ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర బృందం భేటీ !
ఆం ధ్రప్రదేశ్ లో మొంథా తుపాను కారణంగా సంభవించిన నష్టంపై సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలోని కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఈ సమావేశం జరిగింది. తుపాను ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర బృందం ముఖ్యమంత్రికి వివరాలు అందించగా రాష్ట్రానికి అవసరమైన తక్షణ ఆర్థిక సహాయం, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో సందర్శించి నష్టాన్ని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఓ మధ్యంతర నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో మొత్తం రూ.5,267 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. రాష్ట్రంలోని 443 మండలాల్లోని 3,109 గ్రామాలు ఈ తుపాను కారణంగా ప్రభావితమయ్యాయని ప్రభుత్వం పేర్కొం...