ఐఐటీ విద్యార్థికి కేటీఆర్ ల్యాప్‌టాప్ ను బహుకరించిన కేటీఆర్ :కళాశాల ఫీజును కూడా తానే భరిస్తానని హామీ

ఐటీ (బీహెచ్‌యూ) వారణాసిలో సీటు సాధించిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గడదాస్ అభినవ్‌ను హైదరాబాద్‌లో తన నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు సత్కరించారు. అభినవ్ తన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, శ్రీలతలతో కలిసి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థికి శాలువా కప్పి అభినందించిన కేటీఆర్, 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమం ద్వారా ల్యాప్‌టాప్‌ను బహుకరించారు. అంతేకాకుండా, అభినవ్ కళాశాల ఫీజును కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యను పూర్తి చేసి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థికి సూచించారు. కేటీఆర్ అందించిన ప్రోత్సాహానికి అభినవ్, ఆయన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, శ్రీలత కృతజ్ఞతలు తెలిపారు. తమ విద్యాభ్యాసానికి అందించిన సహకారాన్ని జీవితాంతం మరిచిపోలేమని పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments