Posts

Showing posts with the label Best Actress Aishwarya Rajesh

సైమా అవార్డ్స్ 2026 - ఉత్తమ నటుడు తేజా సజ్జా, ఉత్తమ నటి ఐశ్వర్య రాజేశ్

Image
బెం గళూరులో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ -2026 ప్రదానోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్థానిక కోరమంగళ ఇండోర్‌ స్టేడియంలో కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకకు దక్షిణాదికి చెందిన అగ్ర సినీ తారలు, దిగ్గజ దర్శకులు, సాంకేతిక నిపుణులు విచ్చేసి సందడి చేశారు. రెండు రోజుల పాటు సాగే ఈ సినీ ఉత్సవాల్లో భాగంగా, తొలిరోజు తెలుగు, కన్నడ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు. తారల తళుకుబెళుకులు, వినోదభరితమైన నృత్య ప్రదర్శనల మధ్య ఈ అవార్డుల వేడుక అట్టహాసంగా సాగింది. తెలుగు యువ కథానాయకుడు తేజ సజ్జా.. 'మిరాయ్‌' చిత్రంలో కనబరిచిన అద్భుత నటనకు గానూ 'ఉత్తమ నటుడు' అవార్డును కైవసం చేసుకున్నారు. విశేషమేమిటంటే, ఈ సినిమా విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా తేజ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడం విశేషం. అలాగే, విభిన్న కథాంశంతో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో అద్భుతమైన భావోద్వేగాలను పండించిన ఐశ్వర్య రాజేశ్ 'ఉత్తమ నటి (క్రిటిక్స్)' పురస్కారాన్ని అందుకున్నారు. అదే చిత్రం నుంచి బుల్లిరాజు అలియాస్ భీమల రేవంత్ ఉత్తమ హాస్యన...