చైనా మార్కెట్లో హానర్ కొత్త టాబ్లెట్ ప్యాడ్ X10 ప్రో మ్యాక్స్ లాంచ్ అయింది. 13 అంగుళాల భారీ డిస్‌ప్లేతో పాటు 10,100mAh బ్యాటరీ అందించారు. చదువుకునే విద్యార్థుల నుంచి వీడియో కాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం టాబ్లెట్ వాడేవారి వరకు ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ధరను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే, అధికారిక వెబ్‌సైట్‌లో టాబ్లెట్ లిస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. కాంగ్‌షాన్ గ్రే, ఫారెస్ట్ గ్రీన్ అనే 2 కలర్ ఆప్షన్లలో లభించనుంది. వై-ఫై వేరియంట్లలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 6GB + 256GB, 8GB + 256GB మోడల్స్ ఉన్నాయి. చైనాలో ఈ టాబ్లెట్ సేల్స్ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ టాబ్లెట్‌లో స్పెషల్ అట్రాక్షన్ 13 అంగుళాల భారీ డిస్‌ప్లే. సినిమాలు, ఆన్‌లైన్ క్లాసులు, స్టడీ, మల్టీటాస్కింగ్‌కు ఈ బిగ్ స్క్రీన్ అద్భుతంగా ఉంటుంది. మరోవైపు 10,100mAh బ్యాటరీ కారణంగా ఎక్కువసేపు వాడినా ఛార్జింగ్ వెంటనే దిగదు. లాంగ్ టైమ్ వస్తుంది. హానర్ స్పెషల్ ఫోకస్ కెమెరాలపైనే పెట్టినట్టు కనిపిస్తోంది. ఇందులో బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉండగా, ఫ్రంట్ సైడ్ 8MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీలకు చాలా అద్భుతంగా ఉంటుంది. హానర్ ట్యాబ్ విద్యార్థుల స్టడీకి సంబంధించి అనేక ఏఐ ఫీచర్లను అందిస్తోంది. వన్-టు-వన్ స్టడీ గైడెన్స్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో పాటు ఏఐ ఆధారిత లెర్నింగ్ ఫీచర్లతో హానర్ ప్యాడ్ X10 ప్రో మ్యాక్స్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
3
Beranda › Posts filed under 100mAh battery
Showing posts with label 100mAh battery. Show all posts
Showing posts with label 100mAh battery. Show all posts
హానర్ ప్యాడ్ ఎక్స్ 9 మ్యాక్స్ విడుదల
హానర్ ప్యాడ్ ఎక్స్ సిరీస్ లో హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల చేసింది. 13-అంగుళాల 2.5K డిస్‌ప్లే, 10,100mAh భారీ బ్యాటరీ, Snapdragon 6s Gen 2 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఈ టాబ్లెట్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ డివైస్ ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది రెండు వేరియంట్లలో విడుదలైంది. 4GB RAM + 128GB స్టోరేజ్ – GBP 349.99 (సుమారు రూ.45,000), 6GB RAM + 256GB స్టోరేజ్ – GBP 449.99 (సుమారు రూ.58,000). ఈ టాబ్లెట్ ప్రస్తుతం హానర్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఎంపిక చేసిన దేశాల్లో విక్రయానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం గ్రే రంగులో మాత్రమే లభిస్తోంది. పెద్ద డిస్‌ప్లే కారణంగా వీడియోలు చూడటం, ఆన్‌లైన్ క్లాసులు, డాక్యుమెంట్ పనులు, గేమింగ్‌కు ఇది అనువుగా ఉంటుంది. టాబ్లెట్ Android 16 ఆధారిత MagicOS 10పై పనిచేస్తుంది. ఈ టాబ్లెట్‌లో Qualcomm Snapdragon 6s Gen 2 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఇందులో నాలుగు Performance కోర్లు, నాలుగు Efficiency కోర్లు ఉండటంతో రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్ కూడా సులభంగా నిర్వహించవచ్చు. 5MP రియర్ కెమెరా (Auto Focus, f/2.2), 5MP ఫ్రంట్ కెమెరా (f/2.2). ఈ కెమెరాలు వీడియో కాల్స్, ఆన్‌లైన్ మీటింగ్‌లు, సాధారణ ఫోటోగ్రఫీకి అనుకూలంగా ఉంటాయి. ఈ టాబ్లెట్‌లో 10,100mAh బ్యాటరీను అందించారు. ఇది 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. కంపెనీ ప్రకారం 13 గంటల వరకు ఈ-బుక్స్ లేదా డాక్యుమెంట్లు చదవవచ్చు. 16 గంటల వరకు వీడియోలు చూడవచ్చు.
Subscribe to:
Posts (Atom)