్పడుతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 'ప్రధాన మంత్రి సూర్య సరోవర్ యోజన' (పీఎం-ఎస్‌ఎస్‌వై)కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు రూ.5,070 కోట్లు ఖర్చు చేయనుంది. చెరువులు, సరస్సులు, జలాశయాల ఉపరితలంపై భారీ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే ఈ పథకం ప్రాథమిక లక్ష్యం. ప్రధాన మంత్రి సూర్య సరోవర్ యోజన కింద 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీంతో పాటు, 10,000 మెగావాట్-గంటల సామర్థ్యం గల బ్యాటరీ నిల్వ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టులను 2026- 2027 నుంచి 2030- 2031 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆమోదించబడతాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక సహాయ పంపిణీ 2033 వరకు కొనసాగుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్లు అంటే భూమిపై కాకుండా, సరస్సు, ఆనకట్ట, జలాశయం లేదా చెరువు ఉపరితలంపై ఏర్పాటు చేయబడిన సౌర విద్యుత్ ప్లాంట్లు. దీనివల్ల భూమి అవసరం తగ్గి, అందుబాటులో ఉన్న నీటి వనరులను మెరుగ్గా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. విజయవంతమైన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులకు ప్రతి మెగావాట్‌కు రూ.1 కోటి వరకు కేంద్ర ఆర్థిక సహాయం లభిస్తుంది. దీంతో ప్రాజెత్టు వ్యయం తగ్గి పెట్టుబడిదారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాజెక్ట్ ప్రాథమిక రీసెర్చ్, సర్వే కోసం రూ. 50 లక్షల వరకు సహాయం అందించబడుతుంది. ఇండియా ప్రస్తుత ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యం సుమారు 700 మెగావాట్లుగా ఉంది. కొత్త పథకం దీనిని 5,000 మెగావాట్ల మేర పెంచుతుంది. భూసేకరణ అవసరం తగ్గుతుంది. బ్యాటరీ నిల్వ విద్యుత్ సరఫరాను మరింత స్థిరంగా, నమ్మదగినదిగా చేస్తుంది. జలాశయాలు, చెరువులు మరింత మెరుగ్గా ఉపయోగించబడతాయి. ఈ పథకం ద్వారా ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని ప్రభుత్వ అంచనా. ఇది సౌర ప్రాజెక్టులకు సంబంధించిన రంగాలలో 16,000 నుంచి 17,000 ఉద్యోగాలను కూడా సృష్టించగలదు. అంతేకాకుండా ఇది సోలార్ మాడ్యూల్స్, బ్యాటరీలు, ఇతర భాగాల దేశీయ తయారీని ప్రోత్సహిస్తుంది.

హైదరాబాద్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమేవేశంలో తలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అర్హులను గుర్తించి ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు పింఛన్లు దోహదపడతాయన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పింఛన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యానికి తావివ్వద్దన్నారు. మండలస్థాయిలో అన్ని శాఖల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను ఎంపీడీవోలు పర్యవేక్షించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 45 రోజులకు ఒకసారి మండల పరిషత్తు సమావేశాలు నిర్వహించాలని, సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించారు. సర్పంచులు తమ గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయన్నారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు ఉండాలని, ప్రతి పంచాయతీకి పంచాయతీ కార్యాలయం నిర్మించాలని సీఎం ఆదేశించారు. పంచాయతీలోని జనాభా ఆధారంగా ఏ, బీ, సీలుగా వర్గీకరించి భవనాలు నిర్మించాలన్నారు. కార్యదర్శులు పారిశుధ్య పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో బాధ్యత వహించేలా చూడాలన్నారు. వివిధ కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీలకు పారిశుధ్య, ఇతర పనులకు ఆటంకం లేకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. కోటిమంది వహిళలకు పంపిణీ చేసే చీరలు పూర్తి నాణ్యతతో, ఆకట్టుకునే డిజైన్లలో ఉండాలని సూచించారు. డిజైన్ల రూపకల్పనకు ఎనఐఎఫ్‌టీ విద్యార్థులను వినియోగించుకోవాలని తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో తాగు నీటి సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామీణ తాగు నీటి సరఫరా, హైదరాబాద్ మెట్రో వాటర్, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. తాగు నీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామీణ తాగు నీటి పథకాల పరిధిలో పనిచేసే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ 5వ తేదీ లోపు వేతనాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. స్థానిక వనరుల ఆధారంగా తాగు నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, పీఆర్ అండ్ ఆర్డీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఈవో సెర్ప్ దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో విశ్వాస్ జ్యువెలర్స్‌ అనే ఓ గోల్డ్‌ షాపులో నిత్యం బంగారు ఆభరణాలు కనబడకుండా పోతున్నాయి. ప్రతి ఉదయం దుకాణానికి వచ్చిన సిబ్బంది కొన్ని బంగారు ఉంగరాలు కనిపించకపోవడాన్ని గమనిస్తున్నారు. దీంతో వారు వెంటనే యజమానికి సమాచారం అందించారు. దొంగను కనిపెట్టేందుకు యజమాని దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే సీసీటీవీలో కనిపించిన దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక ఎలుక ఇప్పటి వరకు 10 ఉంగరాలు, రెండు గొలుసులతో  పాటు వాటికి సంబంధించిన ధర ట్యాగ్‌లు కూడా ఎత్తుకుపోయింది. సాధారణంగా దొంగలు బంగారాన్ని మాత్రమే తీసుకెళ్తారు కానీ ట్యాగ్‌లను తీసుకెళ్లరని భావించిన యజమానికి ఏదో అసాధారణ ఘటన జరిగిందనే అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలో అయితే నగలు దొంగిలించినది మనిషి కాదు, ఓ ఎలుక అని తేలడంతో అంతా తెల్లమొహాలు వేశారు. రాత్రి సమయంలో ఓ ఎలుక దర్జాగా షాపులో ప్రవేశించి బంగారు ఉంగరాన్ని నోటితో పట్టుకుని పరుగెత్తడం వీడియోలో కనిపించింది. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో రికార్డైన వీడియోలో అసలు విషయం బయటపడింది. ఎలుక బంగారు ఉంగరాలను తీసుకెళ్లినట్లు గుర్తించిన సిబ్బంది షాపు మొత్తం వెతికారు. షాపులో ఎలుకలు చేసిన కలుగులు, వాటి దారులు కనిపించాయి. చివరకు ఆ కలుగుల్లోనే కనిపించకుండా పోయిన 10 బంగారు ఉంగరాలు, ధర ట్యాగ్‌లు దొరికాయి. అయితే వీటిని దొంగిలించిన దొంగ ఎలుక మాత్రం వారికి కనిపించలేదు. షాపు సిబ్బంది కలుగులన్నింటినీ మూసి వేశారు.

