Posts

Showing posts with the label Chandrababu Naidu 76th Birth Day

అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం విరాళాన్ని అందజేసిన భువనేశ్వరి : ఏప్రిల్ 20న అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం

Image
ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, నారా భువనేశ్వరి ఒక వినూత్నమైన , మానవీయమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, సమాజంలోని నిరుపేదల ఆకలి తీర్చడమే పరమావధిగా భావించి ఆమె అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తంతో చంద్రబాబు పుట్టినరోజైన ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో లక్షలాది మంది పేదలకు, రోజువారీ కూలీలకు పూర్తి ఉచితంగా భోజనాన్ని అందించనున్నారు. అన్న క్యాంటీన్లు పేదల పాలిట కల్పవృక్షాలని, ఇవి కేవలం భోజనశాలలు మాత్రమే కాదని, అన్నం పెట్టే అమ్మ ను తలపిస్తున్నాయని ప్రశంసించారు. కేవలం రూ.5 లకే అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో, గౌరవప్రదంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. తమ మనవడు దేవాన్ష్ పుట్టినరోజున కూడా తిరుమల అన్నప్రసాదానికి విరాళం ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని, ఇప్పుడు చంద్రబాబు పుట్టినరోజున ఈ సేవలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. భువనేశ్వరి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి...