Posts

Showing posts with the label Apple iPhone 14 Pro

ఐఫోన్ 14లో ఏడాదిలోపే బ్యాటరీలో సమస్యలు !

Image
ఆ పిల్ కంపెనీ తయారు చేసిన Apple iPhone 14, Apple iPhone 14 Pro పట్ల వినియోగదారుల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ఫోన్లలో పలు రకాల బ్యాటరీ సమస్యలు తలెత్తుతున్నాయని మండిపడుతున్నారు. చాలా మంది iPhone 14, iPhone 14 Pro వినియోగదారులు బ్యాటరీ సమస్యలను గుర్తించారు. ఈ ఫోన్లు కొనుగోలు చేసి ఏడాది గడవక ముందే, గణనీయంగా బ్యాటరీ లైఫ్ పడిపోతున్నట్లు గమనించారు. అంతేకాదు, తమ ఫోన్లలోని బ్యాటరీ సమస్యలను వివరిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. "నా iPhone 14 ప్రో బ్యాటరీ లైఫ్ చాలా పేలవంగా ఉంది. ఉదయం 8 గంటలకు ఫుల్ ఛార్జ్ చేశాను. సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయిలో అయిపోయింది” అని ఐఫోన్ 14 ప్రో వినియోగదారుడు డేనియల్ వెల్లడించారు. WSJ కాలమిస్ట్ జోవన్నా స్టెర్న్ కూడా తన iPhone 14లోని బ్యాటరీ సమస్యల గురించి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. "నా iPhone 14 Pro ఒక సంవత్సరంలో గానే బ్యాటరీ సామర్థ్యం 88 శాతానికి తగ్గింది. నా ఫోన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్లే ఈ సమస్య తలెత్తిందా? ఈ సమస్యకు 450 ఛార్జ్ సైకిల్స్ కారణమా? లేక ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఇలా జరుగుతోందా? బ్యాటరీలో ఏదైనా సమస్య ఉంద...