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌, క్వెట్టా సమీపంలోని సోరేంజ్ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32 మంది గని కార్మికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 29 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మరో మూడు మృతదేహాలను గుర్తించి బయటకు తీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. గని లోపల మీథేన్ వాయువు అధికంగా పేరుకుపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారుల ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పేలుడు తీవ్రతకు ఒకదానికొకటి సమీపంలో ఉన్న రెండు గనులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో మొత్తం 36 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. పేలుడు జరిగిన వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు, గనుల శాఖ అధికారులు, స్థానిక సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదం జరిగిన 12 గంటలు దాటిన తర్వాత కూడా శిథిలాల కింద చిక్కుకున్నవారిని ప్రాణాలతో రక్షించే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో బొగ్గు గనుల్లో ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అనేక గనుల్లో సరైన వెంటిలేషన్ వ్యవస్థ, గ్యాస్ పర్యవేక్షణ పరికరాలు, భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. గనుల యజమానులు భద్రతా నిబంధనలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇజ్రాయిల్ దేశానికి చెందిన ప్రతిష్టాత్మక 'గివాటి బ్రిగేడ్‌'కు చెందిన 'త్సబార్ బెటాలియన్' నుంచి దాదాపు వంద మందికి పైగా సైనికులు తమ కమాండర్లతో విభేదించి, ఆర్మీ బేస్‌ను వదిలి వెళ్ళిపోవడం కలకలం రేపింది. క్రమశిక్షణకు మారుపేరుగా భావించే ఇజ్రాయిల్ సైన్యంలో ఇలాంటి తిరుగుబాటు తరహా సంఘటన జరగడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నెగెవ్ ఎడారిలోని 'స్డే తేమాన్' సైనిక స్థావరంలో గురువారం ఈ ఘటనా క్రమం చోటుచేసుకుంది. గాజా, దక్షిణ లెబనాన్ యుద్ధరంగాల్లో సైనికులు ప్రదర్శించిన సాంప్రదాయ చిహ్నాలు, ప్లేకార్డులను బెటాలియన్ కమాండర్ తొలగించడమే ఈ అసంతృప్తికి ప్రధాన కారణం. సైనిక విభాగాల్లో ఒక బ్యాచ్ నుంచి మరొక బ్యాచ్‌కు అనుభవపూర్వకంగా అందుతూ వస్తున్న సంప్రదాయ సంకేతాలను కమాండర్ స్వయంగా సుత్తితో పగులగొట్టి తొలగించడం సైనికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సైనికులు తమ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తమకు కేటాయించిన ఆయుధాలను స్థావరంలోనే వదిలేసి, వ్యక్తిగత వస్తువులతో ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇక, సైనికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బేస్ బయటకు నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా ప్రచారమయ్యాయి. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇజ్రాయిల్‌లో సైనిక తిరుగుబాటు మొదలైందని వార్తలు ఊపందుకున్నాయి. ఈ ఘటనపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారికంగా స్పందిస్తూ, ఇది తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యమని వ్యాఖ్యానించింది. కొత్తగా చేరే జూనియర్ సైనికులను ర్యాగింగ్ చేసే అవాంఛనీయ సంప్రదాయాలకు సంబంధించిన బోర్డులను మాత్రమే తొలగించామని కమాండర్లు స్పష్టం చేశారు. ఆర్మీ అధికారుల ప్రకటన ప్రకారం, ఈ ఘటనపై అంతర్గత విచారణ ప్రారంభమైంది. సాయంత్రంలోగా బేస్‌కు తిరిగి రాకపోతే కఠినమైన మిలిటరీ కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదేశాలు జారీ చేయడంతో మెజారిటీ సైనికులు తిరిగి విధుల్లోకి చేరినట్టు సమాచారం. ఈ పరిణామాన్ని అరబ్, మధ్యప్రాచ్య మీడియా సంస్థలు భిన్న కోణంలో విశ్లేషించాయి. ఇరాన్ మద్దతుగల ఇరాకీ 'నయా' ఏజెన్సీ ఈ ఘటనను ఆక్రమణ సైన్యంలో అంతర్గత కూలిపోతగా అభివర్ణించింది. ఇక లెబనాన్ వార్తా ఛానెళ్లు ఈ ఘటనను మరో విధంగా విశ్లేషిస్తున్నాయి. సైనికులు ఆయుధాలు వదిలేసి వెళ్ళడాన్ని ప్రత్యక్ష మిలిటరీ తిరుగుబాటుగా పేర్కొన్నాయి. సుదీర్ఘ కాలంగా సాగుతున్న పోరాటాల వల్ల ఇజ్రాయిల్ ఆర్మీ ఐక్యత, పట్టు సడలుతోందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని మరికొన్ని అంతర్జాతీయ మీడియా ఛానళ్లు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి ఇజ్రాయిల్‌ సైన్యంలో మొదలైన ఈ ముసలం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఈ పరిణామాలను బట్టి మొత్తంగా చూసుకుంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి, నెలల తరబడి గాజా, లెబనాన్ సరిహద్దుల్లో సాగుతున్న సుదీర్ఘ యుద్ధ వాతావరణం సైనికులలో మానసిక అలసటను పెంచాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు అంతర్జాతీయ దౌత్య ఒత్తిళ్లు, మరోవైపు అంతర్గత విభేదాలు ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా చింతలపూడి, రేచర్ల బొగ్గు బ్లాకుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు రూ.లక్ష కోట్ల భారీ పెట్టుబడితో ప్రాజెక్టును నెలకొల్పేందుకు సిద్ధమైంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన వాణిజ్య బొగ్గు గనుల వేలంలో భాగంగా రిలయన్స్ ఈ బ్లాకులను సొంతం చేసుకుంది. అందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏపీలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవలే రిలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయి, ఈ ప్రాజెక్ట్ కార్యాచరణను వివరించారు. చింతలపూడి, రేచర్ల ప్రాంతాల్లో భూఉపరితలం నుంచి 600 మీటర్ల కంటే ఎక్కువ లోతులో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.సాధారణ పద్ధతిలో అంత లోతు నుంచి బొగ్గును బయటకు తవ్వితీసి రవాణా చేయడం ఆర్థికంగా, సాంకేతికంగా అత్యంత శ్రమతో కూడుకున్న పని. అందువల్ల అత్యాధునిక యుసిజి సాంకేతికత ద్వారా బొగ్గును నేరుగా భూమి పొరల్లోనే మండించి, దానిని సింథటిక్ గ్యాస్ రూపంలోకి మార్చి పైకి తీస్తారు. సాంప్రదాయ మైనింగ్ అవసరం లేకుండా, పర్యావరణానికి ముప్పు తగ్గించేలా ఈ గ్రీన్ ఎనర్జీ సాంకేతికత ఉపయోగపడనుంది. జియోలాజికల్ అంచనాల ప్రకారం ఈ రెండు బ్లాకుల్లో కలిపి ఏకంగా 3,130.61 మిలియన్ టన్నుల అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇందులో చింతలపూడి బ్లాక్ 1,200 హెక్టార్లలో విస్తరించి 904.94 మిలియన్ టన్నుల జీ-12' గ్రేడ్ బొగ్గును కలిగి ఉండగా, రేచర్ల బ్లాక్ 2,225 హెక్టార్లలో 2,225.67 మిలియన్ టన్నుల జీ-13 గ్రేడ్ నిల్వలను కలిగి ఉంది. ఈ బొగ్గు నుంచి ప్రాసెస్ చేసే సింథటిక్ గ్యాస్‌ను యూరియా, అమ్మోనియా వంటి ఎరువుల తయారీకే కాకుండా మెథనాల్, సింథటిక్ ఇంధనాలు, ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగిస్తారు. 2029 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ ఇంధన భద్రతలో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రూ.లక్ష కోట్ల భారీ పెట్టుబడితో వస్తున్న ఈ ప్రాజెక్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతాన్నివ్వడమే కాకుండా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంధనాలు, ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది.

గూగుల్ పే యాప్‌ "ఆస్క్ గూగుల్ పే" పేరుతో జెమినై ఆధారిత ఏఐ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. టైప్ చేయడం లేదా వాయిస్ కమాండ్ ఇవ్వడం ద్వారా గతంలో చేసిన ఖర్చుల వివరాలను ఏఐ వెంటనే విశ్లేషించి సమాధానం ఇస్తుంది. ఉదాహరణకు.. గత నెలలో రెస్టారెంట్లలో ఎంత ఖర్చు చేశాను? ఈ వారం ఎక్కువగా డబ్బు ఎక్కడ ఖర్చయింది? నా నెలవారీ ఖర్చులను ఎలా నియంత్రించుకోవచ్చు? ఇలాంటి ప్రశ్నలకు వ్యక్తిగత లావాదేవీల ఆధారంగా సమగ్ర సమాధానాలు అందిస్తుంది. కేవలం ఖర్చుల వివరాలకే పరిమితం కాకుండా, ఈ ఏఐ అసిస్టెంట్ ఆర్థిక నిర్వహణకు ఉపయోగపడే సూచనలను కూడా ఇస్తుంది. నెలవారీ బడ్జెట్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలి, అవసరం లేని ఖర్చులను ఎలా తగ్గించాలి వంటి విషయాల్లో మార్గదర్శకత్వం అందిస్తుంది. అదనంగా.. SIP పెట్టుబడులపై సమాచారం, క్రెడిట్ స్కోర్‌కు సంబంధించిన వివరాలు, ప్రయాణాలు, షాపింగ్ సమయంలో అందుబాటులో ఉన్న క్రెడిట్ కార్డు ఆఫర్లు వంటి అంశాలను కూడా యాప్‌లోనే చూడొచ్చు. దీంతో వేరే యాప్‌లు ఉపయోగించాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ కొత్త ఏఐ ఫీచర్ ప్రస్తుతం 10 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తోంది. ప్రాంతీయ భాషల్లోనే ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందే అవకాశం ఉండటంతో మరింత మంది వినియోగదారులు సులభంగా ఉపయోగించుకోగలుగుతారు. వాయిస్, టెక్స్ట్ రెండు విధానాల్లోనూ ఈ సేవలను వినియోగించవచ్చు. గూగుల్, ఎస్‌బీఐ కార్డ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని Google Pay Flex SBI Cardను కూడా పరిచయం చేసింది. ఈ క్రెడిట్ కార్డు రూపే, వీసా నెట్‌వర్క్‌లలో లభిస్తుంది. గూగుల్ పే యాప్ ద్వారానే ఎలాంటి పేపర్ డాక్యుమెంట్లు సమర్పించకుండా కొన్ని నిమిషాల్లో దరఖాస్తు చేసే అవకాశం కల్పించారు. ఈ కార్డుతో ప్రతి కొనుగోలుపై రివార్డ్స్ పొందవచ్చు. అలాగే అవసరమైతే క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చుకునే సౌకర్యం కూడా ఉంటుంది. గూగుల్ పే ఫ్లెక్స్ ఎస్‌బీఐ కార్డు తీసుకునే వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను కూడా ప్రకటించారు. గూగుల్ ఏఐ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌పై ఒక సంవత్సరం పాటు 50 శాతం రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త సేవలతో గూగుల్ పే కేవలం చెల్లింపుల యాప్‌గా కాకుండా వ్యక్తిగత ఆర్థిక నిర్వహణకు ఉపయోగపడే సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది.

