Posts

Showing posts with the label 'ఫ్లాష్' అని నామకరణం చేశారు

ఆకలిని నియంత్రించే క్యాప్సూల్ ?

Image
వైద్య చరిత్రలో మరో సరికొత్త ఆవిష్కరణ జరిగింది. ఆకలిని నియంత్రించే క్యాప్సూల్‌ని పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటివరకు ఆకలిని కంట్రోల్‌లో ఉంచడానికి హానికర విధానాలను అవలంబించాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఈ సమస్య ఉండబోదు. శరీరానికి ఎలాంటి హాని కలగకుండా ఆకలిని నియంత్రించేలా పరిశోధకులు క్యాప్సూల్‌ని తయారు చేశారు. సమీప భవిష్యత్తులోనే ఈ క్యాప్సూల్‌ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అబుదాబిలోని ఎన్‌వై యూనివర్సిటీ పరిశోధకుల బృందం తొలి సారిగా ఈ క్యాప్సూల్‌ని తయారు చేసింది. సాధారణంగా మనకు ఆకలి వేస్తే మెదడు సిగ్నల్స్ పంపుతుంది. ఈ సందర్భంగా కొన్ని హార్మోన్‌లను జనరేట్ చేస్తుంది. ఇలా హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రణలో ఉంచేలా మెదడుకు ఈ ఎలక్ట్రోస్యూటికల్ డివైజ్ సూచనలు పంపుతుంది. ఆకలి స్థాయిలను నియంత్రణలో ఉంచడంతో పాటు మెటబాలిక్, న్యూరోలాజికల్ వ్యాధులకు చికిత్స చేసేందుకు ఈ ఆవిష్కరణ మార్గం సుగమం చేయనుంది. మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలతో కలిసి అబుదాబి పరిశోధకులు ఈ క్యాప్సూల్‌ని డెవలప్ చేశారు. దీనికి 'ఫ్లాష్' అని నామకరణం చేశారు. నీటిలో కరిగిపోకుండా ఉండేలా ఈ క్యాప్సూల్‌ ఉపరితలా...