ఏఎన్‌ఐ కాపీరైట్ కంటెంట్‌ను వినియోగించినందుకు ఓపెన్‌ఏఐపై దాఖలైన కేసు : అది కాపీరైట్ ఉల్లంఘన కాదన్న ఢిల్లీ కోర్టు
ప్ర ముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ కాపీరైట్ కంటెంట్‌ను వినియోగించినందుకు ఓపెన్‌ఏఐపై దాఖలైన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏఎన్‌ఐ వార్తలను చాట్‌జీపీటీ శిక్షణ కోసం ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కాదని కోర్టు స్పష్టం చేసింది. కృత్రిమ మేధ మోడళ్ల శిక్షణ కోసం కాపీరైట్ ఉన్న వార్తా కంటెంట్ వినియోగంపై భారతదేశంలో వెలువడిన తొలి కీలక న్యాయ తీర్పుగా ఇది నిలిచింది. జస్టిస్ అమిత్ బన్సాల్ ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ చాట్‌జీపీటీ ఏఎన్‌ఐ వార్తలను గుర్తుంచుకుని యథాతథంగా వినియోగదారులకు తిరిగి అందిస్తోందని ఏఎన్‌ఐ నిరూపించలేకపోయిందని పేర్కొంది. అందువల్ల ఓపెన్‌ఏఐపై కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు నిలబడవని స్పష్టం చేసింది. ఏఎన్‌ఐ వార్తలను ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు నిల్వ చేయడం కాపీరైట్ చట్టంలోని 'ఫెయిర్ డీలింగ్' మినహాయింపులో భాగంగా పరిగణించవచ్చని కోర్టు అభిప్రాయపడింది. పరిశోధన ప్రయోజనాల కోసం కంటెంట్‌ను వినియోగించడం చట్టబద్ధమేనని, అందువల్ల ఈ చర్య కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని న్యాయస్థానం పేర్కొంది. 2024 నవంబర్‌లో ఏఎన్‌ఐ ఢిల్లీ హైకోర్టులో ఓపెన్‌ఏఐపై కాపీరైట్ దావా వేసింది. తమ అనుమతి లేకుండానే ప్రచుర...