ఫ్లిప్‌కార్ట్  'ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌' సేవలను అధికారికంగా ప్రారంభించింది. వినియోగదారులకు మెరుగైన, సౌకర్యవంతమైన డిజిటల్ క్రెడిట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ‘పేయూ ఫైనాన్స్’ భాగస్వామ్యంతో ఫ్లిప్‌కార్ట్ ఈ సేవలను అందిస్తోంది. ఈ ప్రత్యేక సదుపాయం కేవలం ఫ్లిప్‌కార్ట్‌లోనే కాకుండా, మైంత్రా, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉండనుంది. వినియోగదారుల సౌకర్యార్థం ‘పే లేటర్’ విభాగంలో మూడు రకాల చెల్లింపు ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. !) పే లేటర్ ద్వారా వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత 30 రోజుల గడువులోగా బిల్లు చెల్లించే సదుపాయం. 2) పే ఇన్ 3 ద్వారా కొనుగోలు చేసిన బిల్లు మొత్తాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు విడతల్లో చెల్లించే వెసులుబాటు. 3) సులభ వాయిదాల ఈఎంఐ ద్వారా ఖరీదైన ఉత్పత్తులకు 3 నుంచి 12 నెలల కాలపరిమితి కలిగిన ఈఎంఐ ఆప్షన్లు ఉంటాయి. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫర్నీచర్‌తో పాటు తక్కువ ధర ఉత్పత్తుల కొనుగోళ్లకు కూడా ఈ ఈఎంఐ వర్తిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, వాలెట్లు, ఈఎంఐ మరియు క్యాష్ ఆన్ డెలివరీ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా ‘పే లేటర్’ జతకావడంతో వినియోగదారులకు ఆర్థికంగా మరింత వెసులుబాటు కలగనుంది. ‘ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రీడమ్‌ సేల్‌’  కంటే ముందే ఈ కొత్త సర్వీస్‌ను ప్రకటించడం విశేషం. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్, ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్ సభ్యులకు ఆగస్టు 7 నుంచే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా, ఈ సేల్ సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపిన వారికి 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.

పాత నాణేలను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తామంటూ ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా ప్రచారం చేసిన ఓ ముఠా హైదరాబాద్ నగరానికి చెందిన ప్రవాస భారతీయురాలి నుంచి రూ.71.8 లక్షలు కాజేసింది. అమెరికాలో నివసిస్తున్న ఓ మహిళ (73) జనవరిలో ఇన్‌స్టాలో పురాతన నాణేలు కొంటామనే ప్రకటన చూశారు. 1947 జార్జ్‌-6 కింగ్‌ ఎంపరర్‌ నాణెం ఫొటో, ఓ ఫోన్‌ నంబర్‌ను కేటుగాళ్లు పోస్టు చేశారు. నాణెం విలువ రూ.27 లక్షలుగా పేర్కొన్నారు. దీంతో ఎన్నారై మహిళ తన వద్ద ఉన్న మూడు 1947 జార్జ్‌-6 నాణేలు, రెండు 20 పైసల 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' నాణేల ఫొటోలు పంపారు. మోసగాళ్లు ఒక్కో 1947 నాణెం విలువ రూ.27 లక్షలుగా, ఒక్కో 20 పైసల నాణెం విలువ రూ.12 లక్షలుగా ఖరారు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. రకరకాల పేర్లతో పలు దఫాలుగా రూ.71,80,950 వసూలు చేసినా వేధింపులు ఆపలేదు. దీంతో ఆమె నగరానికి చెందిన వ్యక్తికి జీపీఏ ఇచ్చి సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేయించడంతో కేసు నమోదైంది.

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీకి సంబంధించిన వేదికలను అంతర్జాతీయ క్రికెట్ మండలి అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా ఈవెంట్ కోసం మొత్తం 12 స్టేడియాలను ఎంపిక చేశారు. సరిగ్గా 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆఫ్రికా ఖండంలో ఈ క్రికెట్ పండుగ జరగనుండటం అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచ కప్ 2027 కోసం ఐసీసీ మొత్తం 12 వేదికలను ఖరారు చేయగా.. అందులో అత్యధికంగా 8 స్టేడియాలు దక్షిణాఫ్రికాలోనే ఉండటం గమనార్హం. జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రతిష్టాత్మక వాండరర్స్ స్టేడియంతో పాటు సెంచూరియన్, కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్, డర్బన్‌లోని కింగ్స్‌మీడ్, గ్వెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, బ్లూమ్‌ఫోంటైన్‌లోని మాంగాంగ్ ఓవల్, పార్ల్‌లోని బోలాండ్ పార్క్, కుగోంపో సిటీలోని బఫెలో పార్క్ మైదానాల్లో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లు జరగనున్నాయి. విశేషం ఏంటంటే 2003లో జరిగిన వరల్డ్ కప్‌లోనూ సరిగ్గా ఇవే 8 మైదానాలు ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చాయి. ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ఐసీసీ మరోసారి ఈ స్టేడియాలకే ఓటు వేసింది. టోర్నీ ప్రారంభ వేడుకలతో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలోనే జరగనుండటం అభిమానులకు నాటి పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తోంది. ఈ టోర్నీకి సహ ఆతిథ్య దేశంగా ఉన్న జింబాబ్వేకు మూడు అద్భుతమైన వేదికలు దక్కాయి. రాజధాని నగరమైన హరారేలోని స్పోర్ట్స్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌తో పాటు పర్యాటక కేంద్రమైన విక్టోరియా ఫాల్స్ వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫాలే మోసీ-ఓవా-తున్యా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నమీబియా రాజధాని విండ్‌హోక్‌లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్ తొలిసారిగా ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వబోతోంది. ఒక చిన్న దేశమైన నమీబియా చరిత్రలో తొలిసారిగా ఒక అంతర్జాతీయ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వడం నిజంగా వారికి దక్కిన అరుదైన గౌరవం. గత రెండు వరల్డ్ కప్ ఎడిషన్లలో కేవలం 10 జట్లు మాత్రమే పాల్గొనగా, 2027 ఎడిషన్‌లో ఆ సంఖ్యను 14 జట్లకు పెంచారు. దాదాపు నెలన్నర పాటు అంటే అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు ఈ టోర్నీ సుదీర్ఘంగా సాగనుంది. ఈ వ్యవధిలో మొత్తం 57 మ్యాచ్‌లు క్రికెట్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. ఈసారి ఐసీసీ ఒక సరికొత్త ఫార్మాట్‌ను అభిమానుల ముందుకు తీసుకువస్తోంది. సెమీ ఫైనల్, గ్రాండ్ ఫినాలే మ్యాచ్‌లకు ముందు ఈ 57 మ్యాచ్‌ల ఈవెంట్‌ను మూడు భిన్నమైన రౌండ్లుగా విభజించి నిర్వహించనున్నారు. గత వరల్డ్ కప్ ఫైనల్లో అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌ను ఓడించి కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. ఆఫ్రికా ఖండపు అద్భుతమైన సంస్కృతిని, వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ టోర్నీని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఐసీసీ ఛైర్మన్ జై షా ధీమా వ్యక్తం చేశారు. వేదికల ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో అప్పుడే వరల్డ్ కప్ ఫీవర్ మొదలైంది. కొత్త ఫార్మాట్, కొత్త ఆతిథ్య దేశాలతో రాబోయే ఈ టోర్నీ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ మెగా ఈవెంట్ కోసం క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం మాజీ సర్పంచ్, పార్టీ నాయకురాలు గురజాల రామతులసి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఏలూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం ఇక ఆశలు వదులుకోవాలని, ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని వైద్యులు తేల్చిచెప్పారు. గురువారం తెల్లవారుజామున వెంటిలేటర్‌పై ఉంచి సీపీఆర్‌తో పాటు అన్ని వైద్య సేవలు అందించినప్పటికీ, నాడి పూర్తిగా పడిపోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆమె మరణ వార్త తెలుసుకుని సోషల్ మీడియాలోనూ నివాళుల పోస్టులు వెల్లువెత్తాయి. అనంతరం కుటుంబ సభ్యులు ఆమె పార్థివదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మండవల్లి మండలం పులపర్రు వద్దకు వచ్చేసరికి అంబులెన్స్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయింది. ఈ ప్రయత్నంలో అంబులెన్స్ రోడ్డుపై ఉన్న పెద్ద గుంతలో ఒక్కసారిగా పడింది. ఆ కుదుపు ధాటికి చనిపోయారనుకున్న రామతులసి శరీరంలో ఒక్కసారిగా చలనం వచ్చింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యచక్రితులై వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెలో ఇంకా కొన ఊపిరి ఉందని, బతకడం కష్టమని తెలిపారు. దీంతో వెంటనే ఆమెను ఏలూరు సర్వజన ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ వైద్యుల బృందం అందించిన అత్యవసర చికిత్సతో సాయంత్రానికి ఆమె ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 

