ఢిల్లీ అగ్ని ప్రమాదం : మరో తీవ్ర విషాదం
ఢి ల్లీలోని మాలవ్య నగర్‌లోని హోటల్ అగ్నిప్రమాద ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎనిమిది మంది కుటుంబ సభ్యుల మరణం గురించి తెలియక ముందే ఆ కుటుంబంలోని చివరి గుండె ఆగిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబంలోని ఏకైక సభ్యుడు 80 ఏళ్ల వృద్ధుడు రాధే శ్యామ్ అగర్వాల్ కూడా ఈరోజు కన్నుమూశారు. దీంతో మొత్తం కుటుంబం ఆహుతైపోయిన ఘటన కలచి వేస్తోంది. ఆ ఇంట్లో నవ్వుతూ, ఆనందంగా గడిపిన కుటుంబం ఇప్పుడు సమూలంగా సమాధి అయిపోయింది. ఈ ఘోర కలి వార సమీప బంధువుల్లో ఎప్పటికీ పూడ్చలేని ఒక పెద్ద గాయాన్ని మిగిల్చింది. అగర్వాల్ కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుండి తప్పించుకుని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏకైక సభ్యుడు కూడా మృతిచెందడం కూడా కలిచివేసింది. శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న రాధే శ్యామ్ అగర్వాల్ సాకేత్‌లోని 'మాక్స్ హాస్పిటల్' ఐసీయూ (ICU) లో చికిత్స పొందుతున్నారు.అయితే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం, దేనికైనా సిద్ధంగా ఉండాలని వైద్యులు చెప్పడంతో,దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న 'ఫ్లోరిష్ ఇన్' అనే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్...