హిజ్బుల్లా సొరంగ మార్గాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైన్యం : రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో కృత్రిమ భూకంపంగా నమోదు
ద క్షిణ లెబనాన్ లోని హిజ్బుల్లా నిర్మించిన ప్రధాన సొరంగ మార్గాలను ఇజ్రాయెల్ సైన్యం అత్యంత శక్తివంతమైన పేలుళ్లతో ధ్వంసం చేసింది. పరిసర ప్రాంతాల్లో ఈ పేలుడు తీవ్రతకు రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో కృత్రిమ భూకంపం నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే, లెబనీస్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం నబాతీయే సమీపంలో 4.1 తీవ్రతతో భూకంప ప్రకంపనలు రికార్డయ్యాయి. ఇది సహజమైన భూకంపం కాదని, ఉపరితలం కింద ఉన్న సొరంగాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం దాదాపు 1,100 టన్నుల భారీ పేలుడు పదార్థాలను ఉపయోగించడం వల్లే సంభవించిన కృత్రిమ భూకంపం అని సైంటిస్టులు స్పష్టం చేశారు. పర్వతాల కింద నిర్మించిన రెండు కిలోమీటర్లకు పైగా పొడవైన సొరంగాలతో పాటు ఆయుధ డిపోలు, కమాండ్ సెంటర్లను పూర్తిగా నాశనం చేసినట్లు ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పేలుడు తీవ్రతకు రాత్రి వేళ ఆకాశంలోకి భారీ అగ్ని గోళం ఎగిసిపడింది. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ పంచుకున్నారు. హిజ్బుల్లాకు చెందిన బదర్ విభాగానికి ఈ భూగర్భ నెట్వర్క్ ప్రధాన కమాండ్ సెంటర్‌గా పనిచేస్తోందని ఇజ్రాయెల్ వెల్లడించింది. 5.4 కిలోమీటర్లకు పైగా విస్త...