తెలంగాణలోని భద్రాచలం కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. పెళ్లి పేరుతో తనను వేధించారని బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండానే ఏకాంత వీడియోలు కూడా తీశారని ఆరోపించారు. తన నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పేరుతో తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. దీంతో బీఎన్ఎస్ 69తోపాటు 315(2)సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ కంటే ముందే లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి టీజింగ్ చేసింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ను కూడా రిలీజ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో స్మార్ట్ ఫోన్ టీజర్ లో ఈ ఫోన్ కెమెరా సెటాప్ ఇమేజ్ ని అందించింది. ఈ ఇమేజ్ లో ఈ ఫోన్ నిలువుగా ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉన్నట్లు క్లియర్ అయ్యింది. ఇందులో 50MP నో షేక్ మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మాక్రో సెన్సార్ లు ఉండే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. మెటా ఇండియా అధిపతి అరుణ్‌ శ్రీనివాస్‌తో పాటు పలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలపై ఈ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రౌజ్‌ చేస్తుండగా ప్రధాని మోడీ సంబంధిత కొన్ని మార్ఫింగ్‌ చేసిన, డిజిటల్‌గా మార్పులు చేసిన వీడియోలు, చిత్రాలు కనిపించాయని ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిలో అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు ఉండటం సహా ప్రజలను తప్పుదోవ పట్టించేలా కంటెంట్‌ను రూపొందించి ప్రచారం చేశారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా వైరల్ అయిన కంటెంట్‌ మూలాలు, వాటి ప్రచారం వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇటీవల విద్యార్థుల ఆందోళనల సమయంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు, వ్యాఖ్యలు అసభ్యకరమైన భాషలో ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పలు సోషల్‌ మీడియా ఖాతాలపై నిఘా పెరిగింది. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ ఖాతా నుంచి పోస్ట్ చేసిన ఓ వీడియో కొంతకాలం ఫేస్‌బుక్‌లో నిలిపివేయడంతో మెటాపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెటా ప్రతినిధులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చి, ప్రముఖ ఖాతాలకు అదనపు పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ యాంటీ పేపర్ లీక్ బిల్లును ఆమోదించడాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో పరీక్షల వ్యవస్థను మరింత దృఢంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు. పేపర్ లీక్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం పొందడం భారత్‌కు ఒక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. 'వికసిత్ భారత్' స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి దేశమంతా కలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్న ఆయన, పరీక్షల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మున్ముందు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేపర్ లీక్ ఘటనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అందుకే పరీక్షల సంస్కరణలను తీసుకురావడం అనివార్యమైందని ఆయన గుర్తుచేశారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు మనకు కఠినమైన చట్టాలు అవసరం. అందుకే మేము పార్లమెంట్‌లో ఒక బిల్లును ప్రవేశపెట్టాము. నేను మీకు మాట ఇచ్చినట్లే, పెద్ద సంఖ్యలో ఎంపీల భాగస్వామ్యంతో పార్లమెంట్‌లోని ఉభయ సభలు దీనిపై సుదీర్ఘంగా చర్చించాయి" అని ప్రధాని తన 2.26 నిమిషాల వీడియోలో తెలిపారు. కఠిన నిబంధనలతో కూడిన ఈ బిల్లును నేడు ఉభయ సభలు ఆమోదించాయి. నమ్మకమైన పరీక్షల వ్యవస్థను పునరుద్ధరించే దిశగా ఇప్పుడు ఒక ముఖ్యమైన అడుగు పడింది. ఈ దిశగా పనులు కొనసాగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని మేము ఎక్కువ కాలం కొనసాగనివ్వము. మిత్రులారా ఇదే నమ్మకంతో 'వికసిత్ భారత్' కలను సాకారం చేయడానికి తోడుగా ముందుకు సాగుదాం అని ఆయన అన్నారు.

తెలంగాణలోని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించారు. ఆయన మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో తన సంతాపాన్ని ప్రకటించారు. ఉద్యమ సహచరున్ని, ఆప్త మిత్రున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్లు జిల్లా ఉద్యమంలో, తనతోపాటు కలిసి నడిచిన జ్ఞాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వప్రయత్నాలూ, డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం పట్ల కేసీఆర్ మనోవేదనను వ్యక్తం చేశారు.తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజాజీవనం కొనసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు.పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ గారు కొనియాడారు.ఉద్యమకాలం నుంచి చివరిశ్వాస వరకూ గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది, అటు పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడని తెలిపారు. పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంటాయని అన్నారు.పెద్దిని కోల్పోయి శోక తప్త హృదయులై ఉన్న భార్యాపిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని అధినేత సూచించారు.పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, పెద్ది కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులకు, కేసీఆర్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే, నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది అని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదురుచూశాం కానీ ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరం అన్నారు.

మహారాష్ట్రలోని థానే జిల్లా భివండి లో నాలుగు అంతస్తుల నివాస భవనం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశాయి. బుధవారం అర్ధరాత్రి భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భవనం ఒకవైపునకు ఒరిగినట్లు గుర్తించారు. ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీయడంతో పాటు, ఒక మహిళను సజీవంగా రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తిని పడుకున్న సమయంలో భారీ శబ్దం రావడంతో మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నామని బాధితులు తెలిపారు. మరికొందరు తమ కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారని ఆందోళన చెందుతున్నారు. ఈ  భవనంలో సుమారు 45 గదులు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 25 నుంచి 30 మంది భవనంలో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని కేజీబీవీ వసతిగృహంలో విద్యార్థిని ఫ్యాన్ కు  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. లక్కయ్యగూడ గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. 

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహితలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఇంద్రావతి నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో గోదావరి ప్రవాహం తీవ్రరూపం దాల్చింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో మేడిగడ్డ, భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం 12 నుంచి 17 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని వరద ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి. SRSP, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులతో పాటు భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 'గోదావరి ఫ్లడ్ మాన్యువల్' ప్రకారం వరద నివారణ విధులు నిర్వర్తించే అధికారులందరూ తక్షణమే అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, సబ్ కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

