సోకిలేరు వాగులో కొట్టుకుపోయిన విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీలేష్
ఆం ధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని పర్యాటక ప్రాంతమైన సోకిలేరు వ్యూ పాయింట్ సమీపంలోని వాగులో స్నానానికి దిగి, ఆకస్మికంగా వచ్చిన వరద ప్రవాహంలో విజయవాడకు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీలేష్ గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న నీలేష్ తన ఐదుగురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు బయలుదేరాడు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఈ బృందం విజయవాడ, రాజమహేంద్రవరం, అన్నవరం, విశాఖపట్నం, అరకు, వంజంగి సందర్శించిన అనంతరం మారేడుమిల్లికి చేరుకుంది. మంగళవారం మారేడుమిల్లి నుంచి చింతూరు వైపు వస్తూ, తులసిపాక గ్రామానికి సమీపంలోని 'సోకిలేరు వ్యూ పాయింట్' వద్ద ఆగారు. వ్యూ పాయింట్ కింద ప్రవహిస్తున్న వాగులో సరదాగా స్నానం చేసేందుకు ఆరుగురు మిత్రులూ దిగారు. అయితే, ఎగువ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా భారీగా వరద నీరు పోటెత్తడంతో ప్రవాహ తీవ్రతకు ఆరుగురూ నీటిలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ, పోలీసు అధికారులు స్థానికుల సహాయంతో తక్షణమే సహాయక చర్యలు చేపట్టి ఐదుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్...