టీఆర్ఎస్ అధినేత్రి కవితను ఉద్దేశించి నిన్న తాను చేసిన వ్యాఖ్యల్ని వాడుకుని విపక్ష బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో రెచ్చిపోవడంపై తెలంగాణ మంత్రి సీతక్క మండిపడ్డారు. కవితపై తన వ్యాఖ్యలు పొరబాటే అని ఆమె అంగీకరించారు. తాను ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశానో వివరణ ఇచ్చారు. దాన్ని పట్టుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ ను సీతక్క తప్పుబట్టారు. గతంలో కేటీఆర్ కవితపై చేసిన వ్యాఖ్యల్ని తాను ప్రస్తావించే క్రమంలో ఈ పొరబాటు జరిగిందన్నారు. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో పొరపాటు జరిగిందంటూ మంత్రి సీతక్క ఇవాళ విచారం వ్యక్తం చేశారు. నిన్న ములుగులో చేయూత పెన్షన్ల పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడే క్రమంలో కవిత మాటలను ఉటంకిస్తుండగా పొరపాటున ఆ పదం దొర్లిందని ఇవాళ సీతక్క వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని సరిదిద్దుకున్నప్పటికీ.. బీఆర్ఎస్ శ్రేణులు కావాలనే వీడియోను వైరల్ చేస్తూ ట్రోల్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో బీఆర్ఎస్ తనను క్యాన్సర్ పేషెంట్‌గా చిత్రీకరించిందని.. కవిత స్వయంగా ఓ మీడియా ఛానెల్‌కు చెప్పిన విషయాన్నే తాను ప్రస్తావించానని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అయితే ఇందులో క్యాన్సర్ కు బదులుగా తాను ఎయిడ్స్ అన్న పదాన్ని పొరబాటున వాడినట్లు సీతక్క తెలిపారు. వరంగల్ పర్యటనలో పెన్షన్లపై కేటీఆర్ చేసిన తప్పుడు ప్రచారాన్ని తాను తిప్పికొట్టాననే అక్కసుతోనే.. తన మాటలను వక్రీకరిస్తున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాజకీయ ప్రత్యర్థులను సిద్ధాంతపరంగానే ఎదుర్కొంటానని, వ్యక్తిగత విమర్శలు చేయడం తన నైజం కాదని రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసని సీతక్క ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
3
Beranda › Posts filed under "I confront political opponents on ideological grounds; making personal attacks is not my nature." The slip-up occurred while quoting Kavitha’s own words
Showing posts with label "I confront political opponents on ideological grounds; making personal attacks is not my nature." The slip-up occurred while quoting Kavitha’s own words. Show all posts
Showing posts with label "I confront political opponents on ideological grounds; making personal attacks is not my nature." The slip-up occurred while quoting Kavitha’s own words. Show all posts
Subscribe to:
Posts (Atom)