దేశంలోని స్టార్టప్‌లకు అత్యంత అనుకూలమైన నగరంగా హైదరాబాద్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, తక్కువ నిర్వహణ వ్యయం, సంస్థాగత సహకారం వంటి అంశాలు నగరాన్ని స్టార్టప్‌లకు ప్రధాన కేంద్రంగా నిలబెట్టాయని ఎండియా పార్ట్‌నర్స్‌ విడుదల చేసిన 'హైదరాబాద్‌ స్టార్టప్‌ రెడీనెస్‌ ఇండెక్స్‌-2026' వెల్లడించింది. ఆవిష్కరణలకు, యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నెలవైన స్టార్టప్స్‌తో దేశంలోనే అగ్రగామి స్టార్టప్‌ హబ్‌గా సిటీ రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్‌ స్టార్టప్‌ ఇండెక్స్‌లోని ఇన్నొవేషన్‌ రిపోర్ట్‌ స్టార్టప్‌ రంగంలో నగర పురోగతికి అద్దం పట్టింది. మొత్తంగా 216 మంది వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థలు పర్యావరణ వ్యవస్థ (ఎకో సిస్టమ్‌) భాగస్వాముల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. నగరంలో ఏర్పాటైన స్టార్టప్స్‌ సంఖ్య 10వేలు దాటిందని నివేదిక పేర్కొంది. గత 2014 నుంచి చూస్తే ఈ పన్నెండేళ్లలో 384కు పైగా ఒప్పందాలను ఈ రంగం కుదుర్చుకుందని తద్వారా 3 బిలియన్‌ డాలర్లకు పైగా వెంచర్‌ ఫండింగ్‌ను ఆకర్షించిందని నివేదిక తేలి్చంది. దేశంలోని మొత్తం 'గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్స్‌' (జీసీసీ)ల్లో దాదాపు 20 శాతం అంటే 355కుపైగా కేంద్రాలకు నగరం వేదికగా నిలుస్తోందని నివేదిక వివరించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 43 శాతం మంది మౌలిక వసతులు, కనెక్టివిటీనే హైదరాబాద్‌కు అతిపెద్ద బలంగా పేర్కొన్నారు. అదే విధంగా 38 శాతం మంది నైపుణ్యం కలిగిన ప్రతిభ అందుబాటులో ఉండటం నగర ఘనతగా భావించగా, 36 శాతం మంది తక్కువ వ్యయంతో వ్యాపారం నిర్వహించగలగడం నగరానికి ప్రధాన పోటీ ప్రయోజనాలని అందిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే, 33 శాతం మంది పెట్టుబడుల లభ్యత, 29 శాతం మంది మార్కెట్‌ అవకాశాల విస్తరణపై మరింతగా దృష్టి సారించాలని సూచించారు.

మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా సరిహద్దు దాటి స్పెయిన్‌కు చెందిన చిన్న భూభాగం ఆయిన సెయుటాలోకి ప్రవేశించడంతో అక్కడి పరిస్థితి అదుపు తప్పింది. సరిహద్దు వద్ద పరిస్థితి పూర్తిగా కుప్పకూలిపోయిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు అదనపు బలగాలు, సైన్యాన్ని మోహరించాలని స్పెయిన్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఉదయం ఉత్తర మొరాకోలోని తారాజల్ సరిహద్దు ప్రాంతం వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అనంతరం వారిలో చాలామంది సరిహద్దు దాటి సెయుటాలోకి ప్రవేశించారు. వీరిలో ఎక్కువగా యువకులు ఉన్నప్పటికీ, మహిళలు, చిన్నారులతో కూడిన కుటుంబాలు కూడా కనిపించాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో వలసదారులు తీర ప్రాంతం నుంచి నగర రహదారుల వైపు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. "పరిస్థితి పూర్తిగా గందరగోళంగా మారింది" అని సరిహద్దు భద్రతా సిబ్బంది ప్రతినిధులు తెలిపారు. వేలాది మంది ఒకేసారి సరిహద్దు దాటడంతో భద్రతా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని వెల్లడించారు. అయితే ఈ ప్రవాహానికి అసలు కారణం ఏమిటనేది స్పష్టంగా తెలియలేదు. స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాత్రం దేశ సరిహద్దుల రక్షణ, ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు మొరాకో అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించింది. అక్రమంగా ప్రవేశించిన వారిని తిరిగి పంపించే ప్రక్రియపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపింది. మరోవైపు, గత కొద్ది రోజులుగా సముద్ర మార్గంలో సెయుటాకు చేరుకునే ప్రయత్నాలు కూడా పెరిగాయి. ఈ క్రమంలో సముద్ర మార్గంలో జరిగిన ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సెయుటా యూరప్‌లోకి ప్రవేశించేందుకు ఆఫ్రికా నుంచి వచ్చే వలసదారులకు కీలక మార్గంగా మారింది. మెరుగైన జీవితం, ఆర్థిక అవకాశాల కోసం, స్వదేశాల్లోని హింస నుంచి తప్పించుకునేందుకు అనేక మంది ఈ ప్రమాదకర ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి 2021లోనూ చోటుచేసుకుంది. అప్పట్లో కేవలం రెండు రోజుల్లోనే 8 వేల మందికి పైగా వలసదారులు సెయుటాలోకి చేరడంతో పెద్ద స్థాయి సంక్షోభం ఏర్పడింది. తాజాగా జరిగిన పరిణామాలు మరోసారి ఆ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. సెయుటా ప్రాంతీయ ప్రభుత్వం అధిపతి జువాన్ జీసస్ వివాస్ జాతీయ భద్రత దృష్ట్యా అత్యవసర చర్యలు తీసుకోవాలని కోరారు. సరిహద్దు భద్రత కోసం పోలీసులు, సైనిక బలగాలను పంపాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సెయుటాలో సహాయక కేంద్రాలు వలసదారులతో నిండిపోగా, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.

ముంబైలో ఒంటరిగా నివసిస్తున్న వ్యాపారవేత్త శరత్ కదమ్ (73) భార్య, కుమారుడు కెనడాలో నివసిస్తున్నారు. జూలై 25న ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన కారు నడుపుతూ వెళ్తుండగా, ఊహించని విధంగా ఆయనకు తీవ్రమైన పక్షవాతం వచ్చింది. దీనితో అదుపు తప్పిన ఆయన కారు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొని ప్రమాదానికి గురైంది. పక్షవాతం తీవ్రత వల్ల శరత్ కదమ్ సరిగ్గా మాట్లాడలేక మాట తడబడింది. కానీ, ప్రమాద స్థలానికి వచ్చిన పోలీసులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా, ఆయన మద్యం మత్తులో ఉన్నారని తప్పుగా భావించి వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ అత్యవసర వైద్య సహాయం ఏదీ అందించకుండా, సుమారు 5 గంటలకు పైగా ఆయనను పోలీస్ స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. లాయర్ అయిన ఆయన బంధువు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూడగా శరత్ కదమ్ నేలపై పడి ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. మాట తడబడటం పక్షవాతం లక్షణమని ఆయన ఎత్తిచూపినప్పటికీ, పోలీసులు దాన్ని లెక్కచేయకుండా మద్యం మత్తు అని వాదించారు. ఆ తర్వాత రాత్రి సమయంలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స అందించడంలో ఆలస్యం కావడంతో వృద్ధుడి కుడి వైపు భాగం చచ్చు పడిపోయింది. ఈ సంఘటనకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బి.జె.పి. ఎమ్మెల్యే అమిత్ సతమ్ పోలీస్ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జాతీయ క్రికెట్ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా కష్టపడుతున్న 17 ఏళ్ల యువ క్రికెటర్ అదితి మోరేశ్వర్ చౌఖాండే తీవ్ర మానసిక ఒత్తిడికి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ ఇటీవల విడుదల చేసిన సెలక్షన్ జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగ్‌పూర్ లక్ష్మీనగర్‌లోని తన నివాసంలో బుధవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న లక్ష్మీనగర్ పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, బాలిక రాసిన ఒక చేతిరాత సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో హిందీలో "మేరా సెలెక్షన్ నహీ హువా" (నేను ఎంపిక కాలేదు) అని రాసి ఉంది. రాత్రింబవళ్లు కష్టపడి శిక్షణ పొందినప్పటికీ విదర్భ క్రికెట్ జట్టు సెలక్షన్స్‌లో చోటు దక్కకపోవడం, తన పేరు జాబితాలో కనిపించకపోవడంతో ఆ బాలిక గత కొన్ని రోజులుగా తీవ్ర నిరాశలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు , పోలీసులు వెల్లడించారు. ఆ అపజయాన్ని తట్టుకోలేకనే ఈ దారుణమైన నిర్ణయానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన ఈ బాలికకు చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే విపరీతమైన ఆసక్తి. దేశవాళీ మ్యాచ్‌ల్లో, ఆపై అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనేది ఆమె ఏకైక ఆశయం. ఈ కలను సాకారం చేసుకోవడం కోసమే గత రెండేళ్లుగా ఆమె తన తల్లితో కలిసి అకోలా నుంచి నాగ్‌పూర్‌కు మకాం మార్చింది. నాగ్‌పూర్‌లోని ఒక ప్రముఖ క్రికెట్ అకాడమీలో చేరి రోజూ గంటల తరబడి కఠినమైన శిక్షణ పొందుతోంది. విశేషమేమిటంటే ఆమె సోదరుడు కూడా క్రికెటర్ కావడంతో, ఇంట్లోనూ ఆమెకు క్రికెట్‌పై పూర్తి ప్రోత్సాహం లభించింది. ఎంతో శ్రమించి ఆడినా ఆశించిన ఫలితం దక్కకపోవడంతో  మనసు విరిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు ప్రమాదవశాత్తు మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రికెట్ అకాడమీలోని శిక్షకులను, తోటి క్రీడాకారులను కూడా ప్రశ్నించి, ఆత్మహత్యకు గల పూర్తి కారణాలను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

