అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026, ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సేల్ స్టార్టింగ్ డేట్ మాత్రమే అమెజాన్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ ఎన్ని రోజులు కొనసాగుతుంది మరియు ఈ సేల్ ఆఖరి తేదీ అప్‌డేట్ ఇంకా రివీల్ చేయలేదు. ఈ సేల్ కోసం HDFC బ్యాంక్ ని ప్రత్యేకమైన బ్యాంక్ పార్టనర్ గా ప్రకటించింది. కాబట్టి, ఈ సేల్ నుంచి ఈ బ్యాంక్ కార్డ్స్ తో వస్తువులు కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా ఈ అప్ కమింగ్ సేల్ నుండి No Cost EMI మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్స్ వంటి మరిన్ని ఆకట్టుకునే డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి చాలా ప్రొడక్ట్స్ ను మంచి ఆఫర్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, సౌండ్ బార్, టాబ్లెట్ మరియు స్మార్ట్ వాచ్ వంటి ప్రొడక్ట్స్ పై గొప్ప డీల్స్ మరియు ఆఫర్లు అందించే అవకాశం ఉంది. 15 ఆగస్టు 2026 స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా మీకు నచ్చిన వారికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ సేల్ నుంచి మీకోసం గొప్ప డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా TWS ఇయర్ బడ్స్, వాషింగ్ మెషిన్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా మీకు అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరల్లో లభిస్తాయి. కేవలం ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాదు, ఇంటి డెకరేషన్ కి అవసరమైన డెకరేషన్ ఐటమ్స్, ఫ్యాషన్ మరియు మరిన్ని ప్రొడక్ట్స్ పైన కూడా గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందుకునే అవకాశం అమెజాన్ మీకు అందిస్తుంది. గత సంవత్సరం అమెజాన్ నిర్వహించిన గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి మరియు రీసెంట్ సేల్ ను బట్టి చూస్తే, ఈ సంవత్సరం సౌండ్ బార్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ మరియు ఫ్యాషన్ ఐటమ్స్ చాలా మంచి ఆఫర్ ధరలో లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 7 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్
July 27, 2026
0
Tags