సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు మరణశిక్ష: డమాస్కస్ క్రిమినల్ కోర్టు
సి రియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్, ఆయన సోదరుడు మాహెర్ అల్-అసద్ మరియు ఇతర మాజీ అధికారులకు డమాస్కస్‌లోని క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. సుమారు 14 ఏళ్ల పాటు కొనసాగిన సిరియా అంతర్యుద్ధంలో దాదాపు 5 లక్షల మంది మరణానికి, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దారుణమైన నేరాలకు గానూ ఈ చారిత్రాత్మక తీర్పు వెలువడింది. వీరు ప్రస్తుతం రష్యాలో శరణార్థులుగా ఉన్నందున కోర్టు వీరిని 'ఇన్ అబ్సెంటియా' దోషులుగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. దారా ప్రావిన్స్ రాజకీయ భద్రతా విభాగ మాజీ అధిపతి మరియు అసద్ బంధువైన అతేఫ్ నజీబ్ సిరియా అధికారులకు చిక్కడంతో కోర్టులో నేరుగా హాజరుపరిచారు. దారాలో 2011లో చిన్నారులపై జరిగిన చిత్రహింసలు, అణచివేత మరియు దారుణ హత్యలకు సంబంధించి ఆయనకు మరణశిక్ష ఖరారు చేశారు. 2024 డిసెంబర్ 8న తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకోవడంతో, దాదాపు ఐదు దశాబ్దాలుగా సాగుతున్న అసద్ కుటుంబ నియంతృత్వ పాలన ముగిసింది. అనంతరం అసద్ తన కుటుంబంతో కలిసి మాస్కోకు పారిపోయారు. ప్రస్తుతం అహ్మద్ అల్-శారా నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం సిరియా బాధ్యతలను నిర్వహిస్తోంది. అసద్ హయాంలో జరిగిన ...