తెలంగాణ ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 100 రోజుల్లో మొత్తం రూ. 6,000 కోట్ల బకాయిలను పూర్తిగా విడుదల చేసింది. తాజాగా మరో రూ.2 వేల కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో 100 రోజుల్లోనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు విడుదల చేసి మాట నిలబెట్టుకుంది. ఈ మేరకు రేవంత్ ప్రభుత్వం మూడు విడతల్లో ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లించింది. మొదటి విడతగా మే 29న రూ. 2,000 కోట్లు రిలీజ్ చేసింది. ఆ తర్వాత రెండో విడతగా జూన్ 30 న రూ.2,000 కోట్లు విడుదల చేయగా, తాజాగా మూడో విడతగా మరో రూ. 2,000 కోట్లను విడుదల చేసి ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఇక ఈ విడుదలతో విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌ లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలు పూర్తిగా చెల్లించబడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటకలోని బెంగళూరులో పెళ్లి, వివాహం, డబ్బు విషయంలో విభేదాలతో ఓ తండ్రి తన కూతురి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కర్కశంగా వ్యవహరించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో లక్ష్మీ దుర్గ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది.  ఆమె తండ్రి నాగేంద్ర క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల నాగేంద్ర తన కుమార్తె పెళ్లి కోసం ఒక సంబంధం ఖాయం చేశాడు. అయితే, కూతురి చదువు, కెరీర్ కోసం తాను భారీగా ఖర్చు చేశాననే నెపంతో వరుడి కుటుంబం నుండి రూ. 40 లక్షలు డిమాండ్ చేశాడు. అంతేకాకుండా లక్ష్మీ దుర్గ ప్రతి నెలా వచ్చే తన జీతం మొత్తాన్ని తనకే ఇవ్వాలని నాగేంద్ర ఒత్తిడి తెచ్చేవాడు. దీన్ని నాగేంద్ర భార్య, కుమార్తె లక్ష్మీ దుర్గ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీనికితోడు పెళ్లివారిని రూ. 40 లక్షలు ఎదురు కట్నం డిమాండ్‌ చేశాడు. దీన్ని లక్ష్మి తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆమె మీద పగబట్టి జూలై25 న కన్నకూతురిపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు. కుమార్తెను కలిసే నెపంతో కాలేజిలోని హెచ్ఓడి ఛాంబర్‌లో ఉన్న లక్ష్మీ దుర్గ వద్దకు వెళ్లిన నాగేంద్ర, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె కడుపు, ఛాతీ, మెడపై తీవ్రంగా పొడిచి అక్కడ నుండి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీ దుర్గ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దాడికి కుటుంబంలో దీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు నాగేంద్రను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఒక ప్రముఖ హోటల్‌లో, కొందరు స్నేహితులు కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నప్పుడు ఊహించని విధంగా ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అందులో ఒక యువకుడు గుడ్డు తింటున్నప్పుడు, అది ఊహించని విధంగా అతని గొంతులో చిక్కుకుంది. దీనివల్ల అతనికి ఊపిరి ఆడక, మాట్లాడటానికి కూడా వీలులేక తన గొంతు పట్టుకుని ప్రాణాలతో పోరాడటం ప్రారంభించాడు. హోటల్‌లో ఉన్నవారందరూ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే, ఆ యువకుడి ముఖంలో మార్పును, ఊపిరాడకపోవడాన్ని గమనించిన అతని స్నేహితుడు వెంటనే రంగంలోకి దిగి బాధితుడి వెనుక వైపుకు వెళ్ళి నిలబడి, 'హైమ్లిచ్ మేనూవర్' అని పిలిచే ప్రసిద్ధ ప్రథమ చికిత్స పద్ధతిని ఉపయోగించాడు. అంటే, బాధితుడి పొట్ట భాగాన్ని వెనుక నుండి గట్టిగా పట్టుకుని, పైకి బలంగా నొక్కి పటాడు. అతను ఇచ్చిన ఆ తక్షణ ఒత్తిడి కారణంగా, గొంతులో అడ్డుపడిన గుడ్డు ముక్క కొద్ది సెకన్లలోనే బయటకు వచ్చి పడింది. దీనితో మూసుకుపోయిన శ్వాసనాళం వెంటనే సరిగ్గా మారి, ఆ యువకుడు మళ్లీ సాధారణంగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించాడు.

పాకిస్థాన్ గతంలో తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు సౌదీ అరేబియా నుంచి భారీ మొత్తంలో ఆర్థిక సాయం పొందిన సంగతి తెలిసిందే. 5 బిలియన్ డాలర్ల డిపాజిట్లను మూడేళ్లపాటు పొడిగిస్తూ సౌదీ కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ ధ్రువీకరించారు. ఇది దేశంలోని ఆర్థిక విధానాన్ని మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిలో సౌదీ పాత్రపై పార్లమెంట్ ఆవరణలో స్పందించారు. సౌదీ అరేబియాకు రుణాన్ని పాకిస్థాన్ ఇప్పట్లో చెల్లించే అవకాశం లేదని స్పష్టం చేశారు. డెడ్ లైన్ ను మరో మూడేళ్లపాటు పొడిగింపు చేస్తున్నట్లు సౌదీ ప్రకటన చేసిందని అన్నారు. "వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం కారణంగా పాకిస్థాన్ విదేశీ రుణ చెల్లింపుల భారం 2024-25 ఆర్థిక సంవత్సరంలోని దాదాపు 26.5 బిలియన్ డాలర్ల నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ 21.5 బిలియన్ డాలర్లకు గణనీయంగా తగ్గింది. ఈ మొత్తం 21.5 బిలియన్ డాలర్లలో దాదాపు 3.5 బిలియన్ డాలర్లను ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపుల కోసం కేటాయించే అవకాశం ఉంది" అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ జమీల్ అహ్మద్ స్పష్టం చేశారు. మొత్తం రుణాల్లో 12 బిలియన్ డాలర్లు సెంట్రల్ బ్యాంక్ లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయని, అలాగే మరో 3 బిలియన్ డాలర్లు రీఫైనాన్స్ అవకాశం ఉన్న వాణిజ్య రుణాలను కలిగి ఉన్నాయి. మిగిలిన 7 బిలియన్ డాలర్లు విదేశీ రుణాలుగా ఉన్నాయని జమీల్ అహ్మద్ పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ డేటా ఆధారంగా పాకిస్థాన్ లో విదేశీ మారక నిల్వలు 17.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అలాగే మొత్తం విదేశీ మారక నిల్వలు 22.6 బిలియన్ డాలర్లలో 17.2 బిలియన్ డాలర్లు స్టేట్ బ్యాంక్ లోని విదేశీ మారక నిల్వలు కాగా 5.4 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు కమర్షియల్ బ్యాంక్ ల వద్ద ఉన్నాయి. ఇక సౌదీ అరేబియా వరుసగా మూడోసారి రీఫండ్ ను పోస్ట్ పోన్ చేయడంపై పాకిస్థాన్ పార్లమెంట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్ లోని రైతులు కనీస మద్దతు ధర, సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. పెసలు పంటను 100 శాతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని చేపట్టిన నిరసలను ఎట్టకేలకు విరమించారు. ఈ ఉద్యమంలో జెన్ జీ యూత్ పాల్గొనడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్న ఆందోళనల నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం రైతుల డిమాండ్స్ ను అంగీకరించింది. అర్హులైన రైతుల నుంచి కొనుగోలు చేసే పెసర పంట పరిమితిని 60 శాతానికి పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కొనుగోళ్ల గడువును పొడిగించేందుకు, ఎరువుల పంపిణీలో అమల్లో ఉన్న ఈ- టోకెన్ వ్యవస్థను నిలిపివేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌ కేఎం)తో పాటు పలు రైతు సంఘాల నాయకులతో ప్రభుత్వ యంత్రాంగం సెక్రటేరియట్ లో చర్చలు జరిపింది. చర్చల అనంతరం రైతుల డిమాండ్స్ ను అంగీకరిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. అంతకుముందు వేలాదిమంది నిరసనకారులు, రైతులు మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అధికారిక నివాసం వైపు దూసుకొచ్చారు. అంతకుముందు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారిక నివాసం ముందు కూడా ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిదల్ సింగ్ కాన్ సనా మాట్లాడుతూ.. ఈ టోకెన్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవస్థను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే ఎరువులు తగినంతగా అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అయితే గత కొద్ది రోజులుగా రైతు ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. సంయుక్తా కిసాన్ మోర్చాతో పాటు 18 రైతు సంఘాలు రాష్ట్రంలోని ప్రధాన రహదారుల్ని బ్లాక్ చేశారు. ఈ క్రమంలో జూలై 28న ప్రభుత్వం- రైతు సంఘాల నాయకుల మధ్య జరిగిన తొలి దశ చర్చలు విఫలం అయ్యాయి. అలాగే అనేకమంది జెన్ జీ మద్దతుదారులు రైతు ఉద్యమం వద్దకు వచ్చి తమ మద్దతును ప్రకటించారు. ఇక రైతుల తీవ్ర నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయిత్ తో దిల్లీలో భేటీ అయ్యారు. రైతులు, విద్యార్థులు, యువకుల కోసం ఓ జాయింట్ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

