మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై వీడియో రిలీజ్ చేసి ఇజ్రాయెల్ మీడియాకు చెక్ పెట్టిన ఇరాన్

రాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ అనారోగ్యంతో ఉన్నారని, ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు ఇరాన్ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇజ్రాయెల్ మీడియాలో మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం గురించి కథనాలు ప్రచురితమయ్యాయి. ఆయనకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఆయన ఇక కోలుకునే పరిస్థితి లేడు,త్వరలో ఆయన మరణ వార్త విన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఆ కథనాల్లో పేర్కొంది. ఇజ్రాయెల్ కథనాలకు కౌంటర్ ఇస్తూ ఇరాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని మెహర్ న్యూస్ ఏజెన్సీ మోజ్తాబా ఖమేనీకి సంబంధించిన కొత్త వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో 12 సెకన్ల నిడివితో ఉంది. అందులో మోజ్తాబా ఖమేనీ కొందరితో మాట్లాడుతు కనిపించారు. ఈ వీడియోలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ వీడియో ఎప్పుడు తీసింది అనే విషయంపై ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఆయన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన అనంతరం మోజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించలేదు. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో మోజ్తబాకు ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు గతంలో వార్తలు వచ్చాయి. దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. మొజ్తాబా ఖమేనీ గుర్తుపట్టలేని రీతిలో తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఇక ఆయన 90శాతం చనిపోయినట్లేననన్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు రకాల ఊహాగానాలు వెల్లడవుతూ వస్తున్నాయి. మోజ్తబా ఖమేనీ మార్చి 8న ఇరాన్ మూడో సుప్రీం లీడర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ప్రభుత్వ మీడియా ద్వారా ఆయన పలు లిఖితపూర్వక ప్రకటనలు విడుదల చేసినప్పటికీ, ఆయన స్వయంగా వీడియో లేదా ఆడియో సందేశం విడుదల చేయలేదు. ఆయన తండ్రి అంత్యక్రియలకు కూడా బహిరంగంగా హాజరుకాలేదు. ఇదిలా ఉండగా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇటీవల మోజ్తబాతో ప్రస్తుతం సంప్రదింపులు జరపడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. అయితే ఆయనతో సమావేశాలు జరిగాయని, మోజ్తబా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేసి ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా పెజెష్కియాన్ పేర్కొన్నారు. మరోవైపు, గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోజ్తబా ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ మీడియా సంస్థ కూడా ఆయన ఆరోగ్యం బాగోలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ విడుదల చేసిన తాజా వీడియో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వీడియో పాతదా, కొత్తదా అన్నదానిపై ఇరాన్ స్పష్టత ఇవ్వలేదు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం