మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై వీడియో రిలీజ్ చేసి ఇజ్రాయెల్ మీడియాకు చెక్ పెట్టిన ఇరాన్
ఇ రాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ అనారోగ్యంతో ఉన్నారని, ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు ఇరాన్ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇజ్రాయెల్ మీడియాలో మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం గురించి కథనాలు ప్రచురితమయ్యాయి. ఆయనకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఆయన ఇక కోలుకునే పరిస్థితి లేడు,త్వరలో ఆయన మరణ వార్త విన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఆ కథనాల్లో పేర్కొంది. ఇజ్రాయెల్ కథనాలకు కౌంటర్ ఇస్తూ ఇరాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని మెహర్ న్యూస్ ఏజెన్సీ మోజ్తాబా ఖమేనీకి సంబంధించిన కొత్త వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో 12 సెకన్ల నిడివితో ఉంది. అందులో మోజ్తాబా ఖమేనీ కొందరితో మాట్లాడుతు కనిపించారు. ఈ వీడియోలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ వీడియో ఎప్పుడు తీసింది అనే విషయంపై ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఆయన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన అనంతరం మోజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించలేదు. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో మోజ్తబాకు ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు గతంలో వార్తలు వచ్చాయి. దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. మొజ్...