భారతదేశం పైభాగంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇప్పుడు పశ్చిమ దిశగా వేగంగా కదులుతోంది. దీనికి తోడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల నుంచి పెద్దెత్తున తేమ గాలులు వచ్చి చేరుతుండటంతో వర్షాలు ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో పలు రాష్ట్రాల్లో ముసురు పట్టడంతో పాటు తుఫానును తలపించేలా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని  భారత వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం ఈ డీప్ డిప్రెషన్ ప్రభావం ప్రధానంగా పశ్చిమ, మధ్య భారత భూభాగాలపై గట్టిగా ఉండబోతోంది. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, మరాఠ్వాడాలోని కొన్ని  ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు హఠాత్ పూరిత వరదలు  వచ్చే ప్రమాదం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. సాధారణ అల్పపీడనం కంటే తీవ్రమైనది, తుఫాను కంటే కొద్దిగా తక్కువ స్థాయి కలిగిన వాతావరణ పరిణామాన్ని 'డీప్ డిప్రెషన్'గా వ్యవహరిస్తారు. ఇది సముద్రం లేదా భూభాగంపై వేగంగా వర్ష మేఘాలను కూడగడుతుంది. వేడి, తేమతో కూడిన గాలులు పైకి లేచి చల్లబడటం ద్వారా ఆకాశం నిండా భారీ వర్ష మేఘాలు దట్టంగా అలుముకుంటాయి. దీని కారణంగా ఒక్కసారిగా ఒకే ప్రాంతంలో గంటల తరబడి ఆగకుండా వర్షం కురుస్తుంది.

అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలను "పాకిస్థాన్ కశ్మీర్"గా పేర్కొనడాన్ని భారత ప్రభుత్వం తప్పుదారి పట్టించే వ్యాఖ్యగా అభివర్ణించింది. న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో "స్థానిక ఎన్నికలు ప్రారంభం కావడంతో పాకిస్థాన్ కశ్మీర్‌లో హింస చెలరేగింది" అనే భావంతో శీర్షిక ఇచ్చింది. దీనిపై స్పందించిన భారత రాయబార కార్యాలయం.. "పాకిస్థాన్ కశ్మీర్ అనే భౌగోళిక ప్రాంతం అసలు లేదు. అది చట్టవిరుద్ధంగా పాకిస్థాన్ ఆక్రమించిన భారత భూభాగం మాత్రమే" అని స్పష్టం చేసింది. జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, వాటిలోని కొన్ని ప్రాంతాలను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించి ఉంచిందని పేర్కొంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎన్నికలను వ్యతిరేకిస్తూ నిరసనకారులు వీధుల్లోకి రావడంతో భద్రతా దళాలతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. స్థానిక మీడియా కథనాల ప్రకారం మరణాల సంఖ్య 40కు చేరినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బంధువుల మృతదేహాలను భద్రతా బలగాలు అప్పగించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, పెద్దఎత్తున అంతిమయాత్రలు నిర్వహించకుండా అధికారులు ఆంక్షలు విధించినట్లు సమాచారం. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ చర్యలు స్థానికంగా మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలు చాలా కాలంగా జీవన వ్యయం పెరగడం, పాలనలో పారదర్శకత లేకపోవడం, రాజకీయ వివక్ష, ప్రాథమిక సౌకర్యాల కొరత వంటి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యమాలకు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వం వహిస్తోంది. ప్రజల డిమాండ్లను పరిష్కరించకుండా అణిచివేత చర్యలకు పాల్పడుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహిస్తున్న ఎన్నికలను భారత్ గతంలోనే తిరస్కరించింది. భారత విదేశాంగ శాఖ ప్రకారం, అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా వాస్తవ పరిస్థితులను మార్చలేరు. అలాగే, ఆ ప్రాంతంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు పాకిస్థాన్ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని భారత్ ఆరోపించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత సార్వభౌమాధికారం ఎప్పటికీ యథాతథంగానే ఉంటుందని మరోసారి స్పష్టం చేసింది.

దేశంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు జరగనుంది. న్యూఢిల్లీలో నిర్వహించే ఈ మెగా సమావేశానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. దాదాపు ఐదేళ్ల తర్వాత భారత్ ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చే ఈ ముగ్గురు అగ్ర నేతలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2019 అక్టోబర్‌లో తమిళనాడులోని మామల్లపురంలో మోడీతో భేటీ అయిన తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి సైనిక ఘర్షణల తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, 2024 అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరిగిన సదస్సులో మోదీ, జిన్‌పింగ్ చర్చలు జరిపి ఉద్రిక్తతలకు ముగింపు పలికారు. తాజాగా ఢిల్లీ సదస్సులో పశ్చిమాసియా పరిస్థితులు ప్రధాన అజెండాగా మారనున్నాయి. "స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం" అనే థీమ్‌తో ఈసారి సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న పోరు నేపథ్యంలో ఇరాన్, యూఏఈ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. జనవరి 2024లో బ్రిక్స్ కూటమి విస్తరణలో భాగంగా ఈ రెండు దేశాలు సభ్యత్వం పొందాయి. పాలస్తీనా సమస్య, టూ-స్టేట్ సొల్యూషన్‌పై అధికారిక పత్రాల్లో కఠిన పదజాలాన్ని తగ్గించడాన్ని యూఏఈ మినహా మిగిలిన అన్ని దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్, యూఏఈ మధ్య పెరుగుతున్న విభేదాలను తగ్గించేందుకు భారత్ కీలక పాత్ర పోషించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్.. ప్రధాని మోదీతో జరిపే భేటీలో పశ్చిమాసియా పరిస్థితులను వివరించనున్నారు. మే 2019లో అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసింది. ఈ ఆంక్షల ప్రభావం గత ఏడాది చాబహార్ పోర్టు ప్రాజెక్టుపై కూడా పడింది. తాజా చర్చలతో రెండు దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం కానుందని అంచనా వేస్తున్నారు. బ్రిక్స్ సభ్య దేశాల నేతలతో పాటు ఇతర దేశాల ప్రతినిధులను కూడా భారత్ ఆహ్వానించింది. బిమ్స్‌టెక్ ప్రస్తుత చైర్మన్ హోదాలో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత మే నెలలో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశం ఎలాంటి ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. ఈ పరిస్థితుల్లో తాజా బ్రిక్స్ సదస్సు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కేంద్ర ప్రభుత్వాన్ని సీజేపీ ఫౌండర్ అభిజిత్ దిప్కే తీవ్రస్థాయిలో హెచ్చరించారు. విద్యార్థుల నిరసనలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో వీడియోలు చాలా బాగా చేస్తున్నారు. ఆయనకు అంతగా ఆసక్తి ఉంటే ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా స్థిరపడవచ్చు" అని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పబ్లిసిటీకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థుల పట్ల పోలీసులు మరియు ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని అభిజిత్ మండిపడ్డారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పోలీసులు అరెస్టు చేస్తామని బెదిరింపులకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థులేమైనా దేశద్రోహులా లేక ఉగ్రవాదులా? ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఈనాటి విద్యార్థులే. అలాంటి వారిపై పోలీసులు వేధింపులకు పాల్పడటం అత్యంత దారుణమన్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ తుపాకులు ఉపయోగించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన…విద్యార్థులపై ఇటువంటి బలప్రయోగానికి మరియు పెల్లెట్ తుపాకులు వాడటానికి అనుమతి ఇచ్చిన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

