మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్ ఎమ్‌ఐడీసీ రోడ్డుపై ఒక లారీ ఘోర ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న బ్రిడ్జిని బలంగా ఢీకొడుతూ నేరుగా కిందకు పడిపోయింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బ్రిడ్జి పైనుంచి కిందకు బోల్తా పడిన లారీ తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. లారీ వేగంగా వచ్చి కంట్రోల్ తప్పి వంతెన పైనుంచి కిందకు పడిపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని, ప్రమాదంలో గాయపడిన లారీ డ్రైవర్ ను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
0 Comments