Ad Code

పచ్చి బొప్పాయి - ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చి బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఫైబర్ మరియు పపైన్, కైమోపాపైన్ వంటి ప్రత్యేక ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి రక్తంలో పేరుకుపోయిన అదనపు యూరిక్ యాసిడ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇక దీనివల్ల కీళ్లలో మంట, వాపు తగ్గడమే కాకుండా స్ఫటికాలు (క్రిస్టల్స్) పేరుకుపోకుండా నిరోధిస్తుంది. దీనిలోని ‘పపైన్’ అనే ఎంజైమ్ మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచడంతో పాటు తీవ్రమైన మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.  బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి బొప్పాయి ఒక మంచి ఆహారం. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉండి, పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. ఇక దీన్ని తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండిన భావన కలిగి, అనవసరమైన ఆకలిని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి రకరకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. అంతేకాకుండా, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, శరీరంలో ఎక్కడైనా వచ్చే మంట లేదా వాపును తగ్గించడానికి ఇది బాగా సహాయపడుతుంది.


Post a Comment

0 Comments

Close Menu