అత్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పోలీసులు పెల్లెట్‌ గన్స్‌ను ఉపయోగించడంలో తప్పేం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే పెల్లెట్ గన్స్‌ను పూర్తిగా బ్యాన్ చేయాలన్న డిమాండ్‌ను కోర్టు అంగీకరించలేదు. బదులుగా, అసాధారణ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాటి వినియోగం సమంజసమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే జూలై 20న జంతర్‌మంతర్‌లో విధుల్లో ఉన్న ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ ఉపయోగించిన మందుగుండు సామగ్రికి సంబంధించిన పూర్తి రికార్డును భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో నిరసనల్లో గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. పెల్లెట్‌ గన్స్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని మాజీ ఐపీఎస్‌ అధికారి యశోవర్ధన్‌ ఆజాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. నిరసనలు హింసాత్మకంగా మారి, దుండగులు చొరబడి పరిస్థితి అదుపు తప్పినప్పుడు పోలీసులు చట్టబద్ధంగా బలప్రయోగం చేయాల్సి వస్తుందని పేర్కొంది. లాఠీచార్జ్‌, టియర్‌ గ్యాస్‌ వంటి చర్యలు ఫలించకపోతే, అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో పోలీసులు బుల్లెట్లను కూడా ఉపయోగించేందుకు చట్టం అవకాశం ఇస్తుందని.. అలాంటప్పుడు ప్రాణాంతకం కాని (Non-lethal) పెల్లెట్‌ గన్స్‌ను పూర్తిగా నిషేధించాలని ఎలా చెప్పగలమని ధర్మాసనం ప్రశ్నించింది. అదే సమయంలో.. వాటి వినియోగంపై స్పష్టమైన ప్రోటోకాల్‌ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయమూ వ్యక్తం చేసింది. నిరసనల సమయంలో ఎవరైనా గాయపడితే వారికి తక్షణమే నాణ్యమైన వైద్య చికిత్స అందించడం ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జంతర్‌ మంతర్‌ ఘటనలో గాయపడిన నిరసనకారులందరికీ అవసరమైన వైద్య సేవలు అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

విదేశాల నుంచి దిగుమతి అయ్యే కొత్త వెర్షన్ హ్యూమనాయిడ్ రోబోలు, రోబో డాగ్స్ మరియు పవర్ ఇన్వర్టర్లపై అమెరికా టెలికామ్ రెగ్యులేటరీ సంస్థ అయిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ పూర్తి స్థాయి నిషేధాన్ని ప్రకటించింది. అత్యంత కీలకమైన అమెరికా సప్లై చైన్ వ్యవస్థను సురక్షితంగా ఉంచడం, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను సైబర్ దాడుల నుండి కాపాడుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని FCC ఛైర్‌పర్సన్ బ్రెండన్ కార్ స్పష్టం చేశారు.ఈ నిషేధ ఆంక్షలు పరికరాల యొక్క నూతన (కొత్త) వెర్షన్ దిగుమతులకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్‌లో దాదాపు 85% వాటాతో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. చైనాకు చెందిన 'యూనిట్రీ', 'ఏజీఐబాట్' వంటి సంస్థలు వేల సంఖ్యలో రోబోలను తయారుచేస్తుండగా, అమెరికాకు చెందిన టెస్లా, ఫిగర్ ఏఐ వంటి కంపెనీల ఉత్పత్తి వందల సంఖ్యలోనే ఉంది. ఈ నిషేధం ద్వారా అమెరికా తన స్థానిక డెవలపర్లకు మద్దతుగా నిలుస్తోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్లు, అధునాతన సాంకేతికతల ఎగుమతిపై ఆంక్షలు విధించిన అమెరికా, భవిష్యత్తులో చైనాకు చెందిన ఓపెన్-సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్ల వినియోగాన్ని కూడా నిరోధించే దిశగా ఆలోచిస్తోంది. డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు మరియు గృహోపకరణాలలో ఉపయోగించే పవర్ ఇన్వర్టర్ల నూతన దిగుమతులపై కూడా నిషేధం పడింది. వరల్డ్ టెక్నాలజీ రంగంలో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశమైంది.

రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు, ఫ్లాట్లు విక్రయించే సమయంలో క్లబ్‌హౌస్‌లు, ఇతర సదుపాయాల పేరిట వినియోగదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత వాటిని నిర్మించకుండా కాలయాపన చేసే బిల్డర్లకు రేరా గట్టి షాక్ ఇచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న క్లబ్‌హౌస్ వంటి సదుపాయాలను నిర్ణీత లేదా సహేతుకమైన సమయంలోగా నిర్మించి అందుబాటులోకి తేకపోతే, దానికి సంబంధించి కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన రుసుమును వారికి వెనక్కి తిరిగి ఇచ్చేయాలని అత్యంత కీలకమైన, ఉపశమనం కలిగించే తీర్పును వెలువరించింది. ముంబైకి చెందిన ఒక వినియోగదారుడు 2019 అక్టోబరులోనే తన ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అయితే, బిల్డర్ క్లబ్‌హౌస్ సదుపాయం కల్పిస్తానని చెప్పి ఫ్లాట్ కొనుగోలుదారుడి నుంచి రూ. 5 లక్షలు వసూలు చేశారు. ఫ్లాట్ ఇచ్చి ఆరేళ్లకు పైగా గడుస్తున్నా క్లబ్‌హౌస్ నిర్మాణం చేపట్టకపోవడంతో బాధితుడు మహారేరాను ఆశ్రయించాడు. బిల్డర్ తన నుంచి డబ్బులు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా క్లబ్‌హౌస్ అందుబాటులోకి తేలేదని, మెంబర్‌షిప్ హక్కులు ఇవ్వలేదని, కాబట్టి వడ్డీతో సహా తన డబ్బులు రీఫండ్ ఇప్పించాలని కోరాడు. దీనిపై బిల్డర్ వాదిస్తూ ఇది ఒక పెద్ద రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అని, క్లబ్‌హౌస్ అనేది మొత్తం లేఅవుట్‌కు సంబంధించిన ఉమ్మడి సదుపాయమని పేర్కొన్నాడు. బస్ డిపో తరలింపు, ప్రభుత్వ అనుమతుల వల్ల ఆలస్యమైందే తప్ప నిర్మాణం ఆపేయలేదని, ఒప్పందం ప్రకారం పూర్తి కాకపోతే డబ్బులు వెనక్కి ఇస్తామని తెలిపాడు. ఇరు వర్గాల వాదనలు విన్న మహారేరా.. సేల్ అగ్రిమెంట్‌లో క్లబ్‌హౌస్ నిర్మాణానికి నిర్దిష్టమైన ముగింపు తేదీ లేనప్పటికీ, సహేతుకమైన వ్యవధిలో దాన్ని అందుబాటులోకి తేకపోతే వినియోగదారునికి డబ్బులు రీఫండ్ పొందే హక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. క్లబ్‌హౌస్ మెంబర్‌షిప్ కోసం వసూలు చేసిన రూ. 5 లక్షలను 60 రోజుల్లోగా సదరు కొనుగోలుదారునికి తిరిగి చెల్లించాలని బిల్డర్‌ను ఆదేశించింది. అయితే, ఒప్పందంలో వడ్డీ లేని రీఫండ్ నిబంధన ఉన్నందున వడ్డీని మినహాయించింది.

అస్సాంలో వరదలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. శివసాగర్, గోలాఘాట్ జిల్లాల్లో తాజాగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఏడాది వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 78కి చేరుకుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన తాజా హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఇప్పటికీ 3 లక్షల మందికి పైగా ప్రజలు వరద నీటిలోనే చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం శివసాగర్, చరైడియో, గోలాఘాట్, జోర్హాట్, నగావ్, బిశ్వనాథ్ , కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. మొత్తం 21 రెవెన్యూ సర్కిళ్లు, 551 గ్రామాలు నీట మునిగాయి. సుమారు 21,523 హెక్టార్ల పంట పొలాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బాధిత జిల్లాల్లో చరైడియో అత్యంత తీవ్రంగా దెబ్బతింది, ఇక్కడ ఒక్క జిల్లాలోనే 1.37 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాతి స్థానాల్లో శివసాగర్ (84,600 మంది), జోర్హాట్ (49,911 మంది) ఉన్నాయి. మంగళవారంతో పోలిస్తే బాధితుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. వరద బాధితుల కోసం ప్రభుత్వం భారీగా సహాయక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 71 పునరావాస కేంద్రాలలో 16,500 మందికి పైగా వసతి పొందుతుండగా, మరో 72,000 మందికి 30 సహాయ పంపిణీ కేంద్రాల ద్వారా ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నారు. మెడికల్, వెటర్నరీ టీమ్‌లతో పాటు వివిధ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇక ఈ వరదల ధాటికి రహదారులు, ఇళ్లు, పాఠశాలలు ధ్వంసమవ్వడమే కాకుండా, 11,000 కంటే ఎక్కువ పశువులు కొట్టుకుపోయాయి.

3