అమిత్ షాకు పంట నష్టంపై నివేదికను అందజేసిన మంత్రులు లోకేశ్, అనిత
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఆంధ్రప్రదేశ్ మంత్రులు లోకేశ్, అనిత మొంథా తుపాను కారణంగా పంట నష్టంపై నివేదికను అందజేశారు. పార్లమెంట్ హాల్లోని అమిత్ షా ఛాంబర్లో జరిగిన సమావేశంలో లోకేశ్, అనితతోపాటు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. మొంథా తుపాను వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. మొత్తం 3,109 గ్రామాలు తుపాను వల్ల ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా ఏపీ ప్రభుత్వం తరఫున రూ.3 వేలు అందించామని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1302 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. మొత్తం రూ.6,352 కోట్ల నష్టంలో ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ.902 ...